రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్‌..! | Apple Starts World Wide Conference, Interesting And Rare Facts About Apple Co | Sakshi
Sakshi News home page

రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్‌..!

Published Mon, Jun 10 2024 8:47 AM | Last Updated on Mon, Jun 10 2024 10:28 AM

apple starts world wide conference facts about apple co

ప్రపంచ నం.1 కంపెనీగా చలామణి అవుతున్న యాపిల్‌ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టెక్‌ పరిశ్రమలో ఈ కంపెనీ గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. యాపిల్ కంపెనీ 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) కార్యక్రమం సోమవారం (జూన్ 10) నుంచి జరగనుంది. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఈసారి కూడా లేటెస్ట్ ఉత్పత్తులను ఆవిష్కరిస్తుంది. అటువంటి సంస్థ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

  • ఆదాయం, ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోనే యాపిల్‌ అతిపెద్ద సంస్థ.

  • కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా రూ.27 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.

  • యాపిల్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగి సగటు జీతం సంవత్సరానికి రూ.9 కోట్లు.

  • 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున 6,32,000 ఐఫోన్ల అమ్మకాలు జరిపింది.

  • యాపిల్ ఐప్యాడ్‌లో వినియోగిస్తున్న రెటీనా డిస్‌ప్లేను శామ్‌సంగ్ కంపెనీ తయారు చేస్తోంది.

  • యాపిల్ కో-ఫౌండర్‌లో ఒకరైన రొనాల్డ్‌వేన్‌ 1976లో తనకు చెందిన కంపెనీ 10శాతం షేర్లను 800 అమెరికన్‌ డాలర్లకే(ప్రస్తుత విలువ 4300 డాలర్లు-రూ.3.5లక్షలు) విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ షేర్స్‌ విలువ 35 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.3లక్షలకోట్లు).

  • ప్రతి యాపిల్ ప్రకటనలోని ఫోన్ ఇమేజ్‌లో సమయం 9:41 AM అని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్‌ను 09:41 AM కి ఆవిష్కరించాడు. అందుకు గుర్తుగా కంపెనీ అలా చేస్తోంది.

  • యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికనే వాదనలున్నాయి.

  • యాపిల్ మాక్‌బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదు. ఎలాగంటారా..? అది బుల్లెట్‌ప్రూఫ్.

  • యాపిల్ కంప్యూటర్ల పరిసరాల్లో ధూమపానం చేస్తే దాని వారంటీ తగ్గిపోతుందని చెబుతుంటారు.

  • స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నపుడు తన వార్షిక వేతనం ఎంతో తెలుసా..? కేవలం 1 యూఎస్‌ డాలర్‌(ప్రస్తుతం రూ.83).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement