గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి - | Sakshi
Sakshi News home page

గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి

Published Fri, Jun 21 2024 2:52 AM | Last Updated on Fri, Jun 21 2024 2:52 AM

గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి

నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌): సర్ధార్‌ గౌతు లచ్చన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సర్ధార్‌ గౌతు లచ్చన్న విగ్రహ కమిటీ అధ్యక్షులు రావుల మణి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనగాని సత్యప్రసాద్‌ను గౌడ సంఘ ప్రతినిధులు కలిసి అభినందించడంతోపాటు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడలకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, గీత కార్మికులకు గీత కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గాలి సుబ్బారావు, మొరాకుల రాము, నరేంద్ర, వెంకటరమణ, ప్రసాద్‌, రమణ, గౌడ సంఘీయులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement