చెవిటి, మూగ విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభం - | Sakshi
Sakshi News home page

చెవిటి, మూగ విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభం

Published Tue, Jun 18 2024 11:18 PM | Last Updated on Tue, Jun 18 2024 11:18 PM

-

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెవిటి, మూగ విద్యార్థులకు ఉచిత అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని రాజమహేంద్రరంలోని ప్రియదర్శిని ఆశ్రమం కరస్పాండెంట్‌ కె.స్వప్నవర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రవేశాలు పొందిన వారికి భోజనం, నోట్‌ బుక్స్‌, పాఠ్య పుస్తకాలు, అన్ని విద్యా, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నామని వివరించారు. విద్యార్థులకు ఆశ్రమంలోని ప్రత్యేక ఉపాధ్యాయులు స్పీచ్‌ థెరపీ ద్వారా శిక్షణ ఇస్తారన్నారు. అలాగే, స్వయం ఉపాధి పొందే విధంగా ఉచిత కంప్యూటర్‌ విద్య, టైలరింగ్‌, కుట్లు, అల్లిక ల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. వివరాలకు 0883–2438288, 70365 72300, 9989 22 4050 ఫోన్‌ నంబర్లలో లేదా నేరుగా కార్యాలయం పని వేళల్లో సంప్రదించాలని స్వప్నవర్మ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement