శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.తదియ సా.4.17 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: పునర్వసు రా.9.17 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ఉ.8.55 నుండి 10.38 వరకు, తదుపరి తె.5.42 నుండి 7.23 వరకు (తెల్లవారితే సోమవారం), దుర్ముహూర్తం: సా.4.46 నుండి 5.38 వరకు, అమృతఘడియలు: రా.6.56 నుండి 8.36 వరకు; రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు; యమగండం : ప.12.00 నుండి 1.30 వరకు; సూర్యోదయం: 5.28; సూర్యాస్తమయం: 6.29.
మేషం: బాకీలు వసూలవుతాయి. ఆప్తులు, బంధువులతో వివాదాలు తీరతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.
వృషభం: మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
మిథునం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.
కర్కాటకం: కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు.
సింహం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
కన్య: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు.
తుల: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.
వృశ్చికం: ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
ధనుస్సు: ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో పురోభివృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం: ప్రముఖులు సహాయపడతారు. ఆర్థికంగా బలపడతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. శుభవార్తలు. వాహనయోగం. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విశేష రాణింపు.
కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.
మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలలో ఆటంకాలు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment