ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్‌ ఉద్యోగి Google Engineer Said That The Job Search Process Is Not Easy | Sakshi
Sakshi News home page

ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు! గూగుల్‌ ఉద్యోగి

Published Sun, May 5 2024 6:14 PM | Last Updated on Sun, May 5 2024 6:20 PM

Google Engineer Said That The Job Search Process Is Not Easy

చాలామంది తమకు ఇష్టమైన డ్రీమ్‌ కంపెనీలో ఉద్యోగం పొందేందుకు ఎంతో కష్టపడతారు. ఆ క్రమంలో ఒక్కోసారి ఫెయిల్యూర్స్‌ వస్తుంటారు. తమ తోటి వాళ్లు సెలెక్ట్ అవుతున్న వీళ్లు మాత్రం పెయిల్‌ అవ్వుతూనే ఉండటంతో వెంటనే తమని తాము నిందించుకుంటూ ‍ప్రయత్నాలు విరమించుకుంటుంటారు. అలాంటి వారికి గూగుల్‌లో పనిచేస్తున్న ఓ ఇంజినీర్‌ ఆసక్తికరమైన సలహాలు సూచనలు ఇస్తోంది. ఐతే ఇక్కడ ఆమె కూడా అంత ఈజీగా ఈ కంపెనీలో ఉద్యోగం పొందలేదట.

ఆమె పేరు క్విన్‌గ్యూ వాంగ్‌. గూగుల్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఆమె కొత్తగా ఉద్యోగాల కోసం సర్చ్‌ చేయాలనుకునేవాళ్లు ముందు ఇలాంటి పనులు చేయకూడదంటూ..తన అనుభవాలను గురించి చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాన్వేషణలో మిమ్మల్ని తక్కువ చేసుకుని నిందించుకోవడం వంటివి చేస్తారు. ఇదే ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణం అని అంటోంది. తాను కూడా ఉద్యోగ అన్వేషణలో ఇలానే చేసి ఒకటి రెండు కాదు ఏకంగా ఐదుసార్లే ఫెయిల్‌ అయినట్లు చెప్పుకొచ్చింది. 

తాను తొలిసారిగా 2018లో గూగుల్‌లో ఉద్యోగం కోసం ట్రై చేశానని, ఆ టైంలో ఆన్‌లైన్‌ అసాస్‌మెంట్‌ (ఓఏ) రౌండ్‌లోనే పోయిందని చెప్పింది. అయితే ఇంటర్వ్యూర్‌ నాకు మరో అవకాశం ఇచ్చారు గానీ దురదృష్టవశాత్తు ఆ అవకాశం కూడా వినయోగించుకోలేకపోయా. మళ్లీ మూడోసారి అదే కంపెనీలో తన ప్రయత్నం 2020లో ప్రారంభమయ్యింది. అందులో కూడా ఫోన్‌ స్క్రీన్‌ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించలేదు. 

దీంతో సైట్‌ రిలయబిలిటీ ఇంజీనీర్‌ రిక్రూట్‌మెంట్‌కి దరఖాస్తు చేశా నాలుగో రౌండ్‌లో మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చినా..సరిగ్గా మహమ్మారి కావడంతో ఆ ఇంటర్వ్యూని క్యాన్సిల్‌ చేసింది. ఇక ఐదో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించడమే గాక టెక్‌ దిగ్గజం నుంచి అభినందనల తోపాటు ఉద్యోగం సంపాదించటం చాలా కష్టం అని వ్రాసిన పేపర్‌ను కూడా అందుకుంది వాంగ్‌. ఎట్టకేలకు వాంగ్‌ ఐదో 
ప్రయత్నంలో తాను కోరుకున్నట్లుగా సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించింది. 

అందుకు సంబంధించిన కాగితాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ..ఉద్యోగాన్వేషణ ప్రక్రియ అంత సులువు కాదనీ, కష్టపడి లక్ష్యాన్ని అందుకోవాలని అంది. ఆ క్రమంలో ఓటమి ఎదురైనా ప్రతిసారి మిమ్మల్ని నిందించుకోవడం లేదా అవమానంగా భావించడం మానేయాలని చెబుతోంది. ఎన్ని తిరస్కరణలు ఎదురైనా.. ప్రయత్నం విరమించకుండా అనుకున్నది సాధించాలని అంటోంది వాంగ్‌. ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవ్వడమేగాక లక్షకు పైగా వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి.

(చదవండి: అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!)

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement