పెరిగిన పసిడి.. స్థిరంగా వెండి - నేటి కొత్త ధరలు ఇలా.. | Today Gold And Silver Price On 4 December 2023 | Sakshi
Sakshi News home page

Gold And Silver Price: పెరిగిన పసిడి.. స్థిరంగా వెండి - నేటి కొత్త ధరలు ఇలా..

Published Mon, Dec 4 2023 1:34 PM | Last Updated on Mon, Dec 4 2023 1:42 PM

Today Gold And Silver Price 4 December 2023 - Sakshi

భారతదేశంలో బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు, ఈ రోజు మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేసింది. నేడు గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5885, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6420గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 58850, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 64200గా ఉంది. నిన్నటి స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈ రోజు ఒక్కసారిగా.. రూ. 400 నుంచి రూ. 440 వరకు పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఉంటాయి.

చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధర రూ. 5975 (22 క్యారెట్స్), రూ. 6518 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 59750, రూ. 65180గా ఉంది. నిన్నతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 600, రూ. 650 పెరిగినట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: ఆ ఒక్క సలహా రోజుకి రూ.5 కోట్లు సంపాదించేలా.. భర్త సక్సెస్‌ వెనుక భార్య..

ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 5900, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6435గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.  400, రూ. 440 పెరిగింది. కొత్త ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 59000 (22 క్యారెట్స్), రూ. 64350కి (24 క్యారెట్స్) చేరింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో వెండి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement