దేశవ్యాప్తంగా మరో 400 శాఖలు: ఎస్‌బీఐ SBI Plans To Open 400 New Branches Across Country in FY25 | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా మరో 400 శాఖలు: ఎస్‌బీఐ

Published Sun, Jun 23 2024 9:32 PM | Last Updated on Sun, Jun 23 2024 9:47 PM

SBI Plans To Open 400 New Branches Across Country in FY25

నెట్‌వర్క్ విస్తరణ ప్రణాళికలో భాగంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 శాఖలను ప్రారంభించాలని యోచిస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన ఎస్‌బీఐ గత ఆర్థిక సంవత్సరంలో 137 శాఖలను ప్రారంభించింది. ఇందులో 59 శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి.

ఎస్‌బీఐ బ్రాంచ్‌లో 89 శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నప్పటికీ కొత్త శాఖల అవసరమా అని కొందరు ప్రశ్నించినప్పుడు.. బ్యాంకింగ్ సర్వీసులో కొత్త విభాగాలు పుట్టుకొస్తున్న సమయంలో కొత్త శాఖల అవసరం చాలా ఉందని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా స్పష్టం చేశారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమున్న ప్రదేశాలను గుర్తిస్తామని, అక్కడ కొత్త శాఖలు ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని దినేష్ కుమార్ ఖరా అన్నారు. ఇందులో భాగంగానే 400 శాఖలు ప్రారభించనున్నట్లు పేర్కొన్నారు. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉందని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement