అంతరించిన పక్షికి మళ్లీ ప్రాణం..! | American Biosciences Genetic Engineering Company Has Stated That The Dead Specices Is Now Returining - Sakshi
Sakshi News home page

Bringing Back Extinct Animals: అంతరించిన పక్షికి మళ్లీ ప్రాణం..!

Published Sun, Mar 3 2024 11:42 AM | Last Updated on Sun, Mar 3 2024 5:56 PM

American Biosciences Genetic Engineering Company Has Stated That The Dead Specices Is Now Returining - Sakshi

భూమ్మీద పుట్టిన జీవరాశుల్లో అనేక జీవులు అంతరించిపోయాయి. ఇప్పటికే అంతరించిపోయిన జీవులను తిరిగి పుట్టించడం సాధ్యంకాదనే ఇంతవరకు అనుకుంటూ వచ్చారు. అయితే, అది సాధ్యమేనని రుజువు చేయడానికి శాస్త్రవేత్తలు నడుంబిగించారు.

నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ పక్షులను తిరిగి పుట్టించడానికి అమెరికన్‌ బయోసైన్సెస్‌–జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ ‘కలోసల్‌ బయోసైన్సెస్‌’ శాస్త్రవేత్తలు ప్రయత్నాలను ప్రారంభించారు. డోడో పక్షులు భారీగా ఉండేవి. ఇవి ఎగరగలిగేవి కాదు. ఒకప్పుడు మారిషస్‌లో విరివిగా తిరిగేవి.

ఈ జాతిలోని చివరి పక్షి 1681లో చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ పక్షులకు చెందిన పురాతన డీఎన్‌ఏ నమూనాలను సేకరించామని, వాటి ఆధారంగా మారిషన్‌ వైల్డ్‌లైఫ్‌ ఫౌండేషన్‌ సహకారంతో డోడో పక్షులకు పునర్జీవం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కలోసల్‌ బయోసైన్సెస్‌ వ్యవస్థాపకుడు బెన్‌ లామ్‌ వెల్లడించారు. డోడో తరహాలోనే ఇప్పటికే అంతరించిన గులాబి పావురానికి కూడా పునర్జీవం కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఇవి చదవండి: ‘హషిమా’ దీవి.. ఈ చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement