Google Parent Company Alphabet Plans To Fire 10k Employees, Details Inside - Sakshi
Sakshi News home page

Google Alphabet Layoffs: ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌: 10 వేలమంది ఇంటికే! 

Published Tue, Nov 22 2022 1:12 PM | Last Updated on Tue, Nov 22 2022 3:42 PM

Google Layoffs Alphabet plans to fire 10k employees - Sakshi

న్యూఢిల్లీ:  ట్విటర్‌,  మెటా, అమెజాన్‌ లాంటి దిగ్గజాల తరువాత ఉద్యోగులను తొలగి​స్తున్న ప్రముఖ  కంపెనీల జాబితాలో తాజాగా గూగుల్‌ చేరింది. టెక్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ  ఆల్ఫాబెట్ పనితీరు సరిగాలేని 10 వేలమంది ఉద్యోగులను  తొలగించాలని యోచిస్తోంది. త్వరలోనే ఈ తొలగింపు ప్రక్రియ షురూ కానుంది. 

గూగుల్ తన ఉద్యోగులలో 6 శాతం మందిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంటే దాదాపు 10 వేల మందిని పనితీరు సాకుతో ఇంటికి పంపించనుంది. గూగుల్ ర్యాంకింగ్ సిస్టమ్‌ ద్వారా త్యల్ప ర్యాంక్ ఉన్న ఉద్యోగులను కంపెనీ నుండి తొలగించాలని భావిస్తోంది. ఉద్యోగులను విశ్లేషించి, ర్యాంక్ ఇవ్వాల్సిందిగా సంస్థ మేనేజర్‌లను కోరినట్లు సమాచార నివేదిక పేర్కొంది. ఆల్ఫాబెట్‌ కొత్త పనితీరు సిస్టం బోనస్‌లు ,స్టాక్ గ్రాంట్‌లను చెల్లించకుండా ఉండేందుకు ఈ రేటింగ్స్‌నుపయోగించవచ్చని నివేదిక పేర్కొంది. అయితే దీనిపై ఆల్ఫాబెట్ ఇంకా స్పందించ లేదు. (ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్‌: ఇండియన్‌ టెకీలకు గుడ్‌ న్యూస్‌)

కాగా ఆల్ఫాబెట్ కింద దాదాపు 1,87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూఎస్‌ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ ఫైలింగ్ ప్రకారం, ఆల్ఫాబెట్ ఉద్యోగికి గత సంవత్సరం మధ్యస్థ పరిహారం సుమారు 295,884 డాలర్లుగా ఉంది. (బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజు: మరోసారి బ్రేక్‌, ఎందుకంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement