Google CEO Sundar Pichai Receives 200 Million Dollars In 2022 Amid Cost Cutting - Sakshi
Sakshi News home page

లేఆఫ్స్‌ ఆందోళనల మధ్య: గూగుల్‌ సీఈవో షాకింగ్‌ వేతనం

Published Sat, Apr 22 2023 12:18 PM | Last Updated on Sat, Apr 22 2023 12:30 PM

Google CEO Sundar Pichai Receives 200 Million dollars In 2022 Amid Cost Cutting - Sakshi

న్యూఢిల్లీ:  గ్లోబల్‌గా లేఆఫ్స్‌ కొనసాగుతున్న వేళ గూగుల్ మాతృసంస్థ  ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ పారితోషికం చర్చనీయాంశంగా మారింది. టెక్‌  దిగ్గజం గూగుల్‌లో  ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలోనే ఆయన ఏకంగా 226 మిలియన్ డాలర్ల  (సుమారు రూ. 1,854 కోట్లు) పారితోషికం తీసుకున్నారన్న వార్త సంచలనంగా మారింది. (అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్‌ ధరలు)

ఆల్ఫాబెట్ శుక్రవారం రెగ్యులేటరీకి వెల్లడించిన ప్రకారం సుందర్ అందుకున్న పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ కూడా ఉన్నట్టు తెలిపింది.  దీని ప్రకారం గతేడాది సుందర్ పారితోషికం గూగుల్ సగటు ఉద్యోగి వేతనం కంటే  దాదాపు 800 రెట్లు పెరిగింది.

కాగా జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12వేల ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థికంగా పరిస్థితుల నేపథ్యంలో తొలగింపులు తప్పవని గూగుల్ అప్పట్లో ప్రకటించింది. ఇది కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 6 శాతానికి సమానం. అలాగే ఈ నెల మొదట్లో లండన్‌లోని గూగుల్ ఉద్యోగులు లేఆఫ్స్‌కు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement