గుట్ట గుట్టలుగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు : ఈ పాపంలో మనం కూడా! | India among 12 nations responsible for 60 Percent of mismanaged plastic waste | Sakshi
Sakshi News home page

గుట్ట గుట్టలుగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు : ఈ పాపంలో మనం కూడా!

Published Sat, Apr 13 2024 3:52 PM | Last Updated on Sat, Apr 13 2024 3:53 PM

India among 12 nations responsible for 60 Percent of mismanaged plastic waste - Sakshi

మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో  ఒకటి కాలుష్య భూతం. ముఖ్యంగా భూమి మీద గుట్టలుగుట్టలుగా పేరుకు పోతున్న  ప్లాస్టిక్‌ వ్యర్థాలపై కీలక సర్వే మరింత ఆందోళన రేపుతోంది. ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయని తాజా రిపోర్టులో వెల్లడైంది. ప్రపంచంలో ఈ ఏడాది ఉత్పత్తి అయిన  22 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలలో దాదాపు 7 కోట్ల టన్నులను ప్రపంచ దేశాలు శుద్ధి చేయకుండా వదిలివేశాయని ‘ఈఏ ఎర్త్ యాక్షన్’ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. 

ప్లాస్టిక్‌  వ్యర్థాలతో  పర్యావరణానికి చేటు కలుగుతోంది. ఇది  ప్రపంచానికే పెను సవాల్‌గా మారింది.  భూగోళానికి మరింత ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్‌ వ్యర్థాలపై చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు  కోరుతూనే ఉన్నారు. తాజా  ఎర్త్ యాక్షన్ సర్వేలో  కీలక విషయాలు వెలుగు చూశాయి. మొత్తంగా పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో సగానికి పైగా అంటే  దాదాపు 60 శాతం వ్యర్థాలకు కారణం కేవలం 12 దేశాలేనని  తేలింది. ఈ జాబితాలో భారత దేశం పేరు కూడా ఉండటం గమనార్హం.అయితే, మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు తక్కువని చెప్పింది. కెనడాలోని ఒట్టావాలో ఐక్యరాజ్యసమితి ఇంటర్‌గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ (INC) నాల్గవ సమావేశానికి ముందు  ఈ రిపోర్ట్‌ వెలుగులోకిచ్చింది. 

అమెరికా, చైనా, భారత్‌ సహా
ఈ జాబితాలో అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్థాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండినేషియా, టర్కీ, వియత్నాం దేశాలున్నాయి. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో శుద్ధి చేయని ప్లాస్టిక్ వ్యర్థాలు 8 కిలోలు మాత్రమే. ఇది అమెరికా వ్యర్థాల్లో మూడోవంతు, చైనా వ్యర్థాల్లో ఐదో వంతు కన్నా తక్కువే. ప్లాస్టిక్ మిస్ మేనేజ్‌మెంట్‌లో  చైనా టాప్‌లో ఉందని పేర్కొంది. తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement