Google To Set Up Global Fintech Operations Centre In Gujarat: Sundar Pichai - Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌ చెప్పిన సుందర్‌ పిచాయ్‌.. భారీ పెట్టుబడితో భారత్‌లో గూగుల్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌

Published Sat, Jun 24 2023 7:54 AM | Last Updated on Sun, Jun 25 2023 7:08 AM

Google To Set Up Global Fintech Operations Centre In Gujarat Sundar Pichai - Sakshi

అమెరికా టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ శుభవార్త చెప్పింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం భారత్‌లోని గుజరాత్‌లో గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఆపరేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. 

మోదీ విజన్‌ గొప్పది
మోదీ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ఫ్లాగ్‌షిప్ క్యాంపెయిన్‌ను, దీనిపై ప్రధాని మోదీ దార్శనికతను సుందర్‌ పిచాయ్‌ ప్రశంసించారు. ‘యూఎస్‌లో చరిత్రాత్మక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని కలవడం గౌరవంగా ఉంది. భారత్‌ డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ 10 బిలియన్‌ డాలర్లు ( సుమారు రూ. 82 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రధాని మోదీతో పంచుకున్నాం. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో మా గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం’ అని పిచాయ్ చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

గిఫ్ట్‌ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఇది గుజరాత్‌ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో ఉంది. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా విజన్‌ రానున్న భవిష్యత్‌కు బ్లూప్రింట్‌గా తాను భావిస్తున్నట్లు సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. కాగా సుందర్‌ పిచాయ్‌తోపాటు రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్ తదితరులు భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్‌లను కలిసిన వ్యాపారవేత్తలలో ఉన్నారు.

ఇదీ చదవండి: వైట్‌హౌస్‌లో మెరిసిన అంబానీ దంపతులు.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement