వాట్సాప్‌లో మూడు అదిరిపోయే ఫీచర్లు | WhatsApp 3 New Features Details | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో మూడు అదిరిపోయే ఫీచర్లు

Published Sat, Jun 15 2024 10:56 AM | Last Updated on Sat, Jun 15 2024 11:09 AM

WhatsApp 3 New Features Details

వాట్సాప్‌ ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం అప్డేటెడ్ ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ తరుణంలో తాజాగా ఆడియోతో స్క్రీన్ షేరింగ్, పార్టిసిపెంట్ కెపాసిటీ, స్పీకర్ స్పాట్‌లైట్ ఫీచర్ అనే మూడు కొత్త ఫీచర్స్ తీసుకువచ్చింది.

ఆడియోతో స్క్రీన్ షేరింగ్: వాట్సాప్ ఇప్పుడు వినియోగదారులు ఆడియోతో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ద్వారా తమ స్క్రీన్ & ఆడియోను ఏకకాలంలో పంచుకునేందుకు వీలుంటుంది. స్క్రీన్ షేరింగ్ అనేది గతంలోనే వాట్సాప్ పరిచయం చేసినప్పటికీ.. ఇప్పుడు మెరుగైన ఆడియో సఫోర్ట్ జోడించింది.

వీడియో కాల్‌లలో పెరిగిన పార్టిసిపెంట్ కెపాసిటీ: ఇప్పటి వరకు ఒక మీటింగ్ అంటే జూమ్ లేదా గూగుల్ మీట్ వంటి యాప్స్ ఉపయోగించి ఉంటారు. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా ఒకేసారి 32 మంది వీడియో కాల్‌లో పాల్గొనవచ్చు.

స్పీకర్ స్పాట్‌లైట్ ఫీచర్: కాల్‌లో ఎవరు మాట్లాడుతున్నారో ట్రాక్ చేయడం కోసం స్మార్ట్‌ఫోన్ యాప్‌లో కష్టంగా అనిపించినప్పటికీ, మాట్లాడే వ్యక్తిని ఆటోమేటిక్‌గా హైలైట్ చేయడానికి స్పాట్‌లైట్ ఫీచర్‌ను కూడా జోడించింది.

వాట్సాప్ ఇప్పుడు ఆడియో, వీడియో నాణ్యతను మెరుగుపరచడం మీద ఎక్కువ ద్రుష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సరికొత్త ఫీచర్స్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్స్ అన్నీ త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ తప్పకుండా వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement