‘జెల్లె స్కామ్‌’.. డబ్బులు పోగొట్టుకున్న అమెరికన్‌ బ్యూటీ Former Beauty Queen Loses money In Zelle Scam In US | Sakshi
Sakshi News home page

‘జెల్లె స్కామ్‌’.. డబ్బులు పోగొట్టుకున్న అమెరికన్‌ బ్యూటీ

Published Mon, May 20 2024 3:36 PM | Last Updated on Mon, May 20 2024 3:36 PM

Former Beauty Queen Loses money In Zelle Scam In US

అమెరికన్‌ బ్యూటీ బ్రియానా సియాకా ‘జెల్లె స్కామ్‌’లో డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ  స్కామ్‌ పట్ల అందరూ అప్రమత్తంగా హెచ్చరించారు. అసలేంటీ స్కామ్‌, డబ్బులు ఎలా పోగొట్టుకున్నది ఆమె వివరించారు.

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం..  యూఎస్‌లో మాజీ మిస్‌ న్యూయార్క్‌ అయిన బ్రియానా సియాకా టిక్‌టాక్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఇద్దరు యువకులు తన నుంచి 2,000 డాలర్లు (రూ. 1.66 లక్షలు) ఎలా లాక్కున్నారో వివరించారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న సియాకా, తాను మాడిసన్ స్క్వేర్ పార్క్‌లో కూర్చుని పాడ్‌కాస్ట్ వింటుండగా ఇద్దరు కుర్రాళ్లు తన వద్దకు వచ్చి తమ బాస్కెట్‌బాల్ జట్టు కోసం నిధులు సేకరిస్తున్నామని, తమకు సహాయం చేయాలని కోరారని చెప్పారు.

తాను వారికి కొంత డబ్బు ఇవ్వడానికి అంగీకరించానని, కానీ తన వద్ద నగదు లేకపోవడంతో జెల్లె యాప్‌ ద్వారా చెల్లించేందుకు ఒప్పుకొన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తమ అకౌంట్‌ వివరాలు నమోదు చేసేందుకు తన ఫోన్‌ తీసుకున్నాడని, మరో కుర్రాడు తనను మాటల్లో పెట్టగా అతను తన అకౌంట్‌ నుంచి 2,000 డాలర్లు వారి ఖాతాకు మళ్లించుకున్నారని వివరించారు. న్యూయార్క్ పోలీసుల ప్రకారం, ఇది చాలా సాధారణమైన స్కామ్. దీని దుండగులు విరాళాల పేరుతో డబ్బును స్వాహా చేస్తారు.

"నేను ఆశ్చర్యపోయాను. ఈ అబ్బాయిలు చాలా మంచిగా, అమాయకంగా మాట్లాడితే వారు నిజంగానే తమ జట్టు కోసం విరాళాలు సేకరిస్తున్నారని అనుకున్నాను" అని సియాకా చెప్పారు. జెల్లె (Zelle) అనేది జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికాతో సహా ఏడు బ్యాంకుల యాజమాన్యంలోని పీర్-టు-పీర్ నెట్‌వర్క్. 2017లో ప్రారంభమైన జెల్లె అతిపెద్ద యూఎస్‌ పీర్-టు-పీర్ చెల్లింపుల నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఎదిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement