హైవేపై ‘సంక్రాంతి’ రద్దీ.. కిక్కిరిసిన వాహనాలు    | Sankranti Festival: Huge Rush On Hyderabad Vijayawada Highway | Sakshi
Sakshi News home page

హైవేపై ‘సంక్రాంతి’ రద్దీ.. కిక్కిరిసిన వాహనాలు   

Published Sat, Jan 13 2024 9:36 AM | Last Updated on Sat, Jan 13 2024 10:24 AM

Sankranti Festival: Huge Rush On Hyderabad Vijayawada Highway - Sakshi

సాక్షి, చౌటుప్పల్‌: హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు పండుగ కోసం స్వస్థలాలకు వెళ్తున్న క్రమంలో ఈ రద్దీ ఏర్పడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ పెరిగిపోయింది.

పంతంగి టోల్‌ప్లాజా వద్ద గురువారం అర్ధరాత్రి 12 నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 53 వేల వాహనాల రాకపోకలు సాగించాయి. గతేడాది రోజంతా(24 గంటలు) కలిపి అరవై వేల వాహనాలు మాత్రమే ప్రయాణించగా.. ఈ ఏడాది కేవలం 18 గంటల్లోనే 50వేలకుపైగా వాహనాలు వెళ్లడం గమనార్హం.  

సంక్రాంతికి భారీగా సొంతూళ్లకు జనాలు వెళ్తున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద హైదరాబాద్- విజయవాడ వైపు పది టోల్ బూత్‌లను జీఎంఆర్‌ ఓపెన్ చేసింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్ల పహాడ్ వద్ద రద్దీ కొనసాగుతోంది.  కొర్లపహాడ్ వద్ద ఎనిమిది టోల్ బూత్‌లను సిబ్బంది తెరిచారు.

తెలుగు రాష్ట్రాల్లో బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. తిరుపతి, విజయవాడ,విశాఖపట్నం బస్‌స్టేషన్లల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. రద్దీ కారణంగా ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు ఏర్పాటు చేసింది. అదనపు చార్జీలు లేకుండానే సర్వీసులను నడుపుతున్నారు.

సంక్రాంతి ప్రయాణికులతో రాజమండ్రి, వైజాగ్, విజయవాడ విమానాలు ఫుల్‌  
శంషాబాద్‌: సంక్రాంతి పండుగ ప్రయాణ సందడి ఆకాశయానంపై కూడా పడింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరే విమానాలు ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. శని, ఆది, సోమవారాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాల్లో దాదాపుగా సీట్లన్నీ బుక్‌ అయ్యాయి.

ఆకాశాన్నంటుతున్న ఫ్లైట్‌ చార్జీలు..
ఒకటి, రెండు సీట్లు ఉన్న వాటిలోని ప్రయాణచార్జీలు చుక్కలనంటుతున్నాయి. విశాఖపట్టానికి సాధారణ సమయాల్లో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఉండగా ఇప్పుడు ఏకంగా ముౖప్పైవేల పైచిలుకు చార్జీలు వసూలు చేస్తున్నారు. విజయవాడ, రాజమండ్రి వెళ్లే విమానాల్లో కూడా కనీసం పదివేల రూపాయలకు తగ్గకుండా చార్జీలున్నాయి. ఇందులో కూడా నేరుగా కాకుండా వయా ఢిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వెళ్లే విమానాలు మాత్రమే ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రయాణ సమయం కనీసం 10 నుంచి 16 గంటల వరకు ఉంది.    

ఇదీ చదవండి: అద్దె బ్యాచ్‌ దిగింది !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement