అధైర్య పడొద్దు.. మంచి రోజులొస్తాయి | YS Jagan Receives Grand Welcome At Pulivendula | Sakshi
Sakshi News home page

అధైర్య పడొద్దు.. మంచి రోజులొస్తాయి

Published Sun, Jun 23 2024 3:52 PM | Last Updated on Sun, Jun 23 2024 6:50 PM

YS Jagan Receives Grand Welcome At Pulivendula

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: తమ బిడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినీ గుండెలకు హత్తుకుంది పుట్టిన గడ్డ పులివెందుల. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చి తాను చేయగలిగేది మాత్రమే చెప్పిన జగన్ ఎప్పటికి తమ నాయకుడే అని చేతల్లో చూపించారు పులివెందుల వాసులు. రాజన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ... ముందుకు సాగుతున్న జగన్‌కు అండగా ఉంటామని నిరూపించింది. కష్టాలు తాత్కాలికమేనని.. మళ్లీ జగన్ పట్టం కడతారని అంటున్నారు పులివెందుల వాసులు. అందుకే సొంతూరికి వచ్చిన తమ బిడ్డకు అపూర్వ స్వాగతం పలికారు.

కడప జిల్లాలో జరుగుతున్న తన రెండో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలువురిని కలుసుకున్నారు.  రాయలసీమ లోని నాలుగు ఉమ్మడి జిల్లాలైన అనంతపురం చిత్తూరు కర్నూలు కడప ప్రాంతాల నుంచి దాదాపు 5,000 మంది అభిమానులు.. వైఎస్ జగన్ కలిసారు.

ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ ప్రోత్సహిస్తున్న రౌడీ ముఖలు చేస్తున్న దాడుల గురించి వైఎస్ జగన్‌కు వివరించారు. పార్టీ నేతలకు అభిమానులకు తాను అండగా ఉంటానని ఎవరు ఎలాంటి ఆందోళన గురి కావద్దని వైఎస్‌ జగన్‌ తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకు పులివెందులో వైఎస్ జగన్ వివిధ వర్గాలను కలుసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement