SpiceJet hives off cargo & logistics business into separate entity from April 1 - Sakshi
Sakshi News home page

ఇక ఆ రెండు వేరువేరు: స్పైస్‌జెట్‌

Published Tue, Apr 4 2023 8:03 AM | Last Updated on Tue, Apr 4 2023 10:41 AM

SpiceJet hives off cargo, logistics business into separate entity - Sakshi

ముంబై: విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ తమ కార్గో, లాజిస్టిక్స్‌ వ్యాపార విభాగం స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక విభాగంగా విడదీసింది. ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌గా వ్యవహరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లాజిస్టిక్స్‌ వ్యాపార విభాగం స్వతంత్రంగా నిధులను సమీకరించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు. 2022–23 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య వ్యవధిలో స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ రూ. 51 కోట్ల నికర లాభం నమోదు చేసింది.

(రిలయన్స్‌ డిజిటల్‌ డిస్కౌంట్‌ డేస్‌: ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు)

డీల్‌ ప్రకారం స్పైస్‌జెట్‌కు స్పైస్‌ఎక్స్‌ప్రెస్‌ రూ. 2,556 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లు, డిబెంచర్లు జారీ చేయనుంది. కార్లైల్‌ ఏవియేషన్‌ పార్ట్‌నర్‌ చెల్లించాల్సిన 100 మిలియన్‌ డాలర్ల రుణాన్ని గత నెల పునర్‌వ్యవస్థీకరించుకున్నామని అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. తాజాగా లాజిస్టిక్స్‌ విభాగం విడదీతతో స్పైస్‌జెట్‌ బ్యాలెన్స్‌ షీటు మరింత పటిష్టంగా మారగలదని, కంపెనీ నెగటివ్‌ నికర విలువ భారం గణనీయంగా తగ్గగలదని ఆయన వివరించారు.

(అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement