పేదలపై అక్కసు.. అసైన్డ్‌ భూములకు హక్కులపై ‘ఈనాడు’ వక్రభాష్యం | Eenadu Yellow Media Fake News On Poor People Rights to assigned lands | Sakshi
Sakshi News home page

పేదలపై అక్కసు.. అసైన్డ్‌ భూములకు హక్కులపై ‘ఈనాడు’ వక్రభాష్యం

Published Sun, Jul 14 2024 4:25 AM | Last Updated on Sun, Jul 14 2024 8:53 AM

Eenadu Yellow Media Fake News On Poor People Rights to assigned lands

దళిత, పేద రైతులకు యాజమాన్య హక్కులివ్వడం తప్పా? 

దశాబ్దాలుగా తమ భూములపై హక్కులు లేకుండా బతికిన పేద రైతులు 

వారిని సంపూర్ణ భూ యజమానులుగా మార్చేందుకే అసైన్డ్‌ చట్టం తెచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 

ప్రజాప్రతినిధుల కమిటీ విస్తృత అధ్యయనం తర్వాతే నిర్ణయం 

ఇదివరకెన్నడూ లేని విధంగా 27 లక్షల మంది రైతులకు లబ్ధి

తమ భూములపై హక్కులొచ్చాక కొందరు రైతులు అమ్ముకుంటే మీకేంటి బాధ? 

మంచి ధర రావడంతో పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం విక్రయిస్తే తప్పేంటి? 

‘తల్లికి వందనం’పై దొంగాట నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే దుష్ప్రష్పచారం  

అసైన్డ్‌ భూములకు హక్కులపై ‘ఈనాడు’ వక్రభాష్యం దళిత, పేద రైతులకు యాజమాన్య హక్కులివ్వడం తప్పా? దశాబ్దాలుగా తమ భూములపై హక్కులు లేకుండా బతికిన పేద రైతులు వారిని సంపూర్ణ భూ యజమానులుగా మార్చేందుకే అసైన్డ్‌ చట్టం తెచ్చిన జగన్‌ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల కమిటీ విస్తృత అధ్యయనం తర్వాతే నిర్ణయం ఇదివరకెన్నడూ లేని విధంగా 27 లక్షల మంది రైతులకు ప్రయోజనం తమ భూములపై హక్కులొచ్చాక కొందరు రైతులు అమ్ముకుంటే మీకేంటి బాధ?

అసైన్డ్‌ భూముల రైతులకు చరిత్రాత్మక రీతిలో వైఎస్‌ జగన్‌ హయాంలో దక్కిన యాజమాన్య హక్కులను ప్రశ్నించేలా ఎల్లో మీడియా.. ప్రధానంగా ‘ఈనాడు’ వింత ధోరణి ప్రదర్శిస్తోంది. వారి భూములపై వారికి హక్కులు ఇవ్వడమే నేరమన్నట్లు వక్ర భాష్యాలు చెబుతోంది. పేద రైతులు, దళితులు ఇంకా బానిసత్వంలోనే బతకాలని కోరుకుంటోంది. వారి భూములకు వారు యజమానులుగా మారడం సరికాదంటూ ఏడుపుగొట్టు రాతలతో దుష్ప్రచారం చేస్తోంది. పేదలు, దళితులు ఆరి్థకంగా ఎదగడానికి వీల్లేదంటూ పెడబొబ్బలు పెడుతూ కోడిగుడ్డుపై ఈకలు పీకుతోంది.  

దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు లేక రాష్ట్రంలో లక్షలాది మంది అసైన్డ్‌ రైతులు అష్టకష్టాలు అనుభవించారు. ఏళ్ల తరబడి ఆ భూములకు హక్కులివ్వాలని ప్రాధేయపడినా ఏ ప్రభుత్వం కనికరించడంలేదు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో దళిత, ఇతర పేద రైతులకు ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు యాజమాన్య హక్కులు లభించాయి. తద్వారా 20 ఏళ్లకు పైబడి తమ ఆధీనంలో ఉన్న అసైన్డ్‌ భూములపై పేద, దళిత రైతులకు సంపూర్ణ అధికారాలు దఖలు పడ్డాయి. లక్షలాది మంది పేద రైతులు వారి భూములపై యాజమాన్య హక్కులు పొంది సంపూర్ణ రైతులుగా మారారు. తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో కొంత మంది రైతులు వాటిని విక్రయించారు. ఆ సొమ్ము ద్వారా పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇళ్లు, ఇతరత్రా ఆరి్థక ఇబ్బందుల నుంచి గట్టెక్కారు. చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ను వెనకేసుకొస్తున్న ‘ఈనాడు’కు ఇది ఏమాత్రం గిట్టడం లేదు.

సాక్షి, అమరావతి: ఏపీలో అసైన్డ్‌ భూముల చ­ట్టాన్నే అపహాస్యం చేసేలా ఈనాడు, ఇతర ఎల్లో మీ­డియా దిగజారి వ్యవహరిస్తోంది. అసైన్డ్‌ భూముల­కు ఎస­రు పెట్టేశారంటూ పేద, దళిత రైతులు తమ భూ­ములపై నిర్ణయం తీసుకోవడాన్ని అవమానకరంగా వక్రీకరిస్తోంది. ఆ భూములను అధికారులు, వైఎస్సార్‌సీపీ నేతలు కారుచౌకగా కొనుగోలు చేశా­రని నిరాధారంగా నిందిస్తోంది. పేద రైతులు కొత్త­గా వచ్చిన యాజమాన్య హక్కుల ఆధారంగా తమ భూ­మిని అమ్ముకుంటే దాన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ విపరీత అర్థాలు తీస్తోంది. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఏటా రూ.15 వేల చొప్పు­న ‘తల్లికి వందనం’ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పు­డు తల్లికి మాత్రమే ఇస్తామని బొంకుతున్న విషయం బయట పడటంతో.. తమ మోసాన్ని ప్రజలు గ్రహించకుండా దృష్టి మళ్లించడానికి ‘బాబు అండ్‌ కో’ అసైన్డ్‌ హక్కుల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చింది. 

మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయ­డంపై దృష్టి పెట్టకుండా, ప్రజలకు మేలు చేసేలా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఎలా తొలగించాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎల్లో మీడియా, ప్రధానంగా ఈనాడు శకు­ని పాత్ర పోషిస్తోంది. ఏ ప్రభుత్వమైనా ఒక కార్యక్రమాన్ని అమలు చేసినప్పుడు ఎలాంటి పక్షపాతం లేకుండా పరిశీలించి.. ఇంకా ఎలా మంచి చేయొచ్చు అని చెప్పే బాధ్యత పత్రికలకు ఉంటుంది. కానీ మే­లు చేస్తున్న కార్యక్రమాలను ఎత్తివేయాలని, తీసివే­యాలంటూ పనిగట్టుకుని తప్పుడు రాత­లు రాయ­డం దారుణం. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది పే­ద­వాళ్లు. పేదలకు నష్టం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం, ఎల్లో మీడియా ఉన్నట్టు మరోసారి రుజువైంది. చంద్రబాబు, తాము బాగుంటే చాలని ఈనాడు కిరణ్‌ అనుకోవడం దుర్మార్గం.   

అసైన్డ్‌ భూములు దోచిందెవరు? 
నిజంగా అసైన్డ్‌ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడింది ఎవరు? గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాదా? రాజధాని పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి, మోసం చేసి 1,100 ఎకరాలు కొట్టేశారు. వాళ్ల చేతిలో ఉంటే పరిహారం రాదని, ప్లాట్లు రావని చెప్పి లాగేసుకున్నారు. ఆ తర్వాత జీవో ఇచ్చి చేతులు మారిన భూములను పూలింగ్‌లోకి తీసుకుని టీడీపీ బినామీలకు ప్లాట్లు కేటాయించి కోట్లు కొల్లగొట్టారు. 1,336 మంది బినామీలు ఇంకా ఉన్నా­రు. దీనిపై కేసు నడుస్తోందిం. ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఇదే ఈనాడు ఏనాడైనా నాలుగు వాక్యాలు రాసిందా? అసైన్డ్‌ భూముల సమస్య ఈనాటిది కాదు. పేదలు, రైతులు అందరూ ఇబ్బందులు పడుతున్నా­రు. భూమి ఉన్నాం కష్టం వస్తే.. దాన్ని ఏదోలా ఉపయోగించుకుందామన్నా.. చే­సు­కోలేని పరిస్థితి. 



పైసాకో, పరక్కో ఏదో ఒక కాగితం మీద రాసిచ్చి ఎంతో కొంత తీసుకునే పరిస్థితి. రికార్డుల్లో ఒక పేరు.. భూమి దగ్గరకు వస్తే మరొకరి పేరు. దేనికీ పొంతన లేదు. ఒకరేమో కష్టం తీర్చుకోవడం కోసం అమ్ముకుంటే, దాన్ని కొనుక్కున్నవాడికీ కంటిమీద కునుకులేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్‌ ప్రభుత్వం అసైన్డ్‌ భూముల చట్టానికి సవరణలు చేసింది. గతేడాది అక్టోబరు 27న దీనికి గెజిట్‌ జారీ అయ్యింది. నిజంగా ఎవ­రో ఒకరికి లబ్ధి చేకూర్చాలనుకుంటే.. ఎవరి ఆధీ­నంలో భూమి ఉంటే వారికే ఇచ్చేయండి అని చెప్పే­వారు. కాని అలా జరగలేదు. ఏ పేదవాడు అయితే లబ్ధిదారో, ఒరిజనల్‌ అసైనీగా ఉన్నాడో, వారు లేకపో­తే వారసులు ఎవరున్నారో వారికే సర్వహక్కులూ ఇవ్వండని చెప్పింది. ఇందులో తప్పు ఏముంది? ఇప్పుడు వీరందర్నీ రోడ్డు మీదకు ఈడ్చాలని చూస్తున్నారా? పేదల పొట్టకొట్టాలని చూస్తున్నారా?  

ఇదీ అసైన్డ్‌ భూముల నేపథ్యం 
వివిధ కేటగిరీలకు చెందిన లబ్ధిదారులకు వ్యవసాయం కోసం భూమి అసైన్డ్‌ చేసే విధానం కొన్ని దశాబ్దాల క్రితం మొదలైంది. 1954కు ముందు అసైన్‌ చేసిన భూములది ఒక కేటగిరీ, 1954 తర్వాత మరో కేటగిరీ. 1954కు ముందు అసైన్డ్‌దారులకు ఇచ్చిన పట్టాల్లో ఎక్కడా అమ్ముకోకూడదనే షరతు లేదు. 1954 తర్వాత ఇచ్చిన అసైన్డ్‌ పట్టాల్లో మాత్రం ఈ నిబంధన పెట్టారు. దీంతో ఆ భూములన్నీ నిషేధిత జాబితాలో చేరాయి. వాటిని అమ్ముకునే అవకాశం లేదు. గతంలో బాబు ప్రభుత్వం చేసిన వెబ్‌ల్యాండ్‌ దుర్మార్గాల వల్ల 1954కు ముందు అసైన్డ్‌ చేసిన భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. వాటిని తొలగించుకోవడానికి రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగిం, లంచాలు ఇచ్చిం విసిగిపో­యిన రైతు­లు ఎంతో మంది ఉ­న్నారు. 

1954 నుంచి కూడా పేదలకు భూములు ఇవ్వడం జరుగుతూనే ఉంది. 70 ఏళ్ల తర్వాత కూడా ఆ భూముల మీద వారికి హక్కులు లేవు. అదే స్వాతంత్య్ర సమరయోధులో, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అయితే అసైన్‌ చేసిన తర్వాత పదేళ్లకు అమ్ముకునే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఈ విషయంలో వారికి పూర్తి హక్కులు ఉన్నాయి. భూమి లేని నిరుపేదలకు మాత్రం హక్కులు లేవు. 2, 2.5 ఎకరాల వరకూ అసైన్‌మెంట్‌ పట్టా ఉన్న వాళ్లు తమ అవసరాలకు ఒక అరెకరం అమ్ముకోవాలనుకుంటే చట్ట ప్రకారం అమ్ముకోవడం కుదరదు. దీంతో సాదా బైనామా పద్ధతిలో భూముల అమ్మకాలు జరిగాయి. దీనివల్ల నిరుపేదలైన అసైనీలకు రావాల్సిన రేటులో కనీసం 25 శాతం కూడా వచ్చేది కాదు. 

భూమిని అమ్ముకోకుండా సాగు చేసుకున్న వారు కూడా టైటిల్‌ లేకపోవడం వల్లం రెవిన్యూ శా­ఖ నుంచి ఎప్పుడైనా నోటీసులు వస్తాయని, ఆ భూ­మిని ప్రభుత్వం ఎక్కడ తీసేసుకుంటుందోనని, ఎక్క­డ రిజర్వ్‌ చేస్తుందోనని భయాందోళనలు ఉండేవి. ఇ­టు అసైనీకి.. అటు కొనుక్కున్న వారికి లబ్ధి లే­దు.రెవెన్యూ రికార్డులు క్షేత్ర పరిస్థితిని తెలియజెప్పేలా లేవు. రికార్డులు ఒకరి పేరు మీద ఉంటే.. భూ­ములు మరొకరి ఆదీనంలో ఉన్నాయి. ఇప్పటివరకు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలను ప్రభుత్వాలు అసైన్‌మెంట్‌ చేస్తే.. ఆ రికార్డులేవీ క్షేత్ర స్థాయికి అనుగుణంగా లేవు.  

పూర్తి అధ్యయనం తర్వాతే అసైన్డ్‌ చట్ట సవరణ 
జిల్లా కలెక్టర్లు పలుమార్లు జగన్‌ ప్రభుత్వం దృష్టికి అసైన్డ్‌ భూముల సమస్యను తీసుకు వచ్చాక రెవెన్యూ మంత్రి నేతృత్వంలో 13 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో 2022 ఆగస్టు 30వ తేదీన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కర్ణాటక, తమిళనాడులో పర్యటించిం అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్‌మెంట్‌ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. కేరళలో అయితే అసైన్‌ చేసిన మూడేళ్ల తర్వాత, కర్ణాటకలో 25 ఏళ్ల తర్వాత, తమిళనాడులో పదేళ్ల తర్వాత కొన్ని నిబంధనలతో అమ్ముకునే అవకాశం ఉంది. కర్ణాటకలో ఐదేళ్ల తర్వాత కలెక్టర్‌ అనుమతితో అసైన్డ్‌ భూములను అమ్ముకోవచ్చు. 

మిగులు భూముల్లో ఇచ్చిన అసైన్‌మెంట్‌ అయితే 25 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని తమిళనాడులో నిబంధన ఉంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత అసైన్‌ చేసిన 20 ఏళ్ల తర్వాత అసలైన ఒరిజనల్‌ లబ్ధిదారులకు, లేదా వారి వారసులకు అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు వీలు కల్పించాలని, దానికి అనుగుణంగా ఏపీ అసైన్‌మెంట్‌ చట్టం (పీఓటీ) 1977కు సవరణలు చేయాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. అంటే అసైన్డ్‌ భూములపై లబ్ధిదారులకు పూర్తి యాజ­మాన్య హక్కులు ఇవ్వాలని కమిటీ సిఫారసు చేయ­గా, దీనికి అప్పటి మంత్రివర్గం ఆమోదం తెలిపి, చట్టానికి సవరణలు చేసింది. 

అదే సందర్భంలో 20 ఏళ్లకు ముందే ఎవరైనా పేద రైతుల నుంచి భూము­లు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారికి ఎలాంటి హక్కులూ రావు. వారి విషయంలో 1977 నాటి పీఓటీ చట్టం అమల్లో ఉన్నట్టే. 2007,2008 నాటి సవరణలు కూడా వర్తిస్తాయి. దీనివల్ల అసైన్‌మెంట్‌ అయిన దగ్గర నుంచి 2023లో చట్ట సవరణ జరిగే వరకు అసైన్‌మెంట్‌ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన రైతులకే మేలు కలుగుతుంది. అంటే ఒరిజనల్‌ అసైనీలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. అందులో తప్పులు జరిగాయని, రద్దు చేయాలనే వాదనలో ఏమైనా అ­ర్థం ఉందా? ఎవరికైనా లబ్ధి చేకూర్చాలనుకుంటే ఒరిజనల్‌ అసైనీలకే హక్కులు ఇవ్వాలనే షరతు చట్టంలో ఎందుకు పెడతారు?  

27 లక్షల ఎకరాలపై పేదలకు హక్కులు
వైఎస్‌ జగన్‌ హయాంలో జరిగిన అసైన్డ్‌ చట్ట సవరణ ద్వారా సుమారు 15,21,160 మంది భూమిలేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. 20 సంవత్సరాలకు ముందు ఇచ్చిన భూములన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ భూములన్నీ 1954 తర్వాత అసైన్‌మెంట్‌ చేసినవే. అలాగే ప్రభుత్వం వ్యవసాయ భూములే కాకుండా ఇళ్ల పట్టాలు కూడా నిరుపేదలకు ఇచ్చింది. జగన్‌ ప్రభుత్వంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరుమీద నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇచ్చారు. 

గతంలో 20 సంవత్సరాల తర్వాత ఇళ్ల పట్టాలపై సర్వ హక్కులు కల్పించేలా ఉన్న చట్టాన్ని, జగన్‌ హయాంలో 10 సంవత్సరాలకు తగ్గిస్తూ పీఓటీ చట్టంలో సవరణ చేశారు. ఫలితంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు పొందినవారితోపాటు, మిగిలిన వారికీ ప్రయోజనం చేకూరింది. చంద్రబాబు ఎప్పుడైనా ఒక్క సెంటు భూమి పేదలకు ఇచ్చారా? పైగా అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుపడటం వాస్తవం కాదా?  

భూముల పేరుతో అన్యాయం చేసింది చంద్రబాబు కాదా? 
2016లో ఒక్క మెమో ద్వారా 2,06,171 ఎకరాల చుక్కల భూములను ఉద్దేశ పూర్వకంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 22ఎలో పెట్టి ఆ రైతులను సర్వనాశనం చేసింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక చుక్కల భూముల విషయంలో నష్టపోయిన 97,472 రైతులకు ఊరటనిచ్చింది. ఇప్పుడు వారిని కూడా రోడ్డుకు లాగేస్తారా? షరతులు గల పట్టా భూములున్న  వేల మంది రైతులకు సంబంధించిన 35 వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి వైఎస్‌ జగన్‌ మేలు చేశారు. ఇప్పుడు వీరిని కూడా రోడ్డున పడేస్తారా? గిరిజనులకు 2.83 లక్షల ఎకరాలపై హక్కు పత్రాలు ఇచ్చారు. వాళ్లనూ రోడ్డున పడేస్తారా? ఇవన్నీ పేద రైతులకు మంచి చేస్తూ తీసుకున్న నిర్ణయాలు. వాళ్లందరినీ రోడ్డున పడేయాలన్న చంద్రబాబు కోరికకు ఎల్లో మీడియా అక్షర రూపం ఇస్తోంది.  
దళిత రైతులను అవమానిస్తారా? 
అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడాన్ని ఎల్లో మీడియో ఓర్వలేకపోతోంది. తమ భూములపై హక్కుల కోసం ఏళ్ల తరబడి దళితులు ఎదురుచూశారు. భూములపై హక్కు వస్తే తమకు సమాజంలో గౌరవం పెరుగుతుందని భావించారు. దాన్ని వైఎస్‌ జగన్‌ నెరవేర్చారు. దీన్ని తప్పు పట్టడం అన్యాయం. హక్కులు వచ్చిన కొందరు రైతులు తమ భూములను అమ్ముకోవడం తప్పెలా అవుతుంది? వారి అవసరాల కోసమో, లేక ఆ భూమికి ఎక్కువ రేటు రావడం వల్లో అమ్ముకుని ఉండవచ్చు. ఆ భూములన్నింటినీ వైఎస్సార్‌సీపీ వాళ్లు కొన్నారనడం నిరాధారం. దళితులను అవమానించడానికే ఇలాంటి రాతలు రాస్తున్నారు.  
    – జూపూడి ప్రభాకర్‌రావు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు

పెత్తందార్ల కాళ్ల కిందే నలిగిపోవాలా? 
అసైన్డ్‌ భూములపై 20 సంవత్సరాల తర్వాత హక్కులు కల్పించడం ద్వారా వైఎస్‌ జగన్‌ దళితులు, పేద రైతుల తల రాతను మార్చారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పనిని ఆయన చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ధైర్యంగా ఈ పని చేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులకు తమ భూములపై సర్వ హక్కులు లభించాయి. సమాజంలో వారికి గౌరవం పెరిగింది. మావి అసైన్డ్‌ భూములు కావు, పట్టా భూములని చెప్పుకుంటున్నారు. అవసరమైతే ఎవరైనా అమ్ముకుంటున్నారు. దాని కోసమే, ఆ హక్కు కోసమే వారు పోరాడారు. సాధించుకున్న భూమిపై వారికి హక్కు ఉండదా? దళితులు పెత్తందార్ల కాళ్ల కిందే నలిగిపోవాలా? 
    – మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు

లక్షల మంది అసైన్డ్‌ రైతులకు లబ్ధి  
దళిత, పేద రైతులకు మేలు చేయడాన్ని కూడా తప్పు పట్టడం దారుణం. అసైన్డ్‌ భూములకు హక్కులివ్వడం వల్ల లక్షల మంది పేద, దళిత రైతులు ప్రయోజనం పొందారు. అసైన్డ్‌ భూములంటేనే వివాదాస్పద భూములుగా చిత్రీకరించిన పరిస్థితి ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన 50 ఏళ్ల తర్వాత కూడా ఆ భూమిపై వారికి హక్కు ఉండేది కాదు. తమకు హక్కు ఇస్తే ఆ భూమిని అవసరానికి ఉపయోగించుకుంటామని, అవసరమైతే రుణాలు తీసుకుంటామని రైతులు ఎన్నో ఏళ్లుగా మొత్తుకుంటున్నారు. ఎవరూ వినలేదు. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్‌ జగన్‌ మాత్రమే విన్నారు. ఆయన ప్రభుత్వం మాత్రమే పట్టించుకుంది. అసైన్డ్‌ రైతులకు యాజమాన్య హక్కులిచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ది. దాన్ని వక్రీకరించి ఇష్టానుసారం మాట్లాడడం తగదు.     
– నత్తా యోనారాజు, జాతీయ అధ్యక్షుడు, మాల మహానాడు   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement