How Brides And Grooms Moms Organised This No Plastic Wedding In Bengaluru, Details Inside - Sakshi
Sakshi News home page

No Plastic Wedding In Bengaluru: ఈ తల్లులు ప్రకృతి మురిసేలా ..పిల్లల పెళ్లి ఘనంగా చేశారు

Published Tue, Jul 25 2023 9:32 AM | Last Updated on Tue, Jul 25 2023 12:19 PM

The Brides And Grooms Moms Organised This No Plastic Wedding - Sakshi

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి... ఊరంతా చెప్పుకునేలా జరగాలి పెళ్లంటే మరి!’ అంట అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నేటితరం పెళ్లిళ్లు. ఏమాత్రం పర్యావరణ స్పృహలేకుండా హంగు, ఆర్భాటాలు చేస్త తెగ గొప్పలు చెప్పేసుకుంటున్నారు. దీనివల్ల ప్రకృతమ్మ ఎంత తల్లడిల్లిపోతుందో కూడా పట్టడం లేదు. ఒకతల్లి మనసు మరో తల్లికే తెలుస్తుందేవె! అందుకే బెంగళూరుకు చెందిన ఇద్దరమ్మలు కలిసి తమ పిల్లల పెళ్లిని ప్లాస్టిక్‌ వ్యర్థాలు లేకుండా ఎంతో ఘనంగా, ప్రకృతి మురిసేలా జరిపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బెంగుళూరుకు చెందిన అనుపమ కువరుడికి, చారులత కూతురుతో వివాహం నిశ్చయమైంది.

రెండు కుటుంబాలకు అన్ని విషయాల్లో సఖ్యత కుదిరింది. కానీ ‘పెళ్లిలో ప్లాస్టిక్‌ను అస్సలు వాడకడదు’ అని అనుపమ కండిషన్‌ పెట్టింది. ఇది చారులతకు నచ్చడంతో మరింత సంతోషంతో ఒప్పుకుని ‘‘ఇద్దరం కలిసి ప్లాస్టిక్‌ రహిత పెళ్లి చేద్దాం వదినా!’’ అని ఒక నిర్ణయానికి వచ్చారు. తమ పిల్లల పెళ్లిని మూడురోజులపాటు అంగరంగా వైభవంగా ప్లాస్టిక్‌ లేకుండా జరిపేందుకు నామమాత్రపు పెళ్లిపత్రికలను కొట్టించారు. కొంతమందికి మాత్రమే ఆహ్వాన పత్రికలు ఇచ్చి, మిగతా వారిని నేరుగా పెళ్లికి పిలిచారు. పెళ్లికి పిలిచేటప్పుడే.. ‘‘ఎవరూ బొకేలు, బహుమతులు వంటివి తీసుకు రావద్దు’’ అని మనవి చేశారు.

అరిటాకులు.. స్టీల్‌ ప్లేట్లు... వచ్చిన వెయ్యిమంది అతిథులకు వడ్డించేందుకు అరటి ఆకులు, స్టీల్‌ ప్లేట్స్‌ను ఎంచుకున్నారు. ప్లాస్టిక్‌ కప్పులు, గ్లాసులు, ప్లేట్లు, వాటర్‌ బాటిల్స్‌ స్థానంలో స్టీల్‌ సామాన్లు వాడారు. తాజా పువ్వులు, లైట్లతో పెళ్లిమండపాన్ని అలంకరించారు. పంతొమ్మిదేళ్లనాటి పేపర్‌తో... అనుపమ కొడుకుకు 2004లో ఉపనయనం జరిగిన సందర్భంగా జరిపిన వేడుకలో బటర్‌పేపర్‌ను వాడారు. అప్పుడు మిగిలిన పేపర్‌ తో పెళ్లికి వచ్చిన అతిథులకు రిటన్‌ గిఫ్ట్స్‌ ఇచ్చారు. సహజసిద్ధ పద్ధతుల్లో రంగులద్దిన జాకెట్‌ ముక్కలు, కాగితం పొట్లాల్లో పసుపు, కుంకుమను పేరంటాళ్లకు పంచారు.


స్టీల్‌ ప్లేటులు, గ్లాసులతో

పెళ్లిలో డెకరేషన్‌ల కోసం వాడిన తాజా పువ్వులను వేడుక ముగిసిన తరువాత ముంబైలోని సహజ రంగుల తయారీ స్టూడియోకి పంపించారు. వెయ్యికేజీల వేస్ట్‌ నుంచి ... ప్లాస్టిక్‌ వాడకపోయినప్పటికీ, కొన్ని సహజసిద్ధ వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి కాబట్టి వాటికోసం క్యాటరింగ్‌ సిబ్బంది తడి, పొడి చెత్తను విడివిడిగా డ్రమ్స్‌లో వేసేవాళ్లు. ఈ వ్యర్థాలను కోకోపీట్‌ నింపిన డ్రమ్స్‌లో వేసేది. కాగితాలను, పువ్వులను కలెక్షన్‌ సెంటర్‌కు పంపించారు. డ్రమ్‌లలో వేసిన వెయ్యికేజీల వ్యర్థాల నుంచి మూడు వందల కేజీల సేంద్రియ ఎరువును తయారు చేశారు. ‘‘పెళ్లిలో ప్లాస్టిక్‌ వాడకుండా చేయడం మాకు చాలెంజింగ్‌గా అనిపించినప్పటికీ ఇద్దరం కలిసి విజయవంతం చేశాం. మా అమ్మ, అమ్మమ్మల కాలంలో పెళ్లిళ్లకు ఇలానే స్టీల్‌ సామాన్లు వాడేవారు. మేము అలాగే మా పిల్లల పెళ్లి చేయాలనుకున్నాం. అందుకు అందర సహకరించడం సంతోషం’’ అని అనుపమ, చారులతలు చెప్పకొచ్చారు.

(చదవండి: గూగుల్‌ మ్యాప్‌లో వినిపించే వాయిస్‌.. ఏ మహిళదో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement