AP: 24న దసరా సెలవు.. ఉత్తర్వులు జారీ | Andhra Pradesh Dussehra Holidays Starting From 14th October 2023 To 24th October 2023 - Sakshi
Sakshi News home page

AP: 24న దసరా సెలవు.. ఉత్తర్వులు జారీ

Published Wed, Oct 18 2023 12:29 PM | Last Updated on Wed, Oct 18 2023 1:30 PM

Ap Govt Declared Dussehra Holiday On October 24th - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 24న దసరా సెలవు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఏపీలోని పాఠశాలలకు అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 11 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను  ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ నడుపుతోంది. అక్టోబర్‌ 13వ తేదీ నుంచి 26వ దాకా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. సాధారణ ఛార్జీలతోనే ఈ సర్వీసులను ఏపీఎస్‌ఆర్టీసీ నడిపిస్తోంది.

ఎప్పుడు.. ఎక్కడి నుంచంటే..
13 నుంచి 22 దాకా.. దసరా ముందు రోజులలో 2,700 బస్సుల్ని, అలాగే.. పండుగ దినాలైన 23వ తేదీ నుంచి 26 దాకా(పండుగ ముగిశాక కూడా)  2,800 బస్సుల్ని నడిపించనుంది. హైదరాబాద్ నుండి 2,050 బస్సులు, బెంగుళూరు నుండి 440 బస్సులు,చెన్నై నుండి 153 బస్సులువివిధపట్టణాలకు నడపబడతాయి. విశాఖపట్నం నుండి 480 బస్సులు, రాజమండ్రి నుంచి 355 బస్సులు, విజయవాడ నుండి 885 బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసింది.
చదవండి: చంద్రబాబు ప్లాన్‌ రివర్స్‌.. టీడీపీ క్యాడర్‌కు కొత్త టెన్షన్‌! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement