Ratan Tata To Be Felicitated By Maharashtra First Udyog Ratna Award, Know In Details - Sakshi
Sakshi News home page

Udyog Ratna Award To Ratan Tata: లెజెండ్‌ రతన్‌టాటాకు ‘మహా’ గౌరవం: ప్రశంసల వెల్లువ

Published Sat, Jul 29 2023 3:56 PM | Last Updated on Sat, Jul 29 2023 4:28 PM

Ratan Tata to be felicitated by Maharashtra first Udyog Ratna Award - Sakshi

టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాను మరో అవార్డు వరంచింది.  మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉద్యోగ రత్న అవార్డును  ఆయన దక్కించు కున్నారు. తమ సరికొత్త అవార్డుతో ఆయనను సత్కరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్  ఈ విషయాన్ని ప్రకటించారు. (ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్‌ నెక్లెస్‌ ఖరీదు తెలుసా?)

ఈ ఏడాది నుంచి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ రత్న అవార్డును ప్రవేశపెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌లు పాల్గొన్న సమావేశంలో ఈ ఏడాది పారిశ్రామికవేత్తకు తొలి ఉద్యోగ రత్న అవార్డుకు రతన్‌ టాటాను  ఎంపిక చేశారు.విశిష్ట వ్యక్తులకు అందించే అత్యున్నత రాష్ట్ర గౌరవం  మహారాష్ట్ర భూషణ్ అవార్డు సంప్రదాయాన్ని అనుసరించి, ఈ సంవత్సరం నుండి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ రత్న అవార్డును ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

యువ పారిశ్రామికవేత్త, మహిళా పారిశ్రామికవేత్త, మరాఠీ పారిశ్రామికవేత్తలకు కూడా అవార్డులు అందించనుంది.మహారాష్ట్ర ఉద్యోగ రత్న అవార్డును వ్యాపారం, పరిశ్రమలు, విద్య, రియల్ ఎస్టేట్, పర్యాటకం, ఆర్థిక సేవలు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, బ్యాంకింగ్, ఐటీ, ఆహార రంగాలలో అపారమైన కృషి చేసిన వ్యక్తులు , సంస్థల ప్రయత్నాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ  క్రమంలో ఈ అవార్డును తొలి గ్రహీత టాటా గ్రూపు నిలిచింది. అయితే రతన్ టాటా తొలి అవార్డు  దక్కించుకోవడంపై   ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే లెజెండ్‌ రతన్‌ టాటాకు మహా అవార్డుపై  పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  రతన్ టాటా  విశిష్టమైన కెరీర్‌లో అనేక ఇతర ప్రశంసలతో పాటు, భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు పౌర పురస్కారాలు: 2008లో పద్మవిభూషణ్, 2000లో పద్మభూషణ్‌ అవార్డును అందుకున్న సంగతి  తెలిసిందే. (ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? నిర్మాత కూడా!)

ఉప్పు నుంచి విమానాల దా​కా సేవలందిస్తూ దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో టాటా గ్రూపు.  కంపెనీని విజయపథంలో నడిపించిన,ఇప్పటికీ గ్రూపు గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతున్న రతన్‌ టాటా జీవన శైలి ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి దాయకం. టీసీఎస్‌, టాటా ఎయిరిండియా లాంటి ఎన్నో  సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement