‘ఏసీబీ యాప్‌’ను ప్రారంభించిన సీఎం జగన్‌.. యాప్‌ ఎలా పనిచేస్తుందంటే? CM YS Jagan Launches ACB 14400 Mobile Anti Corruption App | Sakshi
Sakshi News home page

‘ఏసీబీ యాప్‌’ను ప్రారంభించిన సీఎం జగన్‌.. యాప్‌ ఎలా పనిచేస్తుందంటే?

Published Wed, Jun 1 2022 5:18 PM | Last Updated on Wed, Jun 1 2022 6:21 PM

CM YS Jagan Launches ACB 14400 Mobile Anti Corruption App - Sakshi

సాక్షి, అమరావతి: అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. గతంలో సీఎం ఆదేశాలమేరకు ఏసీబీ ఈ యాప్‌ తయారు చేసింది. స్పందనపై నిర్వహించిన సమీక్షలో సీఎం.. యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఒకటే మాట చెబుతున్నామని.. ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట చాలా స్పష్టంగా చెప్పామన్నారు. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.
చదవండి: Fact Check: 'ఆ పథకాల రద్దు అవాస్తవం.. ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదు'

సీఎం ఇంకా ఏమన్నారంటే:
చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని లాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా పంపాం
ఎక్కడైనా, ఎవరైనా కూడా.. కలెక్టరేట్‌ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్‌ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే.. ఎవరైనా చేయాల్సింది ఒక్కటే.

తమ చేతుల్లోని ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్‌ చేసి... బటన్‌ ప్రెస్‌చేసి వీడియోద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేయండి.. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది


అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకు వస్తున్నాం
ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుంది
ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉంది
అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది
మన స్థాయిలో అనుకుంటే.. 50శాతం అవినీతి అంతం అవుతుంది
మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది
అవినీతి లేని పాలన అందించడం మన అందరి కర్తవ్యం:
ఎవరైనా పట్టుబడితే.. కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి:

యాప్‌ ఎలా పనిచేస్తుందంటే...:
పౌరులు నేరుగా యాప్‌ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం
గూగుల్‌ ప్లే స్టోర్‌లో యాప్‌
యాప్‌ డౌన్లోడ్‌ చేయగానే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ
ఓటీపీ రిజిస్టర్‌ చేయగానే వినియోగానికి యాప్‌ సిద్ధం
యాప్‌లో 2 కీలక ఫీచర్లు
యాప్‌ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను  నేరుగా లైవ్‌రిపోర్ట్‌ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం
లాడ్జ్‌ కంప్లైంట్‌ ఫీచర్‌ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి.. ఫిర్యాదుకు  తనదగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం
ఫిర్యాదు రిజిస్టర్‌ చేయగానే మొబైల్‌ ఫోన్‌కు రిఫరెన్స్‌ నంబరు 
త్వరలో ఐఓఎస్‌ వెర్షన్‌లోనూ యాప్‌ను సిద్ధంచేస్తున్న ఏసీబీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement