ఎన్‌టీఏను రద్దు చేయాల్సిందే... - | Sakshi
Sakshi News home page

ఎన్‌టీఏను రద్దు చేయాల్సిందే...

Published Sat, Jun 22 2024 12:22 AM | Last Updated on Sat, Jun 22 2024 12:22 AM

ఎన్‌టీఏను రద్దు చేయాల్సిందే...

ఖమ్మంమయూరిసెంటర్‌: నీట్‌ పేపర్‌ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి బాధ్యులను శిక్షించడమేకాక ఎన్‌టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌, యూత్‌ కాంగ్రెస్‌, ఏఐవైఎఫ్‌, పీడీఎస్‌యూ, పీవైఎల్‌, పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూ సంఘాల జిల్లా కార్యదర్శులు తుడుం ప్రవీణ్‌, బషీరుద్దీన్‌, ఇటికాల రామకృష్ణ, యడ్లపల్లి సంతోష్‌, నానబాల రామకృష్ణ, వి.వెంకటేశ్‌, ఎన్‌వీ రాకేశ్‌, మస్తాన్‌, రమేశ్‌, ఆసిఫ్‌ ఆధ్వర్యాన శుక్రవారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల నుంచి జెడ్పీసెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నీట్‌ పేపర్‌ లీకేజీపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా ప్రధాని, కేంద్ర మంత్రులు స్పందించకపోవడం సరికాదన్నారు. ఇకనైనా సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు చింతల రమేశ్‌, మంద సురేశ్‌, దాశోజు శ్రావణ్‌, మడుపల్లి లక్ష్మణ్‌, పొనుకుల సుధాకర్‌, లక్ష్మణ్‌, ఉమాశంకర్‌, క్రాంతి, సంగీత, బొల్లం మహేశ్‌, ఉదయ్‌కిరణ్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

నిరసన ప్రదర్శనలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement