ఆయుష్షు పెంచే డ్రగ్‌ ట్రయల్‌!..ఏకంగా వెయ్యి కుక్కలపై.. A New Drug That Could Extend Dogs Lives, 1000 US Dogs Clinical Trail For LOY-001 | Sakshi
Sakshi News home page

ఆయుష్షు పెంచే డ్రగ్‌ ట్రయల్‌!..ఏకంగా వెయ్యి కుక్కలపై..

Published Mon, Feb 5 2024 3:16 PM | Last Updated on Mon, Feb 5 2024 3:47 PM

A New Drug That Could Extend Dogs Lives, 1000 US Dogs Clinical Trail For LOY-001 - Sakshi

ఆయుర్దాయం పెంచడం ఎలా అనేదాని గురించి శాస్త్రవేత్తలు ఎన్నేళ్లుగానో పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగానే పెంపుడు జంతువుల ఆయువుని పెంచే సరికొత్త పిల్‌ని ఆవిష్కరించారు యూఎస్‌ శాస్త్రవేత్తలు. ఈ డ్రగ్‌ విజయవంతంగా పనిచేస్తుందా? లేదా? అనే దాని గురించి యూఎస్‌లోని సుమారు వెయ్యి కుక్కలపై ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. అయితే పెద్ద జాతి కుక్కలపై డ్రగ్‌ సత్ఫలితాలు ఇవ్వడంతో చిన్న జాతి కుక్కలపై ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. ఇది విజయవంతమైతే పెంపుడు జంతువుల దీర్ఘాయువుని పెంచడమే గాక మానువుల ఆయుర్దాయన్ని పెంచగలిగే సరికొత్త ఆశను రేకెత్తిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. 

వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన మాట్ కేబర్లీన్ శాస్త్రవేత్తల బృందం ఈ ప్రతిష్టాత్మకమైన పరిశోధనకు నాయకత్వం వహిస్తుంది.'ది డాగ్ ఏజింగ్ ప్రాజెక్ట్' పేరుతో ఈ పరిశోదన చేస్తున్నారు. అందుకోసం ముందుగా యూఎస్‌ అంతటా ఉన్న పెద్ద జాతి పెంపుడు కుక్కల యజమానులు ఈ పరిశోధనలో నమోదు చేయించుకున్నారు. ఈ పరిశోధనలో పాల్గొనే కుక్కుల వైద్య చరిత్రను వివరణాత్మకంగా విశ్లేషించింది పరిశోధక బృందం. ఆ తర్వాత ఆ కుక్కల నుంచి వెంట్రుకలు, బ్లండ్‌ శాంపుల్స్‌, మూత్ర నమునాల వంటి వాటన్నింటిని సేకరంచారు. ఇక యాంటీ ఏజింగ్‌ పిల్‌ని ఇస్తూ..ఆయా కుక్కల వృధాప్య లక్షణాలను ట్రాక్‌ చేయడం ప్రారంభించారు. తొలుత శాస్త్రవేత్తలు పెద్ద జాతి కుక్కలపై అధ్యయనం నిర్వహించేలా లాయ్‌-001-పిల్‌(LOY-001)ని తీసుకొచ్చారు.

ఇది ఐజీఎఫ్‌-1(IGF-1) స్థాయిలను ప్రేరేపిస్తుంది. అంటే ఆయవును పెంచే దిశగా కణాల పెరుగుదలను ప్రేరిపించే హార్మోన్‌ ఇది. ఈ పిల్‌ ఐజీఎఫ్‌-1 ఓవర్‌ ఎక్స్‌ప్రెషన్‌కి నిరోధించి కుక్క జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. ఈ పిల్‌కి సెంటర్‌ ఫర్‌ వెటర్నరీ మెడిసిన్‌కి సంబంధించిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) ఆమోదం కూడా లభించడం విశేషం. ఇక ఈ పిల్‌ని జంతు ఆరోగ్య బయోటెక్‌ కంపెనీ లాయల్‌ అభివృద్ధి చేసింది. ఈ ఔషధం కుక్కలలోని వృధాప్య సంబంధ రుగ్మతలను తగ్గించి జీవితకాలాన్ని పొడిగిస్తుంది. దీన్ని చాలామంది కుక్కల యజమానులు స్వాగతించారు.

ఇక డాగ్ ప్రేమికురాలు, బీఫ్ సిరీస్ సృష్టికర్త లీ సంగ్ జిన్ కూడా ఇలా ఎఫ్‌డీఏ తొలిసారిగా యాంటీ ఏజింగ్‌కి సంబంధించిన ఔషధాన్ని ఆమోదించడాన్ని స్వాగతించారు. ఇది చాలా మంచి విషయం, తొందరగా ఫాస్ట్‌ ట్రాక్‌ చేసి కుక్కల ఆయువును పెంచేయండి అని పిలుపునిచ్చారు. మరి పెద్దకుక్కల కోసం పిల్‌ని తెచ్చారు మరీ చిన్న జాతి కుక్కలు సంగతేంటీ అన్ని ప్రశ్నించారు లీ. అందుకు ప్రతిస్పందనగా లాయల్‌ కంపెనీ లాయ్‌-002 అనే పిల్‌ని పరీక్షించనున్నట్లు ఫిబ్రవరిని 1న ప్రకటించింది. ఇది చిన్నవి మినహ సీనియర్‌ కుక్కల జీవితకాలం పొడిగించేందుకు రూపొందించబడిన జీవితకాల మాత్ర. దీన్ని స్టడీ(study) అనే పేరుతో చిన్న జాతిలోని పెద్ద వయసు కుక్కలపై ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు పరిశోధకులు. అందులో భాగంగా తొలి మోతాదు బూ అనే 11 ఏళ్ల విప్పేట్‌ తీసుకున్నట్లు యజమాని డెబ్‌ హన్నా పేర్కొన్నారు. 

ఇది పెద్ద వయసుగల శక్తిమంతమైన కుక్క కావడంతో పరిశోధనలో చేర్చుకోవడమేగాక మొదటి డోసు దీనికే ఇచ్చారని వెల్లడించారు యజమాని హన్నా. ఈ పరిశోధన యూఎస్‌ అంతటా ఉన్న 55 వెటర్నరీ క్లినిక్‌లో నిర్వహిచనున్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. వివిధ జాతులు, వయస్సులు, ఆరోగ్యం డేటా వారిగా సుమారు వెయ్యి కుక్కలపై ఈ ట్రయల్స్‌ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం ఆయా యజమానులు తప్పనసరిగా ముందుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పరిశోధనలో తమ కుక్కలు భాగం కావాలంటే ​..నమోదు సమయంలో వాటి వయసు పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ, బరువు 6.4 కేజీలు ఉండాలి.

అలాగే ఆయాయజమానులు తమ కుక్కలు నాలుగేళ్ల వరకు ఈ పరిశోధనలో పాల్గొనాలి అనే నిబంధనకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఈ పరిశోధన విజయవంతమైతే కుక్కల ఆయుష్షు పెరగడమే గాక మనుషుల దీర్ఘాయువుకు మార్గం సుగమం చేస్తుంది. కుక్కలు మానవులుకు అద్భుత నమునాలుగా పనిచేస్తాయి.కాబట్టి కుక్కల కోసం రూపొందించిన యాంటీ ఏజింగ్‌ డ్రగ్‌ పురోగతి మానవులకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. 

(చదవండి: పూనం పాండే కన్నుమూత: సర్వైకల్‌ కేన్సర్‌.. మహిళలకు ఓ శాపం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement