ఎయిరిండియా భోజనంలో మెటల్‌ బ్లేడ్‌..! | Air India passenger finds metal blade in meal, airline responds | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా భోజనంలో మెటల్‌ బ్లేడ్‌..!

Published Mon, Jun 17 2024 3:29 PM

Air India passenger finds metal blade in meal, airline responds

టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా విమానంలో ఏర్పాటుచేసిన భోజనంలో మెటల్‌ బ్లేడ్‌ గుర్తించినట్లు ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కంపెనీ వర్గాలు స్పందిస్తూ ఘటనను ధ్రువీకరించాయి.

ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా మాట్లాడుతూ..‘మా విమానంలో ఒక ప్రయాణికుడి భోజనంలో మెటల్‌ వస్తువు గుర్తించారు. దానిపై వెంటనే దర్యాప్తు జరిపాం. కూరగాయలు కట్‌ చేసేందుకు ఉపయోగించే ప్రాసెసింగ్ మెషీన్ నుంచి ఆ మెటల్‌ వస్తువు వచ్చినట్లు తెలిసింది. మా క్యాటరింగ్ భాగస్వామి సదుపాయాలు, పరిసరాలను నిత్యం తనిఖీ చేయడంతో పాటు, ముఖ్యంగా ఏదైనా గట్టి కూరగాయలను తరిగే క్రమంలో జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడుతామని హామీ ఇస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తాం’ అని చెప్పారు.

ఇదీ చదవండి: ఖరీదైన నగరాల్లో ముంబయి టాప్‌.. కారణం..

ఇటీవల ఎయిరిండియా విమానయాన సంస్థలో సరిగా ఉడకని ఆహారం తనకు ఇచ్చారని, సీటు సరిగాలేదని మరో ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం..న్యూదిల్లీ నుంచి నెవార్క్ వెళ్లేందుకు ఎయిర్ఇండియాలో ప్రయాణించాలని నిర్ణయించుకుని బిజినెస్‌క్లాస్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. విమానం టేకాఫ్‌ అయిన దాదాపు 30 నిమిషాల తర్వాత పడుకోవాలనుకున్నాడు. దాంతో సీటును ఫ్లాట్‌బెడ్‌(పడుకునేందుకు వీలుగా)మోడ్‌కు తీసుకురావాలనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దాంతో తీవ్ర నిరాశకుగురైనట్లు ప్రయాణికుడు చెప్పాడు. దాంతోపాటు అదే విమానంలో సరిగా ఉడకని ఆహారాన్ని అందించినట్లు పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement