Report Says Google Executives Warn Employees About Layoffs - Sakshi
Sakshi News home page

గూగుల్‌ ఉద్యోగులకు సీఈవో సుందర్‌ పిచాయ్‌ భారీ షాక్‌!

Published Tue, Aug 16 2022 9:48 AM | Last Updated on Tue, Aug 16 2022 10:36 AM

Google Executives Warn Employees About Layoffs - Sakshi

ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో అన్నీ రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. నియామకాల్ని నిలిపివేస్తున్నాయి. ఈ నేపథ్యంలోప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సైతం భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించనుందా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా పరిణామాలు.

గూగుల్‌ ఇటీవల క్యూ2 వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఆదాయాలు, రాబడుల పరంగా 'అంచనాల కంటే బలహీనంగా ఉండడంపై గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రశ్నించారు. ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నా..వారిలో పనిచేసేది కొంతమందేనంటూ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లతో జరిగిన ఇంటర్నల్‌ మీటింగ్‌లో పిచాయ్‌ అన్నట్లు తెలుస్తోంది. పిచాయ్‌ వ్యాఖ్యలతో..గూగుల్‌ త్వరలో ఉద్యోగుల్ని తొలగించనుంది' అంటూ  పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.   

ఈ తరణంలో ఉద్యోగుల్ని తొలగించేందుకు గూగుల్‌ సిద్ధమైంది. వచ్చే వార్షిక ఫలితాల విడుదల సమాయానికి ఉద్యోగుల సేల్స్‌, ప్రొడక్టివిటీ విభాగాల్లో పర్‌ఫార్మెన్స్‌ బాగుంటే సరేసరి. లేదంటే వేటు తప్పదని గూగుల్‌ క్లౌడ్ సేల్స్ విభాగానికి చెందిన ఉద్యోగులతో తెలిపారు. ది న్యూయార్క్ పోస్ట్‌ సైతం గూగుల్‌ ఉద్యోగాల నియామకాల్ని నిలిపి వేయడం, అదే సమయంలో తొలగింపుపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. ఉద్యోగుల తొలగింపు ఖాయమంటూ తన కథనంలో హైలెట్‌ చేసింది.

చదవండి👉'మీ పర్‌ఫార్మెన్స్‌ బాగలేదయ్యా'..ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement