Google to stop offering free snacks, laundry services and other perks to employees - Sakshi
Sakshi News home page

గూగుల్‌ ఉద్యోగులకు భారీ షాక్‌.. స్నాక్స్‌, లంచ్‌ ఇక అన్నీ బంద్‌?

Published Sat, Apr 1 2023 4:03 PM | Last Updated on Sat, Apr 1 2023 4:32 PM

Google Stop Offering Free Snacks, Laundry Services, Other Perks To Employees - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఉద్యోగులకు భారీ షాక్‌ ఇచ్చింది. ఇకపై వారికి అందించే ఫ్రీ స్నాక్స్‌, లంచ్‌, మసాజ్‌, లాండ్రీతో పాటు ఇతర సౌకర్యాల్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.

ప్రముఖ దిగ్గజ టెక్‌ కంపెనీ గూగుల్‌లో పనిచేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఆహ్లాదకర వాతావరణం, జీత భత్యాలు, ఉద్యోగులకు అందించే సౌకర్యాలు, ఇతర ప్రోత్సహాకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా గూగుల్‌ కంపెనీలో ఉద్యోగం చేసే వారికి సొసైటీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందుకే గూగుల్‌ ఉద్యోగం అంటే ఎగిరి గంతేస్తుంటారు. 

అయితే ప్రపంచంలో అత్యంత విలువైన టెక్‌ కంపెనీల్లో ప్రథమ స్థానంలో ఉన్న గూగుల్‌ ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితిని తట్టుకొని నిలబడాలంటే ఉన్న డబ్బును పొదుపుగా వాడుకొని..దూబారా ఖర్చుల్ని తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో ఇప్పటి వరకు ఉద్యోగులకు అందించిన అన్నీ ప్రోత్సాహకాల్ని రద్దు చేసింది. నియామకాల్ని తగ్గించి డబ్బుల్ని ఆదా చేస్తోంది. 


చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్


ఈ సందర్భంగా గూగుల్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రూత్ పోరాట్ మాట్లాడుతూ..సంస‍్థ అధిక ప్రాధాన్యత కలిగిన పనులపై మాత్రమే డబ్బుల్ని సమర్థవంతంగా వినియోగించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రోత్సాహకాల నిలిపి వేతపై ఉద్యోగులకు గూగుల్‌ మెమో జారీ చేసింది. హైరింగ్‌ ప్రాసెస్‌ను నిలిపివేసి ఉద్యోగుల్ని అధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్‌లపై పనిచేసేలా రీలొకేట్‌ చేయనున్నట్లు బిజినెస్‌ ఇన్‌ సైడర్‌ నివేదిక తెలిపింది. ఉద్యోగులకు అందించే ల్యాప్‌ట్యాప్‌లను తిరిగి వెనక్కి తీసుకోవడంతో పాటు, ఆఫీస్ లొకేషన్ అవసరాలు, ప్రతి ఆఫీస్ స్పేస్‌లో కనిపించే ట్రెండ్‌ల ఆధారంగా ప్రొత్సహకాల్ని సర్ధుబాటు చేయాల్సి వస్తుందని పోరాట్‌ తెలిపినట్లు నివేదిక పేర్కొంది. 
 
మైక్రో కిచెన్‌ల అవసరం ఎంత వరకు ఉందనే విషయంపై స్పష్టత వచ్చిన వెంటనే వాటిని మూసివేయడం, వినియోగానికి తగ్గట్లు ఫిట్‌నెస్‌ క్లాసుల్ని షెడ్యూల్‌ చేయడం పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల వాడాకాన్ని తగ్గించి డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టేందుకు సిద్ధమైనట్లు బిజినెస్‌ ఇన్‌ సైడర్‌ నివేదిక హైలెట్‌ చేసింది. 

కొన్ని సర్ధుబాట్లు తప్పవ్‌
ఇక తాజా గూగుల్‌ నిర్ణయంపై ‘సంస్థ ఇచ్చే ప్రోత్సహాకాల్ని ఇష్టపడే ఉద్యోగులకు ఈ నిర్ణయం అసంతృప్తి కలిగించవచ్చు. కానీ కంపెనీకి నిధులను ఆదా చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహా అధిక ప్రాధాన్యత కలిగిన ఇతర రంగాలపై దృష్టిసారించడం తప్పనిసరి. ముఖ్యమైన ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు, సౌకర్యాలను అందించడం కొనసాగిస్తుంది. అయితే కంపెనీ తన వనరుల విషయంలో బాధ్యతాయుతంగా ఉండేందుకు కొన్ని సర్ధుబాట్లు చేయబడతాయి అంటూ గూగుల్‌ ప్రతినిధి ర్యాన్ లామోన్ గిజ్‌మోడోకి చెప్పారు.

చదవండి👉 గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తొందరపాటు.. ఏకిపారేస్తున్న సొంత ఉద్యోగులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement