దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి Domestic air passenger traffic rises 4. 4percent to 1. 37 cr in May says DGCA | Sakshi
Sakshi News home page

దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి

Published Mon, Jun 17 2024 6:25 AM

Domestic air passenger traffic rises 4. 4percent to 1. 37 cr in May says DGCA

మే నెలలో 4.4 శాతం అధికం

ముంబై: విమానయాన సేవలకు ఆదరణ కొనసాగుతోంది. మే నెలలో దేశీ విమాన ప్రయాణికుల్లో 4.4 శాతం వృద్ధి కనిపించింది. మొత్తం 1.37 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది మే నెలలో ప్రయాణికుల సంఖ్య 1.32 కోట్లుగా ఉంది. ఇక ఈ ఏడాది మే వరకు మొదటి ఐదు నెలల్లో 6.61 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే ఐదు నెలలో విమాన ప్రయాణికుల రద్దీ 6.36 కోట్లుగా ఉన్నట్టు (3.99 శాతం వృద్ధికి సమానం) పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) ప్రకటించింది. సకాలంలో విమాన సేవలను నిర్వహించడంలో ఆకాశ ఎయిర్‌ మొదటి స్థానంలో నిలిచింది.

 మొత్తం మీద 85.9 శాతం మేర సకాలంలో సేవలు అందించింది. ఆ తర్వాత 81.9 శాతంతో విస్తారా, 74.9 శాతంతో ఏఐఎక్స్‌ కనెక్ట్‌ (ఎయిరేíÙయా), 72.8 శాతంతో ఇండిగో, 68.4 శాతంతో ఎయిర్‌ ఇండియా, 60.7 శాతంతో స్పైస్‌జెట్‌ వరుస స్థానాలో ఉన్నాయి. దేశీ మార్గాల్లో ఇండిగో మార్కెట్‌ వాటా 61.6 శాతానికి చేరింది. ఎయిర్‌ ఇండియా వాటా క్రితం నెలలో ఉన్న 14.2 శాతం నుంచి 13.7 శాతానికి క్షీణించింది. విస్తారా మార్కెట్‌ వాటా 9.2 శాతంగా ఉంది. ఏఐఎక్స్‌ కనెక్ట్‌ వాటా 5.4 శాతం నుంచి 5.1 శాతానికి పరిమితమైంది. ఎయిర్‌ ఇండియా, విస్తారా, ఏఐఎక్స్‌ కనెక్ట్‌ టాటా గ్రూపు సంస్థలే. ఆకాశ ఎయిర్‌ వాటా 4.4 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. స్పైస్‌జెట్‌ మార్కెట్‌ వాటా 4.7 శాతం నుంచి 4 శాతానికి క్షీణించింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement