దీపికా పదుకొణె, అలియా భట్‌ల బ్యూటీ సీక్రెట్‌ ఇదే..! Ice for Face: Benefits Of Cold Facials For Puffy Eyes And Acne | Sakshi
Sakshi News home page

దీపికా పదుకొణె, అలియా భట్‌ల బ్యూటీ సీక్రెట్‌ ఇదే..!

Published Tue, Jun 4 2024 6:54 PM | Last Updated on Tue, Jun 4 2024 7:00 PM

Ice for Face: Benefits Of Cold Facials For Puffy Eyes And Acne

సినీ తారలు ఎంతలా గ్లామర్‌ మెయింటెయిన్‌ చేస్తారో మనకు తెలిసిందే. మూడు పదుల వయసులో వన్నె తరగని అందం, గ్లామర్‌ వారి సొంత. ముఖ్యంగా వయసు పైనబడినట్లు కనిపించకుండా యవ్వనపు మేని ఛాయాలా కనిపించేందుకు ఏం చేస్తారో తెలుసుకోవాలని కుతుహలంగా ఉంటారు అభిమానులు. వారిలా ఉండేలా రకరకలుగా అందానికి సంబంధించిన ‍ప్రయోగాలు చేస్తుంటారు. ఇంతకీ అందాల భామలు బ్యూటీ రహస్యం ఏంటంటే..

బాలీవుడ్‌ అగ్ర తారలు దీపకా పదుకొణె దగ్గర నుంచి అలియా భట్‌ వరకు అంతా ఐస్‌ ఫేషియల్‌కి ప్రాధాన్య ఇస్తారు. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందట. ముఖం తాజాగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ముడతలను మాయం చేస్తుందట. ఉబ్బిన కళ్లకు మంచి ఫలితం ఉటుందట. కళ్లు చుట్టూతా ఉన్న ఉబ్బిన భాగ్నాన్ని నార్మల్‌గా మారుస్తుందట. 

ఇదెలాగంటే..

  • ఏం లేదు ఉదయాన్నే చక్కగా ముఖాన్ని ఫేస్‌వాష్‌ లేదా సబ్బుతో క్లీన్‌ చేసుకుని చక్కగా ఫ్రీజ్‌లోని ఐస్‌ క్యూబ్‌లతో థెరఫీ చేయించుకుంటారు. ఇది కళ్ల చుట్టు ఉన్న వలయాన్ని, ఉబ్బిన చర్మాన్ని రిపేర్‌ చేస్తుంది. క్యూబ్‌ చేతితో పట్టుకుని ముఖంపై  అప్లై చేసుకోవడం ఇబ్బందిగా  ఉండొచ్చు. అలాంటప్పుడు ఐస్‌నిఒక పల్చటి క్లాత్‌లో చుట్టి ముఖంపై అప్లై చెయ్యొచ్చు. 

  • ఈ థెరపీ ముఖంపై రంధ్రాలను దగ్గర చేసి, మృదువుగా మారుస్తుంది. అలాగే ముఖంపై ఉండే మంట, ఇరిటేషన్‌ల నుంచి కూడా మంచి ఉపశమనం ఇస్తుంది.

  • అలాగే ముఖమంతా రక్తప్రసరణ జరిగి..చర్మానికి సహజమైన మెరుపుని ఇస్తుంది. ముఖ్యంగా మొటిమల సమస్యను నివారిస్తుంది

  • గ్రీన్‌ టీ, దోసకాయ రసం వంటి వాటిని ఐస్‌ క్యూబ్‌లకు జోడించి అప్లై చేస్తే చర్మానికి అవసరమయ్యే యాంటిఆక్సిడెంట్లు అందుతాయి. 

అబ్బా చలి..చలిగా.. ఉండి ముఖంపై పెట్టేకునేందుకు వామ్మో..! అనిపించేలా ఉన్నా..ఈ కోల్డ్‌ థెరపీ చర్మ సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. 

(చదవండి: అనంత్‌-రాధిక ప్రీ వెడ్డింగ్‌: నీతా అంబానీ వాచ్‌ ధర అన్ని కోట్లా..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement