రాష్ట్ర పోలీస్‌ బాస్‌ గుంటూరు వాసే - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పోలీస్‌ బాస్‌ గుంటూరు వాసే

Published Fri, Jun 21 2024 2:50 AM | Last Updated on Fri, Jun 21 2024 2:50 AM

రాష్ట్ర పోలీస్‌ బాస్‌ గుంటూరు వాసే

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఏపీ డీజీపీగా ఎంపికై న సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు స్వస్థలం గుంటూరే. గుంటూరు పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని దేవాపురంలో ఓ సామాన్య కుటుంబంలో ఆయన జన్మించారు. తండ్రి ప్రొహిబిషన్‌న్‌అండ్‌ ఎకై ్సజ్‌ విభాగంలో అధికారి. ఆయనకు తిరుమలరావు సహా ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. తిరుమలరావు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించారు. గుంటూరు కృష్ణా నగర్‌లోని మున్సిపల్‌ స్కూల్లో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. సెంట్రల్‌ యూనివర్సిటీలో మేథ్స్‌లో గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు. తిరుమలరావు కొంతకాలం గుంటూరు టీజేపీస్‌ కళాశాలలో మేథమేటిక్స్‌ లెక్చరర్‌గా పని చేశారు. 1989లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.

గర్వకారణం ..

ద్వారకా తిరుమలరావు గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌ పూర్వ విద్యార్థి కావడం తమకు ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్‌ పాటిబండ్ల విష్ణువర్ధన్‌ పేర్కొన్నారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ హైస్కూల్‌ విద్యను ఇక్కడే అభ్యసించిన ద్వారకా తిరుమలరావు నాయకత్వంలో రాష్ట్ర పోలీసుశాఖ ఉత్తమ సేవలు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వారకా తిరుమలరావు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల పాలకవర్గం ఆకాంక్షించింది.

ద్వారకా తిరుమలరావు పాటిబండ్ల

సీతారామయ్య స్కూల్‌ పూర్వ విద్యార్థి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement