జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు | Do You Know There Best And Amazing Health Benefits Of Guava Leaves That You Should Know | Sakshi
Sakshi News home page

Guava Leaves Health Benefits: జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు

Published Sat, May 18 2024 1:32 PM | Last Updated on Sat, May 18 2024 3:51 PM

check these amazing benefits of Guava Leaves

జామపండుకు పేదల ఆపిల్‌ అని పేరు. అయితే పండే కాదు... ఆకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒకటి రెండు జామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి హెర్బల్‌ టీ మాదిరిగా తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలు... ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి.

ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది అధిక బరువును తగ్గించడంలో జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. 

స్త్రీలు నెలసరి సమయంలో కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులతో సతమతం అవుతుంటారు. అలాంటి వారికి జామ ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి.

కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గించడంలో జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్‌ ఎటాక్‌ ముప్పు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

యాంటీ స్ట్రెస్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి మంచిది. జామ ఆకులు శరీర మెటబాలిజంను పెంచి కొవ్వును కరిగిస్తాయి. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement