పాత కార్ల అమ్మకాల్లో కనీవినీ ఎరుగని రికార్డ్ - అట్లుంటది మారుతి అంటే! Maruti new record for old car sales | Sakshi
Sakshi News home page

Maruti Suzuki: పాత కార్ల అమ్మకాల్లో కనీవినీ ఎరుగని రికార్డ్ - అట్లుంటది మారుతి అంటే!

Published Thu, Aug 10 2023 6:57 AM | Last Updated on Thu, Aug 10 2023 7:03 AM

Maruti new record for old car sales - Sakshi

న్యూఢిల్లీ: ఆటోమొబై ల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐఎల్‌) గత రెండు దశాబ్దాల్లో రికార్డు స్థాయిలో పాత కార్లను విక్రయించింది. సంస్థలో భాగమైన ట్రూ వేల్యూ 22 ఏళ్లలో 50 లక్షల వాహనాలను అమ్మింది. 

ట్రూ వేల్యూ 2001లో ఏర్పాటైంది. ప్రస్తుతం 281 నగరాల్లో 560 అవుట్‌లెట్స్‌ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది. ‘మారుతీ సుజుకీ ట్రూ వేల్యూ పరిశ్రమలో విజయవంతంగా 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. 

50 లక్షల మంది కొనుగోలుదారులకు సంతోషాలను పంచింది. వారి ప్రథమ ఎంపికగా ఎదిగింది‘ అని ఎంఎస్‌ఐఎల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement