-
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ
-
కొల్లగొట్టిన సొమ్ము ఏం చేశారు?
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రాథమిక ఆధారాల మేరకు రూ.700 కోట్ల మేరకు నిధులు దారి మళ్లించినట్టు ఏసీబీ గుర్తించింది. ఇలా కొల్లగొట్టిన కోట్లాది రూపాయల సొమ్మును ఏం చేశారు..? ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు..? మీరే ఈ కుంభకోణానికి తెరతీశారా..? లేదా మీపై ఇంకెవరైనా ఒత్తిడి పెట్టారా...? అంటూ ఏసీబీ అధికారులు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీలో భాగంగా అధికారులు ఇద్దరిని మంగళవారం రెండోరోజూ ప్రశ్నించారు. మొదటి రోజు ఇద్దరి నుంచి వేర్వేరుగా సేకరించిన అంశాలపైనా రెండో రోజు మార్చిమార్చి ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. ప్రైవేటు వ్యక్తులను గొర్రెల కొనుగోళ్లలోకి ఎలా తెచ్చారు.. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వెనుక ఎవరి ఒత్తిడైనా ఉందా..? అని ప్ర శ్నించినట్టు తెలిసింది. ఈ ఇద్దరూ కలిసే ఈ మొత్తం కుంభకోణానికి తెరతీశారా..? ఇంకా ఎవరైనా ఆదేశాలిచ్చారా.. అన్న కోణంలోనూ ప్రశ్నించినట్టు తెలిసింది. బినామీల పేర్లతో చెక్కులు జారీ చేయించిన తర్వాత కొల్లగొట్టిన సొమ్మును అనుకూలుర బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారన్న దానిపైనా అధికారులు సమాచారం సేకరించినట్టు తెలిసింది. బినామీ బ్యాంకు ఖాతాలు, పరారీలో ఉన్న నిందితుల గురించి కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు రాంచందర్, క ల్యాణ్కుమార్ సమాధానాలు దాట వేసినట్టు సమాచారం. విచారణలో వారి నుంచి ఆశించిన సమాచారం రాలేదని, బుధవారం కస్టడీ చివరిరోజు కావడంతో కీలక సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. రాంచందర్ సస్పెన్షన్ అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మే 31న ఏసీబీ రాంచందర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాంచందర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదర్ సిన్హా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏసీబీ దూకుడు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) గత కొద్ది నెలలుగా దూకుడు పెంచింది. వరుస తనిఖీలు, ఆకస్మిక ‘ఆపరేషన్’లతో ఏసీబీ అధికారులు హల్చల్ చేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే వనపర్తి జిల్లా టీజీఎస్పీడీఎల్ ఉద్యోగులు ముగ్గురు, గొర్రెల కుంభకోణంలో ఇద్దరు, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో సీఐ, ఎస్సై, మరో ప్రైవేటు వ్యక్తి కలిపి ముగ్గురు..గండిపేట్ ఎమ్మార్వో కార్యాలయంలో నలుగురు అధికారులు కలిపి మొత్తంగా 12 మంది అవినీతి అధికారులను కటకటాల వెనక్కి నెట్టారు. ఇక గొర్రెల కుంభకోణం కేసులో పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్‌ను అరెస్టు చేసి కొరడా ఝుళిపిస్తున్నామనే సంకేతాలనిచి్చంది ఏసీబీ. కొద్ది రోజుల ముందు ఆర్టీఏ కార్యాలయాలు, చెక్‌పోస్టులలో ఏకకాలంలో 15 ఏసీబీ అధికారుల బృందాలు 12 ప్రాంతాల్లో సోదాలు చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్లుగా మారు వేషాల్లో వెళ్లి మరీ ఆర్టీఏ చెక్పోస్టులపై సోదాలు చేయడం గమనార్హం. ఆనంద్ రాకతో.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆయన కింది స్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో క్షేత్రస్థాయిలోని అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 78 కేసులు నమోదు చేయగా.. గతేడాది(2023)లో మొత్తం కలిపి కేసులు 94 మాత్రమే కావడం గమనార్హం. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్,పట్టణాభివృద్ధిశాఖతోపాటు పోలీస్‌శాఖలో అవినీతిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. దీంతో పాటు ఇటీవల ఆర్టీఏ కార్యాలయాలపై మెరుపు దాడులు చేయడంతో అవినీతికి నిలయాలుగా మారినన మిగతా ప్రభుత్వ శాఖలపైనా ఏసీబీ నజర్ ఉన్నట్టుగా తేటతెల్లం అయ్యింది. రాష్ట్రంలో అవినీతికి మూల కేంద్రాలుగా చర్చ జరుగుతోన్న ఎక్సైజ్, రిజి్రస్టేషన్ల శాఖలపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ రెండు శాఖలే టార్గెట్‌గా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినా ఆశ్చర్యపోవక్కర్లేదని తెలుస్తోంది. చిక్కుతున్న అవినీతి తిమింగలాలు.. ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్‌తో ముందుకు వెళుతుండడంతో అవినీతి తిమింగలాలు విలవిలలాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే హెచ్ఎండీఏలో పరాకాష్టకు చేరిన అవినీతి బాగోతం బయటకు లాగారు ఏసీబీ అధికారులు. ఆ శాఖలో అవినీతితో వేళ్లూనుకున్న హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు అప్పట్లో పెను ప్రకంపనలు సృష్టించింది.. వందల కోట్ల అవినీతి సొమ్మును వెలికి తీయడంతోపాటు వరుస అరెస్టులు ఈ కేసులో జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా గిరిజన సంక్షేమశాఖ ఇంచార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ (ఎస్ఈ) జగజ్యోతిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సదరు అధికారి ఇంట్లో సోదాల్లో రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైంది. మార్చిలో జరిపిన ఏసీబీ సోదాల్లో మహబూబాబాద్ సబ్ రిజి్రస్టార్ తస్లీమా రూ.19 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నట్టు విశ్వసనీయ సమాచారంతో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు ఇల్లు, బంధువుల ఇళ్లలో చేసిన సోదాల్లో రూ.కోట్ల ఆస్తులతోపాటు, తనతోపాటు అవినీతి భాగస్వాములుగా ఉన్న మరికొందరి పోలీస్ అధికారుల ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించడం సంచలనంగా మారింది.ప్రజలకు మరింత చేరువయ్యేలా ఏసీబీగతంలో ఏసీబీ అధికారులను సంప్రదించేందుకు కేవ లం 1064 టోల్‌ఫ్రీ నంబర్ మాత్రమే అందు బాటులో ఉండేది. ఇటీవల కాలంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా ఏసీబీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. 94404 46106 వాట్సప్ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా"www. acb.telangana.gov.in ’వెబ్సైట్లో, ఫేస్బుక్"http//www.facebook.com/ ACBtelangana లో, "https://x.com/ Telangana ACB'sìæÓrt-ÆŠ‡ÌZ, "dg&acb@telangana.gov.in' ఈ–మెయిల్‌లోనూ ఏసీబీ అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. -
వందల కోట్ల గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో రూ.వందల కోట్లు గోల్మాల్ అయినట్టు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఓవైపు కీలక ఆధారాలు సేకరిస్తూ.. మరోవైపు వరుస అరెస్టులతో ఏసీబీ అధికారులు ఈ కేసులో వేగం పెంచారు. తాజాగా శుక్రవారం ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌ను అరెస్టు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కుంభకోణం వెనక కీలక సూత్రధారులుగా ఈ ఇద్దరు వ్యవహరించినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు గొర్రెల పంపిణీ పథకం అమలు వ్యవహారంలోకి తేవడంలో ఈ ఇద్దరు అధికారులది ముఖ్యపాత్ర అని నిర్ధారణ అయ్యింది. ఇంకా ఎన్ని రూ.కోట్లు మింగారో? తొలుత రూ.2.10 కోట్ల అవినీతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.. దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం రూ.700 కోట్లకుపైనే అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా ఎన్ని రూ.కోట్ల అవినీతి బయటికి వస్తుందోనన్న చర్చ జరుగుతోంది. శుక్రవారం అరెస్టయిన సబావత్ రాంచందర్, కల్యాణ్‌కుమార్‌ను జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. వీరిద్దరినీ తిరిగి పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.ఆ ఇద్దరి వెనుక ఎవరైనా ఉన్నారా?కల్యాణ్‌కుమార్, రాంచందర్లే ఈ కుంభకోణానికి పాల్పడ్డారా..? వారి వెనుక ఇంకెవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా..? అన్న కోణాల్లోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు అనుమతితో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే ఇంకేవైనా కొత్త పేర్లు తెరపైకి వస్తాయా..?అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. -
ఏసీబీ కస్టడీలో ఏసీపీ
-
రూ.3లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐ
కుషాయిగూడ: భూ వివాదంలో తలదూర్చి.. వక్రమార్గం పట్టిన కుషాయిగూడ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు ఏసీబీ అధికారులకు చిక్కారు. మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కుషాయిగూడ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జోన్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ, చక్రిపురంలోని స్థల సరిహద్దు వివాదంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాడంటూ కాప్రా డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి భరత్‌రెడ్డి అనే వ్యక్తిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై కోర్టు ఆదేశాలతో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే కుషాయిగూడకు చెందిన ఎల్.ఉపేందర్ అనే వ్యక్తి ఈ కేసులను కాంప్రమైజ్ చేసేందుకు పోలీసుల తరఫున మధ్యవర్తిత్వం వహించాడు. ఎస్ఐ షేక్ షఫీ ఆదేశాలతో సింగిరెడ్డి భరత్‌రెడ్డిని ఉపేందర్ ఆశ్రయించాడు. రూ.3 లక్షల ఇస్తే కేసులు లేకుండా చూస్తానంటూ భరత్‌రెడ్డికి ఆఫర్ ఇచ్చాడు. తనపై భరత్‌రెడ్డికి నమ్మకం కుదరకపోవడంతో ఉపేందర్ నేరుగా ఎస్ఐ షఫీతో మాట్లాడించాడు. మరి ఇన్స్పెక్టర్ విషయం ఏమిటంటూ భరత్‌రెడ్డి ఎస్ఐని ప్రశ్నించడంతో.. ఇన్స్పెక్టర్ వీరస్వామితోనూ కలిపించి రూ.3 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఒక్క కేసే క్లోజ్ చేస్తామని.. కానీ.. రెండు కేసులూ తప్పించడం సాధ్యం కాదని ఒక కేసు మాత్రమే క్లోజ్ చేస్తామని చెప్పారు. దీంతో సింగిరెడ్డి భరత్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రంగారెడ్డి జోన్ ఏసీబీ అధికారులు శుక్రవారం ఓ ప్రైవేటు కార్యాలయంలో మధ్యవర్తి ఉపేందర్‌కు ఫిర్యాదుదారు భరత్‌రెడ్డి రూ.3 లక్షల నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షేక్ షఫీలను కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. సుమారు 5 గంటల పాటుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగింది. అలాగే గుర్రంగూడలోని ఇన్స్పెక్టర్ వీరస్వామి, దమ్మాయిగూడలోని ఎస్ఐ షఫీ ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తమకు లభించిన పక్కా సాంకేతిక ఆధారాలతో ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఎల్.ఉపేందర్‌లపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
గొర్రెల స్కీం కుంభకోణంలో కీలక అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు కీలక నింది తులను అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్ కుమార్‌లను శుక్రవారం ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానంలో హాజరుపరిచారు. సబావత్ రాంచందర్‌ను ఏ–9గా, కల్యాణ్‌గా ఏ–10గా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. నిందితులను జ్యుడీ షియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఆదేశాలు నిందితులిద్దరూ నిబంధనలు తుంగలో తొక్కి, గొర్రెల సేకరణ ప్రక్రియ ప్రైవేటు వ్యక్తులు, బ్రోకర్లకు అప్పగిస్తూ అన్ని జిల్లాల పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గొర్రెల కొనుగోలు పేరిట ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు చేరేలా చేశారని ఏసీబీ అధి కారులు తమ దర్యాప్తులో గుర్తించారు. గొర్రెల కొనుగోలుకు సంబంధించి ఏపీ రైతులకు ఇవ్వాల్సిన మొత్తం రూ.2.10 కోట్ల మేర నిధులు కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి దారి మళ్లించినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు.ఈ కుంభకోణంతో సంబంధమున్నట్టు లభించిన ఆధారాల మేరకు ఏసీబీ అధికారులు ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్‌వాటర్ ఆఫీసర్ పసుల రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజనవిద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్‌లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మార్చి లో పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ పి కృష్ణయ్యలను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు గా ఉన్న కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ పరారీలో ఉన్నారు. గొర్రెల కుంభకోణం అసలు కథ ఇదీబీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం పెద్ద ఎత్తున చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో నిధులు దారి మళ్లించడంపై అందిన ఫిర్యాదులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపింది. వాస్తవానికి ఏపీ రైతులు ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డిజిల్లా మంచాల ప్రాంత లబ్ధిదారు లకు గొర్రెలు పంపిణీ చేసేందుకు ఏపీలోని పల్నాడు జిల్లా అంగలూరుకు చెందిన 18 మంది గొర్రెల సరఫరాదారులను సంప్రదించారు. ఆ తర్వాత పశువైద్యశాఖ అధి కారులు రవి, ఆదిత్యకేశవసాయితోపాటు కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఇక్రమ్ కలిసి 133 మంది లబ్ధిదారులను తీసుకెళ్లి 133 యూనిట్లను ఒక్కో యూనిట్ రూ.1.58 లక్షల చొప్పున కొనుగోలు చేశారు.అయితే ఇందుకు సంబంధించిన డబ్బులు గొర్రెలు విక్రయించిన రైతులకు ఇవ్వకుండా ఇక్కడే అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై కుంభకోణానికి తెరలే పారు. మొత్తం రూ. 2.10 కోట్లను గొర్రెల సరఫరా రైతుల పేరిట కాకుండా బినామీల పేరిట చెక్కులు మంజూరు చేశారు. అనంతరం ఆ సొమ్మును కొట్టేశారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో కోడ్ కారణంగానే తమకు డబ్బులు రావడం లేదని ఏపీ గొర్రెల సరఫరా రైతులు అనుకున్నారు. కోడ్ ముగిసిన తర్వాత కూడా డబ్బులు రాక పోవడంతో మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ ఆఫీసులో ఆరా తీశారు.తమకు రావా ల్సిన రూ.2.10 కోట్లు ఏపీలోని వివిధ జిల్లా ల్లోని ఇతర అకౌంట్స్‌లో డిపాజిట్ అయినట్టు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై డిసెంబర్లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసును ఏసీబీకి బదిలీ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆధారాలు సేకరిస్తూ, వరుస అరెస్టులు చేస్తూ వస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. -
గొర్రెల స్కాం.. పశుసంవర్ధక శాఖ సీఈవో రాంచందర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గొర్రెల స్కాములో విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా పలు కీలక అరెస్ట్‌లు చేపట్టింది. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న సీఈవో రాంచందర్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అలాగే ఎస్ఓడీ కల్యాణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ.2.10 కోట్ల స్కామ్‌లో రామ్‌చందర్, కళ్యాణ్‌కుమార్ నిందితులుగా ఉన్నారు. వీరిద్దరిని రేపు కోర్టులో హాజరుపర్చారు.స్కీంను.. స్కాంగా మార్చిన వైనంపై ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది. వెటర్నరీ శాఖలో ఉన్నతాధికారులను విచారిస్తున్నారు. స్కిం కాస్ట్ పెంచడం, దళారుల పాత్రపై కీలక సమాచారం రాబట్టారు అధికారు. ఎవరు అధికారిగా ఉన్నప్పుడు స్కిం కాస్ట్ పెంచారో అనే విషయంపై ఆరా తీస్తున్నారు. త్వరలో మరికొన్ని కీలక అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది. . -
కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పై ఏసీబీ అధికారుల దాడి
-
తెలంగాణ ఇరిగేషన్‌శాఖ ఈఈ బన్సీలాల్ అరెస్ట్
-
నేడు ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వర రావు
-
తెలంగాణలో ఏసీబీ మెరుపు దాడులు..
-
ఆర్టిఏపై ఏసీబీ కొరడా
సాక్షి, సిటీబ్యూరో/మణికొండ/చాంద్రాయణగుట్ట/మలక్‌పేట: ఆర్టిఏలో దళారుల దందాపై ఏసీబీ దండెత్తింది. మంగళవారం నగరంలోని వివిధ చోట్ల ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఏసీబీ సోదాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఏసీబీ దాడుల భయంతో పలు చోట్ల పౌరసేవలను సైతం నిలిపివేశారు. చాలాకాలం పాటు ఎలాంటి తనిఖీలు, సోదాలు లేకుండా నిరాటంకంగా సాగుతున్న దళారుల కార్యకలాపాలకు మంగళవారం నాటి దాడులతో ఒక్కసారిగా బ్రేక్ పడింది. దళారులదే రాజ్యం.. రవాణాశాఖ అందజేసే డ్రైవింగ్ లైసెన్సులు, లెరి్నంగ్ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్లు, బదిలీలు తదితర సుమారు 50కి పైగా పౌరసేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చినప్పటికీ పలుచోట్ల దళారులే రాజ్యమేలుతున్నారు. మరోవైపు దళా రుల ద్వారా వస్తే తప్ప ప్రజలకు పౌరసేవలు లభించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నగరంలోని డ్రైవింగ్ స్కూళ్లు, ఏజెంట్లు, దళారులు ప్రతి పౌరసేవకు ఒక ధర చొప్పున నిర్ణయించి వాహనదారుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ ద్వారా పౌరసేవలను అందజేయడం ప్రహసనంలా మారింది. ఏకకాలంలో దాడులు.. మంగళవారం మణికొండలోని రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయంతో పాటు బండ్లగూడలోని దక్షిణ మండలం, మలక్‌పేట్‌లోని తూర్పు మండలం కార్యాలయాల్లో, టోలిచౌకి కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఐదుగురు ఇన్స్పెక్టర్ల బృందం బండ్లగూడలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో దాడులు నిర్వహించింది. ఏజెంట్లతో పాటు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి కొన్ని డాక్యుమెంట్లను, నగదును అధికారులు స్వా«దీనం చేసుకున్నారు.తాళాలు వేసుకుని పరార్.. ఏసీబీ అధికారుల తనిఖీలతో మలక్‌పేట ఆర్టీఓ కార్యాలయ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఆఫీసు చుట్టూ ఉన్న ఏజెంట్లు దుకాణాలకు తాళాలు వేసుకున్నారు. పౌరసేవల కోసం వచి్చన వాహనదారులను పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మణికొండలోని డీటీసీ కార్యాలయంలో నిర్వహించిన తనిఖీల్లోనూ పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని డాక్యుమెంట్లను స్వా«దీనం చేసుకున్నారు. మణికొండలో రూ.23,710, టోలిచౌకిలో రూ.43,360, బండ్లగూడలో రూ.48,370 నగదును అనధికార వ్యక్తుల నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఏజెంట్ల ఫోన్లలో అధికారుల నంబర్లు.. ఏజెంట్ల మొబైల్ ఫోన్లలో కొందరు అధికారుల ఫోన్ నంబర్లు ఉండడంపై పూర్తి స్థాయిలో విచారించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో పౌరసేవలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మూసారంబాగ్‌లోని మలక్‌పేట ఈస్ట్‌జోన్ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ సిటీ రేంజ్–1, డీఎస్పీ కె.శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన దాడుల్లో 15 మంది బయటి వ్యక్తులను గుర్తించారు. బయటి వ్యక్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి పంపించారు. పలువురు దళారులను పట్టుకున్నారు. కార్యాలయంలో సజ్జమీద పడేసి ఉన్న పర్సులో రూ. 22 వేలు లభించినట్లు అధికారులు తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్ల పాత్రపై, అవకతవకలపై సమగ్ర నివేదికను తయారు చేసి ఏసీబీ ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.ఇదిగో ఏసీబీ.. అదిగో ఏజెంట్... మరోవైపు ఏసీబీ దాడుల నేపథ్యంలో గ్రేటర్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలు హడలెత్తాయి. అధికారులు, ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చనే సమాచారంతో పలు చోట్ల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సిబ్బందిని అన్ని విధాలుగా అప్రమత్తం చేశారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయాలకు ఏజెంట్లను రాకుండా అడ్డుకున్నారు. డ్రైవింగ్ లైసెన్సులు, లెరి్నంగ్ లైసెన్సులు తదితర పౌరసేవల కోసం ఏజెంట్ల ద్వారా వెళ్లిన వాహనదారులు తమ స్లాట్లను రద్దు చేసుకున్నారు. ఏజెంట్లకు రూ.వేలల్లో చెల్లించి నష్టపోయామని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కార్యాలయాలు, చెక్పోస్టులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. మంగళవారం ఏకకాలంలో 15 ఏసీబీ బృందాలు.. మొత్తం 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. దాదాపు అన్ని కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తులు ఇతరులకు చెందిన ధ్రువపత్రాలతో ఉన్నట్టు గుర్తించారు. పలు కార్యాలయాల్లో సిబ్బంది యూనిఫాం లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నట్టు గమనించారు. ఏసీబీ అధికారులను చూసిన ఏజెంట్లు పరారయ్యారు. కార్యాలయాల సమీపంలోని తమ దుకాణాలను మూసివేశారు. కాగా దాడులు, తనిఖీల సందర్భంగా లెక్కల్లో చూపని రూ.2,70,720 నగదు స్వా«దీనం చేసుకున్నట్టు ఏసీబీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాంతాల వారీగా వివరాలు వెల్లడించింది. బండ్లగూడలో రూ.48,370ను స్వాధీనం హైదరాబాద్ బండ్లగూడ కార్యాలయంలో జరిపిన సోదాల్లో రూ.48,370 స్వా«దీనం చేసుకున్నారు. మలక్‌పేట కార్యాలయంలో రూ.22 వేలు, టోలిచౌకి కార్యాలయంలో రూ.43,360, మణికొండలోని రంగారెడ్డి డీటీసీ కార్యాలయం రూ.23,710 స్వా«దీనం చేసుకున్నారు. ఇక నల్లగొండ కార్యాలయంలో రూ.12,200, నిజామాబాద్‌లోని సాలూర్ చెక్‌పోస్టులో రూ.13,500, ఆదిలాబాద్‌లోని భోర్జా చెక్‌పోస్టులో రూ.11,630, మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో రూ.61,900, ఖమ్మంలోని అశ్వరావుపేట చెక్‌పోస్టులో రూ.34,050 స్వాదీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్, సిద్దిపేట, కరీంనగర్ కార్యాలయాల్లో సోదాల సందర్భంగా నగదు పట్టుబడనప్పటికీ పలువురు అనధికారిక వ్యక్తులు ఇతరులకు సంబంధించిన ధ్రువపత్రాలతో ఉన్నట్టు గుర్తించారు. కొన్నిచోట్ల కొందరు ఉద్యోగులు యూనిఫాం లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నట్టు గుర్తించారు. మహబూబ్‌నగర్‌లో డ్రైవింగ్ టెస్టు ట్రాక్ దగ్గర ఒక ప్రైవేట్ కారు ఏర్పాటు చేసి ఒక్కొక్కరి దగ్గర రూ.200 వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ధ్రువపత్రాలపై ప్రత్యేక కోడ్ సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంలో పలువురు ప్రైవేటు వ్యక్తులు ప్రత్యేక కోడ్ నంబర్లు వేసి ఉన్న కొన్ని ధ్రువపత్రాలతో ఉన్నట్టు గుర్తించారు. నిజామాబాద్‌లోని సాలూరు చెక్‌పోస్టులో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ విధులకు హాజరుకాలేదని గుర్తించారు. అశ్వారావుపేట చెక్‌పోస్టులో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ మఫ్టీలో ఉండగా, ఏడుగురు ప్రైవేటు వ్యక్తులు వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ఆదిలాబాద్‌లోని భోర్జా చెక్‌పోస్టులో ప్రైవేటు వ్యక్తులకు నెలకు రూ.8 వేల చొప్పున జీతం చెల్లిస్తూ వారితో లారీడ్రైవర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయిస్తున్నట్టు తనిఖీల్లో భాగంగా గుర్తించారు. మంగళవారం నాటి దాడుల సందర్భంగా వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో గుర్తించిన అక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064లో ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లారీ డ్రైవర్ల వేషధారణలో.. – అశ్వారావుపేట చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు – అదుపులో ఎంవీఐ, ప్రైవేటు సిబ్బంది అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట శివారులో ఉన్న రవాణా శాఖ చెక్‌పోస్టు వద్ద తనిఖీలకు ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల వేషధారణలో వెళ్లారు. ఏపీకి సరిహద్దునే ఉన్న ఈ చెక్‌పోస్టు వద్ద సిబ్బంది లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తులను నియమించి.. లారీ సామర్ధ్యాన్ని బట్టి పాసింగ్ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. 10 టైర్ల లారీకి ఒక రేటు, 12 టైర్ల లారీకి మరో ధర ఉంది. ఇందుకోసం చెక్‌పోస్టులో ఒక ట్రే పెట్టారు. లారీ డ్రైవర్లు తాము చెల్లించాల్సిన మొత్తాన్ని ఆ ట్రేలో వేసి వెళ్లాలి. లారీకి సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా సరే మామూళ్లు సమర్పించాల్సిందేనని తెలిసింది. ఏసీబీ అధికారులు ఉన్న సమయంలో కూడా కొందరు లారీ డ్రైవర్లు ఇలా డబ్బు ఇచ్చి వెళ్లారు. ఇక్కడ ప్రైవేట్ సిబ్బంది నుంచి రూ.28 వేలు, ట్రే లోని రూ.7 వేలు స్వా«దీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న ఎంవీఐ యూనిఫాం కూడా వేసుకోలేదని తెలిపారు. ఎంవీఐతో పాటు ప్రైవేట్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. -
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఖైరతాబాద్, మలక్‌పేట్, నాగోల్, అత్తాపూర్,మహబూబ్‌నగర్, సిద్ధిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఆర్డీఏ కార్యాలయాల్లో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.ఆర్డీఏ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. చెక్‌పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు,లావాదేవీలపై ఏసీబీ విచారిస్తోంది. నకిలీ ఇన్స్యూరెన్సులు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.మహబూబాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ఆరుగురు ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏజెంట్ల వద్ద 45,100 నగదు, డ్రైవర్ వద్ద 16,500 నగదు, నూతన లైసెన్స్‌లు, రెనివల్స్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యమైంది. -
అవినీతి అందిపుచ్చుకుంటూ..
రావులపాలెం: కుర్చీ మహిమో.. చేతినిండా సంపాదించాలనే తాపత్రయమో.. అవినీతి మరకను ఒకరి తర్వాత ఒకరు పుచ్చుకుంటూ తలవంపులు తెస్తున్నారు. ప్రతి పనికీ చేయిచాపి, చివరికి ఏసీబీ వలకు చిక్కుతూ ఉన్న పరువును రచ్చకెక్కిస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలోని రావులపాలెం పోలీస్ స్టేషన్ అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. ఐదు నెలల వ్యవధిలోనే ఇక్కడ పనిచేసిన అధికారులు ఇద్దరు లంచం తీసుకుంటూ దొరికిపోవడం చర్చనీయాంశం అయ్యింది. నాడు ఎస్సై అవినీతికి పాల్పడుతూ వలలో చిక్కుకోగా, నేడు అదే స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐ ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళ్తే.. గతంలో రావులపాలెం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకి ఎస్సై ర్యాంకు అధికారి ఉండేవారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఈ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసి ఎస్సై స్థానంలో సీఐ స్థాయి అధికారిని నియమించారు. గత జనవరిలో ఇదే స్థానంలో ఎస్సై హోదాలో ఉన్న అప్పటి ఎస్సై ఎం.వెంకటరమణ ఒక కేసులో 41 నోటీస్ జారీ చేసే విషయంలో ముద్దాయిని స్టేషన్‌కు పిలిచి చార్జిïÙట్లో తక్కువ శిక్షపడేలా సెక్షన్లు మార్చి సహాయ పడతానంటూ, ఆ కేసులో అనపర్తి మండలం పొలమూరుకు చెందిన సత్తి విజయరామకృష్ణారెడ్డి నుంచి రూ. లక్ష డిమాండ్ చేశారు. దానికి బాధితుడు అంగీకరించకపోవడంతో రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఆ సొమ్ము తీసుకుంటూ అప్పటి ఎస్సై వెంకటరమణ, కంప్యూటర్ ఆపరేటర్ సత్యప్రసాద్‌లు ఏసీబీకి చిక్కారు. జనవరి 9న ఈ ఘటన జరగ్గా, అదే నెలలో 13న అప్‌గ్రేడ్ స్టేషన్‌గా మారిన రావులపాలెం పోలీస్ స్టేషన్‌కు సీఐగా తణుకు రూరల్ నుంచి బదిలీపై వచ్చిన సీహెచ్ ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. మొదటి నుంచీ సీఐపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్నికల అనంతరం తిరిగి పశి్చమ గోదావరి జిల్లా వెళ్లేందుకు ఇప్పటికే సీఐ సన్నాహాలు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాత కేసుల్లో నిందితుల నుంచి సొమ్ము దండుకోవాలనే లక్ష్యంతో వారం రోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసం కిందిస్థాయి సిబ్బందితో వివిధ కేసుల్లో బాధితులకు ఫోన్లు చేయించి స్టేషన్‌కు రావాలని పిలుపిస్తున్నారు. గతనెల 16న రావులపాలెం మండలం పొడగట్లపల్లి వద్ద కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేసి, పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు, వాహనాలు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లక్ష్మణరాజును రూ.50 వేలు ఇవ్వాలని పలుమార్లు బాధించడంతో, అతను విసిగిపోయి రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో అతని నుంచి రూ.50 వేల లంచాన్ని తీసుకుంటూ సీఐ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వెసులుబాటును అస్త్రంగా మలచుకుని.. నాడు ఎస్సై రూ.25 వేలు, నేడు సీఐ రూ. 50 వేలు తీసుకుంటూ పట్టుబడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక్కడకు ఏ అధికారి వచ్చినా అవినీతి మాత్రం తగ్గడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులను కోర్టుకు తీసుకు వెళ్లకుండా 41 నోటీస్ జారీచేసి పంపించే విధంగా చట్టంలో ఉన్న వెసులుబాటును అస్త్రంగా మలచుకుని రూ. వేలల్లో డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలులు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏసీబీ వలలో రావులపాలెం సీఐ
రావులపాలెం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టౌన్ సీఐ సీహెచ్ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ డి.శ్రీహరిరాజు కథనం ప్రకారం.. గత నెల 16న రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కోడిపందాల కేసు నమోదు చేశారు. మండలంలోని పొడగట్లపల్లిలో నిర్వహించిన కోడిపందాలపై పోలీసులు దాడి చేసి, అప్పట్లో పలువురిని అరెస్టు చేశారు. కొన్ని వాహనాలను, కోళ్లను స్వా«దీనం చేసుకున్నారు.ఈ కేసులో కోడిపందాలు నిర్వహించిన స్థల యజమాని కుంచెర్లపాటి లక్ష్మణరాజు నుంచి సీఐ ఆంజనేయులు అప్పట్లో కొంత మొత్తం లంచంగా తీసుకున్నాడు. అనంతరం చార్జిషీటులో తక్కువ సెక్షన్లు నమోదు చేసేందుకు, లక్ష్మణరాజుపై రౌడీ షీట్ తెరవకుండా ఉండేందుకు మరో రూ.50 వేలు లంచం ఇవ్వాలని పలుమార్లు డిమాండ్ చేశాడు.దీంతో విసిగిపోయిన లక్ష్మణరాజు రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం సీఐ ఆంజనేయులుకు లక్ష్మణరాజు స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం రూ.50 వేలు లంచం ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తీసుకుంటున్న సీఐ ఆంజనేయులును అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. -
ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చాల్సి ఉంది!
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ వేసింది. 8 రోజులు కస్టడీ కి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.నేడు(శుక్రవారం) కస్టడీ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేయనుంది. ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బినామీ ఆస్తులు, యాపారవేత్తలతో కలిసి పెట్టుబడులపై ఏసీబీ విచారణ చేయనుంది. ఉమామహేశ్వరరావు ల్యాప్‌టాప్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. దీంతో ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చే పనిలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.ట్యాబ్‌లో ఉన్న ఆస్తి వివరాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. బీనామీ ఆస్తులపై కూపీలాగుతున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు డాక్యుమెంట్స్ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.ఆస్తి విలువ అనధికారికంగా బహిరంగ మార్కెట్లో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పలుమార్లు సస్పెండయినా కానీ కీలక పోస్టింగ్‌లు దక్కించుకోవటంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఉమామహేశ్వరరావు వెనక ఉన్న అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ చేస్తోంది.ఉమామహేశ్వరరావు ఫిర్యాదుదారులనే బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టింది. కొందరు పోలీస్ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది. -
రిమాండ్ రిపోర్టులోవిస్తుపోయే నిజాలు
-
హైదరాబాద్‌లో దాడుల కలకలం.. ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అశోక్‌నగర్‌లో ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటితో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై ఏసీబీ అధికారులు దాడులు జరుపుతున్నారు. సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు.ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమా మహేశ్వరరావు సస్పెండయిన సంగతి తెలిసిందే. డబుల్ మార్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి. -
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్..
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి అడ్డంగా పట్టుబడ్డారు. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ 30,000 డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. నేడు రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమలాపూర్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి.అయితే సదరు అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ చేపడితే అనేక అంశాలు బయట పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. తహసిల్దా్ర్‌ను ఏసీపీ పట్టుకోవడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న పనికి తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పైసలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ. 7 వేలు లంచం తీసుకుంటూ చాయితీరాజ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇదిలా ఉండగా ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్‌ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
ఏసీబీ వలలో డ్రగ్ ఇన్స్పెక్టర్
నల్లగొండ టౌన్: నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఊరెల్లి సోమేశ్వర్ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. ఏసీబీ డీఎస్పీ జగదీష్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలోని నూకల వెంకట్‌రెడ్డి చారిటబుల్ ఆస్పత్రిలో ఫార్మసీ ఏర్పాటు లైసెన్స్ కోసం చిట్టెపు సైదిరెడ్డి అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. లైసెన్స్ ఇవ్వడానికి డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర్ రూ.20వేలు లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సోమవారం నల్లగొండలోని డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రూ.18వేలు డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఇవ్వడానికి సైదిరెడ్డి వెళ్లాడు. డబ్బులను తన బ్యాగులో పెట్టాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ సూచించడంతో రూ.18 వేలను బ్యాగులో పెట్టగానే అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు సోమేశ్వర్‌ను పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని సోమేశ్వర్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్లారు. సీఐలు వెంకట్రావు, రామారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
Telangana: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పలువురు అధికారులు
సాక్షి, హన్మకొండ/నల్లగొండ జిల్లా: లంచం తీసుకొని అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుతున్నారు. తాజాగా పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు అడ్డంగా దొరికిపోయారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఏసీబీకి చిక్కారు. హుజురాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చార్జిమెమో అందించారు. అయితే శాఖా పరమైన కేసు కొట్టివేయడం కోసం డిపో మేనేజర్ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలోనే రూ. 10,000 అందించగ.. మంగళవారం మరో రూ. 20000 రూపాయలు లంచం ఇస్తున్న క్రమంలో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అదే విధంగా.. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు సోమశేఖర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆధ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్‌లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం -
మాదాపూర్ పీఎస్‌పై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై
సాక్షి,హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం(ఏప్రిల్ 6) ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్, రైటర్ విక్రమ్ ఏసీబీ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఎస్సై, రైటర్ అవినీతి వ్యవహారం బయటపడింది. ఇదీ చదవండి.. కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్ -
చంద్రబాబే ప్రధాన నిందితుడు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా పన్నాగంతోనే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ నిగ్గు తేల్చింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజులు ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సమగ్ర వివరాలతో సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన నిందితుడు (ఏ1)గా, రెండో నిందితుడి (ఏ2)గా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477 (ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఈ చార్జిషీట్లో పేర్కొంది. రూ.330 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌గా కనికట్టు చేశారని వివరించింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్ కంపెనీ వాటా 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోయినా, ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను జీఎస్టీతోసహా రూ.371 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని తెలిపింది. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు కొల్లగొట్టారని వివరించింది. సీఐడీ చార్్జషీట్లోని ప్రధాన అంశాలు ఇవీ... 2017లోనే బయటపడినా.. 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో జరిపిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి, ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్టు ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం మొత్తం బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్‌టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో పక్కా పథకం ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం చంద్రబాబు తన బినామీ సంస్థ డిజైన్‌టెక్‌ను రంగంలోకి దింపారు. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు బినావీులు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్– డిజైన్‌టెక్ కంపెనీలు వాటి వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద డిజైన్‌టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్టు నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. డిజైన్‌టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లతో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోను చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర షెల్ కంపెనీల ద్వారా నిధులను హవాలా మార్గంలో మళ్లించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్ రద్దు పిటిషన్‌పై కొనసాగుతున్న విచారణస్కిల్ స్కామ్‌లో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న చంద్రబాబు వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు రెడ్‌బుక్ పేరుతో ఈ కేసులో కీలక సాక్షులు, అధికారులను బెదిరింపులకు గురిచేసి దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని కూడా సీఐడీ ఆ పిటిషన్లో పూర్తి ఆధారాలతో పేర్కొంది. దర్యాప్తు చేస్తున్న ఈడీ మనీ లాండరింగ్ ద్వారా నిధులు మళ్లించిన స్కిల్ స్కామ్ గురించి సీఐడీ అధికారులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నివేదించారు. దాంతో రంగంలోకి దిగిన ఈడీ ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, చార్టెడ్ అకౌంటెంట్ ముకుల్ చంద్ర అగర్వాల్, షెల్ కంపెనీల సృష్టికర్త సురేశ్ గోయల్‌ను అరెస్ట్ చేసింది. డిజైన్‌టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్ల ఆస్తులను జప్తు చేసింది కూడా. సీఐడీ చార్్జషీట్లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ – సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్‌టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర కంపెనీల అధికారులు