-
బంగారం కొనుగోలుదారులకు ఊరట
దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 25) కాస్త తగ్గాయి. నిన్నటి రోజున భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు దిగొచ్చాయి.హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ. 72,270 లకు తగ్గింది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.66,400 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 తగ్గి రూ.72,420 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.350 క్షీణించి రూ.66,250 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.72,270 వద్దకు దిగొచ్చింది.అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గి రూ.67,100 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.220 తగ్గి రూ.73,200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 క్షీణించి రూ.66,250 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.72,270 లకు తగ్గింది.ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.400 తగ్గింది. ఇక్కడ ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.86,000గా ఉంది. -
పసిడి ప్రియులకు శుభవార్త.. ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 23) తులం పసిడి ధర గరిష్టంగా రూ. 1530 తగ్గింది. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66150 (22 క్యారెట్స్), రూ.72160 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 500 నుంచి రూ. 550 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ ఏకంగా రూ. 1400 నుంచి రూ. 1500 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66300 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72310 రూపాయలకు చేరింది. నిన్న రూ.510, రూ.550 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 1400 నుంచి రూ.1530 వరకు తగ్గింది.దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. చెన్నైలో పసిడి ధరలు మరింత తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 1450 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1570 రూపాయలు తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ. 67000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 73100 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఈ రోజు (ఏప్రిల్ 23) వెండి ధర రూ. 2500 తగ్గి రూ. 83000 (కేజీ) వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా గరిష్ట స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. -
పసిడి ప్రియులకు షాక్!.. తారాస్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు
దేశంలో రోజురోజుకి బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అస్సలు తగ్గేదేలే అనే రీతిగా ప్రతిరోజూ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ రోజు ఒక తులం గోల్డ్ రేటు రూ. 900 నుంచి రూ. 980 వరకు పెరిగింది. ధరల పెరుగుదల తరువాత నేటి (ఏప్రిల్ 16) ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.67950 (22 క్యారెట్స్), రూ.74130 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 550 నుంచి రూ. 600 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ. 900, రూ. 980 పెరిగింద ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 68100 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 74280 రూపాయలకు చేరింది. నిన్న రూ.550, రూ.600 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ.900 నుంచి రూ.980 వరకు పెరిగింది. ఇదీ చదవండి: బంగారం ధరలు పెరుగుదలకు కారణాలివే.. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. చెన్నైలో పసిడి ధరలు కొంత తక్కువగానే ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 800 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 880 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 68700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 74950 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 16) వెండి ధర రూ. 1000 పెరిగి రూ. 87000 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
పసిడి.. వెండి పోటాపోటీ
న్యూఢిల్లీ: పసిడి పరుగు వరుసగా రెండవ రోజూ కొనసాగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం రూ.350 పెరిగి, రూ.71,700కు చేరిన 10 గ్రాముల ధర, మంగళవారం మరో రూ.140 జతచేసుకుని రూ.71,840 రికార్డు హైకి చేరింది. ఇక వెండి ధర కూడా సరికొత్త రికార్డులు చూసింది. కేజీ ధర ఒకేరోజు రూ.500 పెరిగి రూ.84,500కు చేరింది. సోమవారం వెండి ధర మొదటిసారి రూ.84,000కు చేరిన సంగతి తెలిసిందే. కారణాలు ఇవీ.. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు, ఈజీ మనీ, ద్రవ్యోల్బణం భయాలు, సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు పసిడి, వెండి పరుగునకు కారణమవుతున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు ఈ మెటల్స్ సురక్షితమైనవిగా పరిగణిస్తున్నారు. దేశీయంగా రూపాయి బలహీన ధోరణి కూడా బులిష్ ధోరణికి దోహదపడుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్లో మెరుపులు... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర మంగళవారం జూన్ కాంట్రాక్ట్ సరికొత్త రికార్డు 2,384 డాలర్లకు ఎగసింది. ఈ వార్త రాసే రాత్రి 9 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలి్చతే 16 డాలర్ల పెరుగుదలతో 2,368 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎస్‌లో పసిడి జూన్ కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.523 పెరిగి రూ.71,435 రికార్డు స్థాయిల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.71,739ని సైతం తాకింది. వెండి విషయానికివ వస్తే, క్రియాశీలక మే కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోలి్చతే రూ.366 ఎగసి రూ. 82,241 సరికొత్త రికార్డుల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.83,000 దాటింది. -
ఉగాది వేళ బంగారం కొందామనుకుంటే.. ప్చ్!
Gold Rate today: ఉగాది వేళ బంగారం కొందామనుకున్న పసిడి ప్రియులకు బంగారం ధరలు నిరుత్సాహాన్ని కలిగించాయి. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 8) పెరిగాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న పసిడి ధరలు 10 గ్రాములకు ఈరోజు రూ.490 మేర పెరిగాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.65,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున పెరిగి రూ.71,620 వద్దకు ఎగిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యధికంగా రూ.450 పెరిగి రూ.66,600లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.490 చొప్పున పెరిగి రూ.72,650 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 ఎగిసి రూ.65,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 పెరిగి రూ.71,770 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. cost of silver today: ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా మళ్లీ పెరిగాయి. క్రితం రోజు స్థిరంగా ఉన్న రజతం ఈరోజు కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.88,000 ఉంది. ఇది క్రితం రోజున రూ. 87,000 లుగా ఉండేది. -
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులను భయపెట్టేస్తున్నాయి. గత వారం రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ తారాజువ్వలా పైకి లేశాయి. నేడు దేశంలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.65500 (22 క్యారెట్స్), రూ.71440 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు రూ. 1200, రూ. 1310 వరకు పెరిగింది. చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 1200 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1310 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 65500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 71440 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 65500 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 71440 రూపాయలకు చేరింది. నిన్న కొంత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 1200, రూ. 1310 పెరిగింది. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 6) వెండి ధర ఒక్కసారిగా రూ. 1800 పెరిగి రూ. 83500 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
బాబోయ్ బంగారం.. ఇలాగైతే గోల్డ్ కొనడం కష్టమే!
బంగారం ధరలు తారా జువ్వ లాగా పైపైకి చేరుతున్నాయి. 2024 ప్రారంభంలో కొంత తగ్గుముఖం పట్టిన బంగారం రేటు ఏప్రిల్ ప్రారంభంలో ఏకంగా రూ. 70వేలుకు చేరువయ్యింది. నేటి (ఏప్రిల్ 1) పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా నేడు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.63750 (22 క్యారెట్స్), రూ.69530 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ రూ. 850, రూ. 930 పెరిగింది.చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 850 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 930 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 63750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 69530 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 63750 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 69530 రూపాయలకు చేరింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు రూ. 850, రూ. 930 పెరిగింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 1) వెండి ధర రూ. 600 పెరిగి రూ. 78600 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఈ రోజు బంగారం ధరలు - ఇలా ఉన్నాయి
2024 ప్రారంభంలో వరుసగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ఫిబ్రవరి, మార్చిలో భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం గ్రామ్ బంగారం ధర రూ. 7000 దగ్గరకు చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఈ రోజు (మార్చి 28) దేశంలో బంగారం ధరలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.61850 (22 క్యారెట్స్), రూ.67460 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 350, రూ. 380 వరకు పెరిగింది. చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధరలు 350 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 380 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 61850 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 67460 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 61850 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 67460 రూపాయలకు చేరింది. నిన్న రూ. 200 నుంచి రూ. 220 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు రూ. 350, రూ. 380 వరకు పెరిగాయి. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు రోజులుగా తగ్గిన ధరలు ఈ రోజు మళ్ళీ పెరిగాయి. దీంతో వెండి ధర ఈ రోజు (మార్చి 28) రూ. 77500 (కేజీ) వద్ద ఉంది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిన 'బంగారం'.. ధర తెలిస్తే దడ పుడుతుంది!
గత కొన్ని రోజులుగా స్వల్ప పెరుగుదల నమోదు చేస్తున్న బంగారం ధరలు ఈ రోజు (గురువారం) తారా స్థాయికి చేరాయి. దీంతో బంగారం కొనాలనుకునే వారు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.61950 (22 క్యారెట్స్), రూ.67570 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 1000, రూ. 1090 వరకు పెరిగింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగా ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 61950 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 67570 రూపాయలకు చేరింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు రకంగా రూ. 1000 నుంచి రూ. 1090 వరకు పెరిగింది. చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధరలు 950 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1040 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 62350 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 68020 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా ఏకంగా రూ. 1500 పెరిగింది. దీంతో కేజీ వెండి ఈ రోజు (మార్చి 21) రూ. 78500లకు చేరింది. ఢిల్లీ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, విజయవాడలలో కూడా వెండి ధర రూ. 1500 పెరిగింది. -
‘బంగారం’ లాంటి వార్తే.. తెలిస్తే ఈరోజే కొనేస్తారు!
Gold Rate today : పసిడి ప్రియులకు ఇది నిజంగా బంగారం లాంటి వార్తే. వారం రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గిపోయాయి. నిన్నటి రోజున స్పల్పంగా తగ్గిన పసిడి ధరలు ఈరోజు భారీగా దిగొచ్చాయి. వారం రోజుల వ్యవధిలో బంగారం ధరలు రూ.1000 పైగా తగ్గాయి. హైదరాబాద్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (ఫిబ్రవరి 14) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 లకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. పవిత్రమైన మాఘమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గడంతో మహిళలు, పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం పసిడి కొనుగోలుచేసేవారికి భారీ ఊరట లభిస్తోంది. దేశంలోని ఇతర నగరాల్లో.. ➦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,150 వద్ద, 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.680 తగ్గి రూ.62,310 వద్ద కొనసాగుతోంది. ➦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.57,000 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.62,180 వద్ద ఉంది. ➦ చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 దిగొచ్చి రూ.57,500లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.650 క్షీణించి రూ.62,730 ఉంది. ➦ ముంబైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.600 తగ్గి రూ.57,000 లకు చేరింది. 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.660 చొప్పున తగ్గి రూ.62,180 వద్ద ఉంది. Silver Price : ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు (ఫిబ్రవరి 14) కేజీకి ఏకంగా రూ. 1500 తగ్గింది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 75,500లుగా ఉంది. -
మార్కెట్లో బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే?
ఫిబ్రవరి 10 నుంచి మాఘమాసం ప్రారంభమైంది. దీంతో బంగారం ధరలు స్థిరంగా లేదేంటే, తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి అంచనాలు నిజం చేస్తూ ఫిబ్రవరి 11న బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. స్థిరంగా ఉన్నాయి. ఇక దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. వైజాగ్ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. విజయవాడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. బెంగళూరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,300 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,600గా ఉంది ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా ఉంది. -
Gold Rate: ఈరోజు బంగారం కొనొచ్చా?
Gold Rate: బంగారం ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయి. నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధర ఈరోజు (ఫిబ్రవరి 7) ఎగిసింది. దీంతో ఈరోజు బంగారం కొనేవారికి ధరలు కాస్త భారంగా మారనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు (ఫిబ్రవరి 7) 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.250 చొప్పున పెరిగింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి రూ.230 చొప్పున ఎగిసింది. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి తులం ధర రూ.58,000లు ఉండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,230 వద్ద ఉంది. ఇతర నగరాల్లో.. ▶ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం రూ.230 ఎగిసింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,000, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,230 ఉంది. ▶ చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.58,500లు ఉండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,820 ఉంది. ▶ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 ఎగిసింది. 24 క్యారెట్ల బంగారం రూ.180 పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,330 వద్ద ఉంది. ▶ ముంబైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం రూ.230 ఎగిసింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,000, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,230 ఉంది. Silver Rate: దేశవ్యాప్తంగా వెండి ధరల తగ్గింపునకు బ్రేక్ పడింది. నాలుగు రోజులుగా తగ్గుతున్న వెండి ధరలు ఈరోజు (ఫిబ్రవరి 5) స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.76,000 వద్ద ఉంది. -
Gold Rate: బంగారం తగ్గుముఖం.. వెండి కూడా డౌన్!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మూడు రోజుల్లో రెండోసారి కాస్త దిగివచ్చాయి. రెండు రోజుల కిందట మోస్తరుగా తగ్గిన పసిడి ధర.. క్రితం రోజు స్థిరంగా కొనసాగింది. ఈరోజు (ఫిబ్రవరి 5) కొంచెం తగ్గింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు (ఫిబ్రవరి 5) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 చొప్పున తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.160 చొప్పున దిగొచ్చింది. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.57,950, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,380 ఉంది. ఇతర నగరాల్లో.. ▶ చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రూ.220 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.58,500, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,820 ఉంది. ▶ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 చొప్పున తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.160 చొప్పున దిగొచ్చింది. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.57,950, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,380 ఉంది. ▶ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 చొప్పున, 24 క్యారెట్ల బంగారం రూ.160 చొప్పున తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.58,100, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,370 ఉంది. ▶ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 చొప్పున తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.160 చొప్పున దిగొచ్చింది. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.57,950, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,380 ఉంది. వెండి ఇలా.. Silver Rate: దేశవ్యాప్తంగా వెండి కూడా మళ్లీ దిగొచ్చింది. రెండు రోజుల క్రితం కేజీకి రూ.1000 తగ్గిన వెండి.. నిన్నటి రోజున స్థిరంగా ఉండి ఈరోజు (ఫిబ్రవరి 5) రూ.300 మేర తగ్గింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.76,700లుగా ఉంది. -
దేశంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి
దేశంలో గత కొద్ది రోజులుగా బంగారం వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఫలితంగా వాటి ధరలు సైతం అమాంతంగా పెరిగిపోతున్నాయి. అయితే శనివారం ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. ఫిబ్రవరి 3న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.220 తగ్గాయి. ఈ సందర్భంగా దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి విజయవాడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 380గా ఉంది హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 380గా ఉంది వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 380గా ఉంది చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,700 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64, 040గా ఉంది బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380గా ఉంది -
పరుగులు పెడుతున్న పసిడి, పడిలేస్తున్న వెండి - నేటి ధరలు ఇవే..
కొన్ని రోజులు క్రితం వరుసగా తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. ఏడు రోజులుగా అస్సలు తగ్గని పసిడి ధరలు ఎనిమిదో రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు ఇక్కడ చూసేద్దాం.. హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 68300 (22 క్యారెట్స్), రూ.63600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 160 ఎక్కువ అని తెలుస్తోంది. చెన్నైలో నిన్న రూ.300 నుంచి రూ.330 పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కేవలం రూ.100 మాత్రమే పెరిగింది. దీంతో చెన్నైలో నేడు బంగారం ధరలు వరుసగా రూ. 58900 (22 క్యారెట్స్), రూ. 64250 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 150 పెరిగి 58450 రూపాయలకు.. 24 క్యారెట్ల ధర రూ. 160 పెరిగి 63750 రూపాయలకు చేరింది. వెండి ధరలు బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.. వెండి మాత్రమే పడి, లేస్తూ ఉంది. దీంతో నిన్న రూ. 200 తగ్గిన వెండి, ఈ రోజు రూ. 200 పెరిగింది. -
పెరిగిన బంగారం, వెండి - హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎనిమిది రోజుల తరువాత బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు తులం బంగారం ధరలు నిన్నటి కంటే రూ.100 ఎక్కువ. నేడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి, వెండి ధరల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్‌లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ.57800 (22 క్యారెట్స్), రూ.63050 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు తులం ధరలు రూ. 100 రూపాయలు ఎక్కువ. ఇదే ధరలు విజయవాడ,గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కొనసాగుతాయి. ఢిల్లీలో ఈ రోజు తులం బంగారం ధర రూ.100 పెరిగింది. కాబట్టి 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 57950 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.63200 గా ఉంది. చెన్నైలో మాత్రం గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తున్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ రూ.50 పెరిగింది. దీంతో ఈ రోజు చెన్నైలో పసిడి ధరలు వరుసగా రూ. 58450 (22 క్యారెట్స్), రూ. 63760 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు ఈ రోజు రూ. 200 వరకు పెరిగింది. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ఈ రోజు దేశం మొత్తం మీద స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. -
ఐదు రోజుల తరువాత పెరిగిన పసిడి - నేటి కొత్త ధరలు ఇలా..
ఐదు రోజుల నుంచి అస్సలు పెరగని పసిడి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ) ఈ రోజు తులం బంగారం ధరలు వరుసగా రూ. 57800 (22 క్యారెట్స్), రూ. 63050 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. నేటి ధరలు రూ.100 పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. చెన్నైలో కూడా ఈ రోజు తులం బంగారం ధరలు నిన్నటి కంటే రూ. 100 పెరిగింది. దీంతో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 58400 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 63710గా ఉంది. ఇదీ చదవండి: భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! ఢిల్లీలో కూడా ఈ రోజు పసిడి ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. నేడు తులం బంగారం ధరలు వరుసగా రూ. 57950 (22 క్యారెట్స్), రూ. 63200 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. ఈ రోజు వెండి ధరలు రూ. 500 పెరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ రోజు వెండి ధరలు నిన్నటి కంటే రూ. 500 ఎక్కువని స్పష్టమవుతోంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై ప్రాంతాల్లో కూడా ఈ రోజు వెండి ధరలు పెరిగాయి. -
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా..
వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీలలో కూడా పసిడి ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నైలలో ఈ రోజు తులం బంగారం ధర రూ.300 (22 క్యారెట్స్) నుంచి రూ.330 (24 క్యారెట్స్) వరకు పెరిగింది. నిన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57700 కాగా.. చెన్నై, ఢిల్లీలలో వరుసగా రూ. 58100, రూ. 57850గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధరలు వరుసగా రూ. 62950, రూ. 63380, రూ. 63100 వద్ద ఉన్నాయి. ఇదీ చదవండి: 3000 మంది ఉద్యోగులకు 'టాటా' బైబై..! బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా రూ. 200 పెరిగింది. మూడు రోజుల తరువాత వెండి ధరలు స్వల్పంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీలలో కూడా ఈ రోజు తులం మీద రూ.300 నుంచి రూ.330 వరకు తగ్గింది. నేడు పసిడి ధరలు ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజు హైదరాబాద్, విజయవాడలలో తులం బంగారం మీద రూ. 300 నుంచి రూ. 330 తగ్గింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 57400 (22 క్యారెట్స్), రూ. 62620 (24 క్యారెట్స్) వద్ద నిలిచింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరులలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22, 24 క్యారెట్స్ బంగారం ధరలు వరుసగా రూ. 57800, రూ. 63050గా ఉన్నాయి. నిన్నట్లి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఈ రోజు 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 57550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62770గా ఉంది. ఈ ధరలు నిన్నటి ధరల కంటే వరుసగా రూ.300, రూ.330 తగ్గింది. ఇదీ చదవండి: సమీపిస్తున్న గడువు.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఇలా అప్డేట్ చేసుకోండి వెండి ధరలు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా రూ. 400 తగ్గింది. కేవలం మూడు రోజుల్లో కేజీ వెండి మీద రూ. 1300 వరకు తగ్గింది. -
Gold Price Today: బంగారం, వెండి కొంటున్నారా.. నేటి ధరలు ఇవే..
Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (జనవరి 10) స్థిరంగా ఉన్నాయి. వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి. మరోవైపు నిన్నటి రోజున భారీగా పెరిగిన వెండి ధరలు ఈరోజు శాంతించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ. 57,700 ఉంది. ఇక 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.62,950లుగా ఉంది. క్లిక్ చేయండి: దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు Silver Price Today: దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో క్రితం రోజు కేజీకి ఏకంగా రూ.2000 పెరిగిన వెండి ధర ఈరోజు శాంతించింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 78,000 లుగా ఉంది. -
ఇంకా తగ్గిపోయిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
గత ఏడాది చివరలో భారీగా పెరిగి.. న్యూ ఇయర్ ప్రారంభంలో కూడా కొంత భయపెట్టిన బంగారం ధరలు.. ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. సంక్రాంతికి గోల్డ్ కొనాలనుకునే వారికి ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి. 2024 జనవరి 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు పసిడి ధరలు తులం మీద ఏకంగా రూ. 1000 కంటే ఎక్కువ తగ్గింది. ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఈ రోజు బంగారం ధరలు రూ.57,800 (10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్), రూ.63050 (10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్)గా ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ.200, రూ.220 తగ్గినట్లు తెలుస్తోంది. చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు 10 గ్రాముల మీద వరుసగా రూ. 200, రూ. 220 తగ్గింది. దీంతో నేటి గోల్డ్ ధరలు రూ. 58,300 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63,600 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉన్నాయి. ఢిల్లీలో నేడు బంగారం ధరలు గరిష్టంగా రూ. 220 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధరలు రూ. 57950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరలు రూ. 63200గా ఉంది. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోసం 30 సార్లు అప్లై.. ఎట్టకేలకు జాబ్ కొట్టేసింది, కానీ.. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా ఈ రోజు కేజీ మీద రూ. 200 తగ్గింది. దీంతో ఒక కేజీ గోల్డ్ రేటు రూ. 76400కి చేరింది. న్యూ ఇయర్ ప్రారంభమైనప్పటి నుంచి వెండి ధర ఇప్పటివరకు ఏకంగా రూ. 2500 తగ్గిందని తెలుస్తోంది. -
బంగారం, వెండి కొనటానికి కరెక్ట్ టైమ్ వచ్చింది! ఎందుకంటే?
గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ రోజు పసిడి ధరలు నిన్న మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఏలా ఉన్నాయి? చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు బంగారం ధరలు రూ.58,000 (10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్), రూ.63,270 (10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్)గా ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి. ఢిల్లీలో నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు తులం బంగారం ధర రూ. 58,150 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63,420 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉన్నాయి. నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు 22 క్యారెట్స్ తులం గోల్డ్ రేటు ఈ రోజు రూ. 58,500కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63,820కి చేరింది. ఇదీ చదవండి: భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా ఈ రోజు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు బెంగళూరు, చెన్నై, ఢిల్లీతో పాటు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు మొదలైన ప్రాంతాల్లో కూడా స్థిరంగా ఉన్నాయి. -
బంగారం, వెండి... మంచి తరుణము మించిన దొరకదు!
గత మూడు రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈ రోజు ఉలుకు పలుకు లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఏలా ఉన్నాయి? చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో నేడు తులం బంగారం ధర రూ. 58,150 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63,420 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉన్నాయి. 22 క్యారెట్స్ గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. 24 క్యారెట్ గోల్డ్ మాత్రం 10 గ్రాములపై రూ. 20 పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, విజయవాడలలో నేడు 10 గ్రాముల బంగారం ధరలు రూ. రూ.58000 (22 క్యారెట్స్ గోల్డ్), రూ.63270 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి. చెన్నైలో మాత్రం ఈ రోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 100 నుంచి రూ. 110 మాత్రమే తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో నిన్న రూ. 58600గా ఉన్న 22 క్యారెట్స్ తులం గోల్డ్ రేటు ఈ రోజు రూ. 58500కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63820కి చేరింది. ఇదీ చదవండి: అందుకే వారానికి 70 గంటల పని చేయమన్నా! - నారాయణ మూర్తి వెండి ధరలు బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా ఈ రోజు బెంగళూరు, చెన్నై, ఢిల్లీతో పాటు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు మొదలైన ప్రాంతాల్లో కూడా స్థిరంగా ఉన్నాయి. నిన్న కూడా వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. -
బంగారం కొనటానికి ఇది సరైన సమయం.. మళ్ళీ తగ్గిన ధరలు
2024 ప్రారంభంలోనే షాకిచ్చిన బంగారం ధరలు, గత మూడు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. సంక్రాంతి దగ్గరపడుతున్న సమయంలో తగ్గుతున్న పసిడి ధరలు కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించినట్లైంది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో పసిడి ధరలు ఈ రోజు రూ.58000 (22 క్యారెట్స్ గోల్డ్), రూ.63270 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 తగ్గినట్లు తెలుస్తోంది. చెన్నైలో నేడు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 100 నుంచి రూ. 110 మాత్రమే తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో నిన్న రూ. 58700గా ఉన్న 22 క్యారెట్స్ తులం గోల్డ్ రేటు ఈ రోజు రూ. 58600కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63930కి చేరింది. ఇదీ చదవండి: గిఫ్ట్స్ ఇవ్వడంలో ఎవరైనా వీరి తర్వాతే.. కోడలికి రూ.451 కోట్ల నెక్లెస్ ఢిల్లీలో ఈ రోజు బంగారం ధరలు రూ. 100 నుంచి రూ. 130 వరకు తగ్గి తులం ధరలు రూ. 58,150 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63400 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉన్నాయి. నిన్న వరుసగా రూ. 400, రూ. 440 తగ్గిన పసిడి ధరలు ఈ రోజు మళ్ళీ స్వల్ప తగ్గుదలను మాత్రమే నమోదు చేశాయి. వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ మొదలైన ప్రాంతాల్లో బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. నిన్న ఏకంగా రూ. 2000 తగ్గిన ధరలు ఈ రోజు మాత్రం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: బంగారం, వెండి ధరల తగ్గింపు కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ఇది. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి రోజున మోస్తరుగా తగ్గిన పసిడి, వెండి ధరలు ఈరోజు (జనవరి 4) భారీగానే దిగివచ్చాయి. హైదరాబాద్‌తోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 చొప్పున తగ్గి రూ. 58,100 లకు వచ్చింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 440 క్షీణించి రూ.63,380 లకు చేరింది. క్రితం రోజు 22, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 58,500, రూ. 63,820 చొప్పున ఉండేవి. క్లిక్ చేయండి: దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు Silver Price Today: దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి ఏకంగా రూ.2,000 తగ్గింది. నగరంలో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 78,000 ఉంది. ఇది నిన్నటి రోజున రూ.80,000 ఉండేది.