Meet Kaivalya Vohra, Zepto co-founder success story and net worth - Sakshi
Sakshi News home page

Kaivalya Vohra: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో - 19 ఏళ్లకే కోట్లు విలువైన కంపెనీ

Published Fri, Jun 9 2023 11:39 AM | Last Updated on Fri, Jun 9 2023 12:32 PM

Zepto co founder kaivalya vohra success story and net worth - Sakshi

Kaivalya Vohra Success Story: చదువుకునే వయసులోనే ఏదో సాధించాలనే తపనతో కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఒక కంపెనీ స్థాపించి సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న యువకుడు 'కైవల్య వోహ్రా' (Kaivalya Vohra). ఇంతకీ ఈయన స్టార్ట్ చేసిన కంపెనీ ఏది? సంపాదన ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

చదువుకునే విద్యార్థులలో చాలా మంది విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. కానీ కైవల్య స్టాన్‌ఫర్డ్‌లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేసి ఇండియాకి తిరిగి వచ్చేసాడు. 2001లో జన్మించిన కైవల్య వోహ్రా ముంబైలో పాఠశాల విద్యను పూర్తి చేసి అమెరికాలో ఇంజినీరింగ్ చేయడానికి వెళ్ళాడు. కానీ సొంతంగా కంపెనీ ప్రారంభించాలని ఆశపడుతున్న కైవల్య అక్కడ చాలా రోజులు ఉండలేకపోయాడు.

(ఇదీ చదవండి: రూ. 500 నోట్ల రద్దుపై షికార్లు కొడుతున్న పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన శక్తికాంత దాస్!)

కైవల్య వోహ్రా తన 17వ ఏటనే మొదటి స్టార్టప్‌ని నిర్మించిన తన స్నేహితుడు ఆదిత్ పాలిచాతో కలిసి తన స్టార్టప్‌ని ప్రారంభించాడు. వారి మొదటి స్టార్టప్ పేరు గోపూల్. అయితే వారిద్దరూ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే 'జెప్టో' (Zepto) గురించి ఆలోచించారు. ఆ సమయంలో ఏదైనా ఆర్డర్ చేస్తే అవి డెలివరీ కావడానికి కనీసం రెండు రోజులు పట్టేది. దీనిని దృష్టిలో ఉంచుకుని వారు 2021లో జెప్టో (గ్రోసరీ డెలివరీ యాప్) ప్రారంభించారు. ఇది ప్రారంభమైన కేవలం కొన్ని నెలల్లో 1000 మంది ఉద్యోగులు, ఏజంట్లు ఇందులో చేరారు.

(ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్‌మెంట్‌లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..)

జెప్టో ప్రారంభమైన ఒక నెలలోనే వారు 200 మిలియన్ డాలర్లు సంపాదించగలిగారు. ఒక సంవత్సర కాలంలోనే దీని విలువ రూ. 7,300 కోట్లకు చేరింది. ఇప్పటికి కైవల్య నికర విలువ రూ. 1200 కోట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కంపెనీ 10 పెద్ద నగరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం దేశంలో అతి తక్కువ వయసులో కోటీశ్వరుడుగా పేరు తెచ్చుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement