ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి చేయాలి - | Sakshi
Sakshi News home page

ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి చేయాలి

Published Sat, Jun 22 2024 12:18 AM | Last Updated on Sat, Jun 22 2024 12:18 AM

ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి చేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. పలు శాఖల అధికారులతో కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం ఆయన డీఆర్డీఓ విద్యాచందనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. జిల్లాలో 697 పాఠశాలల ఆవరణ లేదా తరగతి గదిలో స్టీల్‌ ట్యాంక్‌ ఏర్పాటుచేసి దానికి సెడ్మెంట్‌ ఫిల్టర్‌ను అమర్చాలని సూచించారు. దీంతో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని, వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నివారించవచ్చని అన్నారు. విద్యార్థులు భోజన సమయంలో చేతులు, భోజనానంతరం ప్లేట్లు కడుక్కునేందుకు వీలుగా స్టీల్‌ వాష్‌బేసిన్లు ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదుల్లో ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు బిగించాలని, వైరింగ్‌ మొత్తం కన్సిల్డ్‌ పద్ధతిలో చేయించాలని సూచించారు. మరుగుదొడ్లలో టైల్స్‌ కాకుండా కాంక్రీట్‌ ఫ్లోరింగ్‌ చేయించి రెడాకై ్సడ్‌ వేయాలని అన్నారు. ప్రతీ పాఠశాల ఆవరణలో మునగ, చింత, కరివేపాకు, ఉసిరి, వెలక్కాయ వంటి ఎత్తయిన చెట్లు నాటాలని, పిల్లల అహ్లాదం కోసం మల్లె, మందార, కనకాంబరం, నందివర్ధనం, గులాబీ మొక్కలు పెంచాలని చెప్పారు. ఆరోగ్య రీత్యా తులసి, ఇన్సూలిన్‌ ప్లాంట్‌, రణపాల, నేల ఉసిరి, తిప్పతీగ మొక్కలు ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌ ఈఈ శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఓ వెంకటేశ్వరాచారి, ఆర్‌అండ్‌బీ డీఈ నాగేశ్వరరావు, మున్సిపల్‌ డీఈ రవికుమార్‌, మెప్మా పీడీ రాజేష్‌, సెర్ప్‌ డీపీఎం నాగజ్యోతి, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

అథ్లెట్‌కు అభినందన..

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఈనెల 15 నుంచి 17 వరకు జరిగిన జాతీయ యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన తోలెం శ్రీతేజ హెప్టాత్లోన్‌ ఈవెంట్‌లో రాష్ట్రం తరఫున పాల్గొని 4,136 పాయింట్లతో జాతీయస్థాయిలో తృతీయ స్థానం సాధించి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పాటిల్‌ శుక్రవారం శ్రీతేజను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. తాను కూడా అథ్లెటిక్స్‌లో ఢిల్లీలో సాధన చేశానని, 400 మీటర్ల పరుగుపందేన్ని 53 సెకనల్లో పూర్తి చేశానని గుర్తు చేసుకున్నారు. అథ్లెటిక్స్‌లో బాగా సాధన చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. శ్రీతేజకు అథ్లెటిక్స్‌ షూ అందజేయాలని జిల్లా క్రీడల అధికారి సంజీవరావును ఆదేశించారు. శ్రీతేజ కోచ్‌ పి.నాగేందర్‌, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కె మహీధర్‌ను కూడా కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో క్రీడా కార్యాలయ సూపరింటెండెంట్‌ ఉదయ్‌కుమార్‌, తిరుమలరావు పాల్గొన్నారు.

కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement