June4: ఈ రాశివారు కొత్త పనులు చేపడతారు, ప్రయత్నాలు సఫలం Horoscope Today: Rasi Phalalu On 04-06-2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారు కొత్త పనులు చేపడతారు, ప్రయత్నాలు సఫలం

Published Tue, Jun 4 2024 6:38 AM | Last Updated on Tue, Jun 4 2024 6:38 AM

Horoscope Today: Rasi Phalalu On 04-06-2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.త్రయోదశి రా.9.03 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: భరణి రా.10.05 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ఉ.8.26 నుండి 9.57 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు తదుపరి రా.10.50 నుండి 11.34 వరకు, అమృతఘడియలు: సా.5.36 నుండి 7.09 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.27. 

మేషం: శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

వృషభం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మిథునం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుండి పిలుపు. సమాజంలో గౌరవం. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం: చిత్రమైన సంఘటనలు. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.

సింహం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు అధికం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

కన్య: వ్యవహారాలు  నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. దైవచింతన. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల: పనులు అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి.

వృశ్చికం: కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

ధనుస్సు: పనులు కొంత మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కీలక నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

మకరం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం: సన్నిహితుల సహాయంతో పనులు పూర్తి. సంఘంలో విశేష ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మీనం: ఇంతకాలం పడిన శ్రమ ఫలించదు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement