జీడబ్ల్యూఈసీ ఇండియా ఛైర్‌పర్సన్‌ నియామకం | Vice Chairman Of Suzlon Girish Tanti Elected As The Chairperson Of Global Wind Energy Council India | Sakshi
Sakshi News home page

జీడబ్ల్యూఈసీ ఇండియా ఛైర్‌పర్సన్‌ నియామకం

Published Tue, Jun 18 2024 3:00 PM | Last Updated on Tue, Jun 18 2024 3:47 PM

Vice Chairman of suzlon Girish Tanti elected as the Chairperson of Global Wind Energy Council India

గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్(జీడబ్ల్యూఈసీ) ఇండియా ఛైర్‌పర్సన్‌గా గిరీష్ తంతిని నియమించారు. ఆయన ప్రస్తుతం సుజ్లాన్‌ ఎనర్జీ సంస్థలో వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా జీడబ్ల్యూఈసీ విడుదల చేసిన ప్రకటనలో ‘దేశంలో పవన విద్యుదుత్పత్తి, సరఫరా సామర్థ్యాన్ని పెంపొందించాల్సి ఉంది. అందుకు అవసరమయ్యే విధివిధానాలు రూపొందించడానికి జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జీడబ్ల్యూఈసీ పనిచేస్తోంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద పవన విద్యుత్తు విపణిగా, సముద్ర తీర గాలితో 46 గిగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా మనదేశం ఎదగడానికి గిరీష్‌ తంతి నాయకత్వం సహకరిస్తుంది’ అని తెలిపింది.

ఇదీ చదవండి: పైలట్ల కొరత తీర్చేందుకు ప్రత్యేక శిక్షణ

జీడబ్ల్యూఈసీ 80కు పైగా దేశాల్లోని సుమారు 1,500 కంపెనీలు, డెవలపర్లు, కాంపోనెంట్ సరఫరాదారులు, పరిశోధనా సంస్థలు, జాతీయ పునరుత్పాదక సంఘాలు, ఫైనాన్స్, బీమా కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement