25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్‌పీరియన్స్! | Google CEO Sundar Pichai shared his experience, celebrates 25 years of tech gaint - Sakshi
Sakshi News home page

Sundar Pichai: 25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్‌పీరియన్స్!

Published Thu, Sep 7 2023 10:55 AM | Last Updated on Thu, Sep 7 2023 11:28 AM

Google ceo sundar pichai shared experience celebrate 25 years of google - Sakshi

ఆధునిక కంప్యూటర్ యుగంలో గూగుల్ (Google) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈ సంస్థ ప్రారంభమై ఇప్పటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) తన అనుభవంలోని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

తాను (సుందర్ పిచాయ్) అమెరికాలో చదువుకునే రోజుల్లో ఈ-మెయిల్ అందుబాటులోకి వచ్చిందని.. ఆ సమయంలో చాలా సంతోషించినట్లు తెలిపాడు. అయితే తన తండ్రికి పంపిన మెయిల్‌కి రిప్లై (డియర్ మిస్టర్. పిచాయ్, ఈమెయిల్ అందింది. అంతా బాగానే ఉంది) రావడానికి రెండు రోజులు పట్టిందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ రోజు నా కొడుకు నాతో మాట్లాడటానికి కనీసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని.. ఎదుగుతున్న టెక్నాలజీ గురించి వెల్లడించాడు.

నేడు ఏది కావాలన్నా సమాధానం గూగుల్ చెబుతుందని గట్టిగా నమ్ముతున్నారు. ఒక నీటి కుళాయి బాగు చేసుకోవడం దగ్గర నుంచి.. పెద్ద పెద్ద ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారి వరకు గూగుల్ చాలా ఉపయోగపడుతోంది. అంతే కాకుండా తాను గూగుల్ సంస్థలో ఇంటర్వ్యూ ఎలా పేస్ చేయాలి అనే ప్రశ్నలకు కూడా గూగుల్ సమాధానమిచ్చినట్లు వెల్లడించాడు. కాలక్రమంలో వచ్చిన మార్పులు తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసినట్లు తెలిపాడు.

ఇదీ చదవండి: ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు!

మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఎన్నో మార్పులు చెందటంతో పాటు.. యూజర్ల నమ్మకాన్ని పొందటంతో గూగుల్ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. వినియోగదారుల సమాచారం, ప్రైవసీకి ప్రాధాన్యత కల్పిస్తూ ఏఐ విప్లవంలో మరింత అభివృద్ధి చెందాలని వెల్లడించాడు. రాబోయే రోజుల్లో యూజర్లకు సహాయకారిగా మారటం, దానిని బాధ్యతాయుతంగా అమలు చేయడమే లక్ష్య,మని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement