జీవితంపై విరక్తితో దివ్యాంగుడు బలవన్మరణం - | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తితో దివ్యాంగుడు బలవన్మరణం

Published Fri, Jun 21 2024 2:52 AM | Last Updated on Fri, Jun 21 2024 2:52 AM

జీవితంపై విరక్తితో దివ్యాంగుడు బలవన్మరణం

అద్దంకి: జీవితంపై విరక్తితో ఓ దివ్యాంగుడు బ్రిడ్జి గ్రిల్స్‌కు తాడు కట్టి ఉరివేసుకుని మృతి చెందాడు. ఈ ఘటన పట్టణంలోని అద్దంకి – దర్శి రహదారిలోని గుండ్లకమ్మ వంతెనపై గురువారం వెలుగు చూసింది. అందిన సమాచారం మేరకు.. పట్టణంలోని పెరికపాలెంకు చెందిన నాగేశ్వరరావు ఉరఫ్‌ శేషు లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి వినుకొండకు చెందిన మహిళతో వివాహం అయింది. భార్యా భర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ఐదు సంవత్సరాల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం నాగేశ్వరరావు (50) లారీ యాక్సిడెంట్‌లో కాళ్లకు దెబ్బ తగిలి పనిచేయకుండా పోయాయి. దీంతో వంతెన సమీపంలోని ఓ డైరీలో రాత్రి సమయంలో పడుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వంతెన గ్రిల్స్‌కు లారీకి కట్టే తాడును బిగించి, ఆ తాడుతో మెడకు ఉరివేసుకుని కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గమనించారు. గుండ్లకమ్మ వంతెనపై స్టాండు, చెప్పులు, కూల్‌డ్రింక్‌ సీసా పడి ఉన్నాయి.

పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి తాడు విప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని చెల్లెలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే వికలత్వాన్ని భరించలేక.. తనను ఆదరించే వారు లేకపోవడంతో బతుకుపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు.

ఉరివేసుకుని మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement