సంక్రాంతికి పతంగులు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా? | Makar Sankranti 2024 special do you know significance of kites flying | Sakshi
Sakshi News home page

Makar Sankranti 2024: పతంగులు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా?

Published Sat, Jan 13 2024 9:41 AM | Last Updated on Sat, Jan 13 2024 10:08 AM

Makar Sankranti 2024 special do you know significance of kites flying - Sakshi

సంక్రాంతి  సంబరం అంటే చుట్టాలు పక్కాలు, అరిసెలు, స్వీట్లు, భోగి పళ్లు, గంగిరెద్దులు, గొబ్బెమ్మల ముచ్చటే కాదు.  వీటన్నింటికి మించి మరో పండుగ కూడా ఉంది.  అసలు సంక్రాంతి అంటేనే చాలా ప్రదేశాల్లో పతంగుల పండుగ. , రెండు నెలల ముందు నుంచి పిల్లలు, పెద్దలు గాలి పటాలను ఎగుర వేస్తారు.   ఎవరికి నచ్చిన సైజులు,  ఆకారాల్లో రకరకాల గాలి పటాలను ఎగురవేస్తూ ఆనందంలో మునిగి  తేలతారు. ఆకాశంలో ఎటు చూసినా  పట్ట పగలే నక్షత్రాలొచ్చాయా అన్నట్టు గాలిపటాలు దర్శనిమిస్తాయి.  తెలంగాణా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పతంగులు గురవేయడాన్ని పండగలా నిర్వహిస్తారు సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారు..? చరిత్ర ఏమిటి..? ఎక్కడి నుంచి మొదలైంది?

తొలి రోజుల్లో వీటిని ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారట. దాదాపు 2 వేల సంవత్సరాల కిందట చైనాలో వీటిని తయారు చేశారట. సిగ్నలింగ్‌, మిలటరీ ఆపరేషన్స్‌లోనూ వీటిని వినియోగించారు. చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు.

 మకర సంక్రాంతికి శీతాకాలం ముగిసి  వసంత రుతువు ప్రారంభానికి సూచికగా చూస్తారు  గాలిపటాలను పగటిపూట ఎగరవేయడంలో ఒక ఆరోగ్యపరమైన కారణం కూడా ఉంది. పతంగులు ఎగురవేయడం అనేది దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పడానికి ఒక మార్గం అని కొందరు విశ్వసిస్తారు. గాలిపటాలు ఎగరేసేటపుడు ఎక్కువ సమయం  మన బాడీ సన్‌లెటై్‌కి ఎక్స్‌పోజ్‌ అవుతుంది. అంతేకాదు లేలేత సూర్యకిరణాల్లో విటమిన్ డి లభిస్తుంది. సూర్యుడి లేతకిరణాలు చర్మంపై పడితే చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.  అలాగే చలిగాలుల వల్ల కలిగే అనేక అంటువ్యాధులు, అనారోగ్యాలతో పోరాడేందుకు ఎంతో సహాయ పడుతుంది.ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం కంటిచూపును మెరుగు పరుస్తుందని చైనీయుల విశ్వాసం. తల పైకి ఎత్తి చూసేటపుడు నోరు కొద్దిగా తెరచు కుంటుందని,  అది శరీరానికి శక్తిని ఇస్తుందని  కూడా వారు నమ్ముతారు.

మొదట్లో వీటిని ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారట. ఆ తర్వాత సిగ్నలింగ్‌, మిలటరీ ఆపరేషన్స్‌లోనూ వీటిని వినియోగించారు. ఒకప్పటి గాలిపటాలు మందంగా, దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. క్రీస్తుపూర్వం 206లో చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. దుర్మార్గుడైన రాజును ఓడించేందుకు  వచ్చిన ఆలోచనే తొలి గాలిపటం. ఇందులో భాగంగా కోటలోకి సొరంగాన్ని తవ్వాలనేది హేన్‌ చక్రవర్తి ప్లాన్‌.  అలా ఒక పతంగ్‌ను తయారు చేసి దానికి  దారం కట్టి ఎగరవేశాడు. ఆ దారం ఆధారంగానే,  సొరంగం తవ్వి సైనికులను పంపి కోటను  వశం చేసుకున్నాడని చెబుతారు.

ఈ  నియమాలు తెలుసా?
పతంగులు ఎగురవేసేటపుడు కొన్ని నిబంధనలు కూడా పాటించాలి.  ఇది ఆయా దేశాలని  బట్టి ఉంటాయి. థాయ్‌లాండ్‌లో పతంగులు ఎగురవేయాలంటే 78 రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. బెర్లిన్ గోడపై నుంచి అవతలికి వెళ్ళే అవకాశం ఉండడంతో భారీ గాలిపటాలను ఎగురవేయడంపై తూర్పు జర్మనీలో నిషేధం విధించారు. జపాన్‌లో కొన్ని గాలిపటాల బరువు కొన్ని కిలోల వరకు ఉంటుందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement