విడాకుల మహోత్సవం Father celebrates his daughter's divorce with a baraat | Sakshi
Sakshi News home page

విడాకుల మహోత్సవం

Published Sat, Jun 1 2024 8:04 AM | Last Updated on Sat, Jun 1 2024 8:04 AM

Father celebrates his daughter's divorce with a baraat

‘మా అమ్మాయి పెళ్లి’ అని చెప్పడానికి సంతోషించే తల్లిదండ్రులు విడాకుల విషయం చెప్పడానికి మాత్రం ఇబ్బంది పడతారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి అనిల్‌ కుమార్‌ మాత్రం ‘నరకప్రాయమైన సంసారం కంటే విడాకులే సో బెటర్‌’ అంటున్నాడు.

అనిల్‌ అల్లుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అత్తింటి వాళ్లు అదనపు కట్నం కోసం రకరకాల బాధలకు గురి చేస్తుంటే తట్టుకోలేక అనిల్‌ కుమార్తె ఉర్వీ భర్త నుంచి విడాకులు తీసుకుంది. బ్యాండ్‌ బాజాలతో నిర్వహించిన ఉర్వీ విడాకుల మహోత్సవం వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. 


 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement