SBI, PNB, Kotak Mahindra Credit Debit Card Charges 2023 May - Sakshi
Sakshi News home page

ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా!

Published Sat, May 6 2023 6:02 PM | Last Updated on Sat, May 6 2023 6:35 PM

Sbi pnd kotak mahindra credit debit card changaes 2023 may - Sakshi

కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. ఈ తరుణంలో ఎన్నెన్నో కొత్త రూల్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డులలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. ఇందులో ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నాయి. ఈ బ్యాంకులు చేసిన మార్పులను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీచేసే ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్‌బీఐ కార్డ్) తమ AURUM కార్డ్‌లలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. దీని ప్రకారం ఆరమ్ కార్డు కలిగిన వారు RBL Luxeకి బదులుగా టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ. 5000 వోచర్ పొందుతున్నారు. గతంలో రూ.5 లక్షలు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన వారికి ఆర్బీఎల్ లగ్జరీ నుంచి ఈ వోచర్ వచ్చేది. ఈజీ డైనర్ ప్రైమ్, లెన్స్ కార్ట్ గోల్డ్ మెంబర్ షిప్ ప్రయోజనాలను తొలగించింది. అయితే ఈ కార్డు మీద ప్రైమ్ అండ్ లెన్స్‌కార్ట్ గోల్డ్ మెంబర్‌షిప్ బెనిఫిట్ ఇకపై అందుబాటులో ఉండే అవకాశం ఉండదు.

పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)
2023 మే 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కూడా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఏటీఎమ్ నుంచి అమౌంట్ డ్రా చేసుకోవడం వంటి లావాదేవీలపైన రూ. 10 + జీఎస్‌టీ విధిస్తోంది. అంతే కాకుండా డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు వంటి వాటికి కూడా కొంత రుసుము అమలు చేసే ప్రక్రియలో బ్యాంకు ఆలోచిస్తున్నట్లు సమాచారం.  

కోటక్ మహీంద్రా బ్యాంకు
కోటక్ మహీంద్రా బ్యాంకు విషయానికి వస్తే, ఇది 2023 మే 23 నుంచి డెబిట్ కార్డు చార్జీలను రూ. 259తో పాటు GST పెంచనున్నట్లు తమ కస్టమర్లకు ఒక మెయిల్ ద్వారా తెలిపింది. గతంలో ఈ చార్జీలు రూ. 199 ప్లస్ జీఎస్‌టీతో ఉండేది. కావున ఈ బ్యాంకు కూడా త్వరలోనే కొత్త రూల్స్ ద్వారా కస్టమర్ల మీద పెను భారాన్ని మోపే అవకాశం ఉందని భావిస్తున్నాము.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement