Viral Video: Bhavish Aggarwal Shares Ola FutureFactory - Sakshi
Sakshi News home page

కళ్లు చెదిరేలా ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ.. వీడియోలు షేర్ చేసిన సీఈవో

Published Sun, Aug 20 2023 9:04 PM | Last Updated on Mon, Aug 21 2023 11:37 AM

Ola Futurefactory today bhavish tweet viral - Sakshi

భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి అత్యధిక ప్రజాదరణ పొందుతున్న ఓలా ఎలక్ట్రిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక్క డీలర్షిప్ కూడా లేకుండా అధిక విక్రయాలు పొందిన ఈ సంస్థ ఇప్పుడు మరింత దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ రెండు వీడియోలను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సీఈఓ భవిష్ అగర్వాల్ ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీకి సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. ఇందులోని ఒక వీడియో కంపెనీలో లోపల జరుగుతున్న కార్యకలాపాలను చూపిస్తోంది. మరో వీడియోలో నిర్మాణంలో వేగంగా దూసుకెళ్తున్న గిగాఫ్యాక్టరీని చూడవచ్చు.

ఇదీ చదవండి: రూ. 200 కోట్లు కంటే ఎక్కువ ఖరీదైన కారు! ఎందుకింత రేటు?

ఈ వీడియోలను షేర్ చేస్తూ ఈ రోజు ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో.. రానున్న రోజుల్లో ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరుగుతుందని ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలమంది వీటిని వీక్షించగా.. చాలా మంది లైక్ చేస్తున్నారు. మరి కొందరు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement