-
ఆస్కార్ అవార్డ్ చిత్రాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆతృతగా ఎదురుచూసిన ఆస్కార్ పండుగ కొన్ని గంటల క్రితమే ముగిసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో వైభవంగా జరిగింది. సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమాలు పోటీలో నిలిచాయి. అయితే అంతిమంగా ఒక్కరినే అవార్డ్ వరిస్తుంది. అలా ఈ ఏడాది జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పలు చిన్న సినిమాలు సైతం సత్తా చాటాయి. అయితే అవార్డ్ దక్కించుకున్న చిత్రాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఆ సినిమాల్లో ఎలాంటి సందేశం ఉందో తెలుసుకోవాలనుకునే చాలా మందే ఉంటార. అలాంటి వారికోసం విజేతలుగా నిలిచిన చిత్రాలు ఏ ఓటీటీలో అలరిస్తున్నాయో తెలుసుకోవాలనుందా? అయితే ఇది మీకోసమే. ఏకంగా ఏడు అవార్డులు గెలుచుకున్న సినిమా అయితే ఈ ఏడాది ఆస్కార్‌లో ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకొన్న చిత్రం 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్'. ఈ సినిమా ఏడు అవార్డులతో రికార్డు సృష్టించింది. ఈ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే భారత్ నుంచి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ దక్కింది. అలాగే ఇండియా నుంచి షార్ట్ షిల్మ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా సిని ప్రేక్షకులను అలరిస్తోంది. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఆస్కార్ అవార్డులు పొందిన కొన్ని చిత్రాలు ఆర్ఆర్ఆర్ - జీ5, డిస్నీ + హాట్ స్టార్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ - సోనీలీవ్ ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ - నెట్‌ఫ్లిక్స్ బ్లాక్‌పాంథర్-వకండా ఫరెవర్ - డిస్నీ+ హాట్‌స్టార్ అవతార్ 2 - అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, వుడ్, డిస్నీ+హాట్‌స్టార్ టాప్ గన్: మావెరిక్ - అమెజాన్ ప్రైమ్ వీడియో ( తెలుగు ఆడియో కూడా ఉంది) ది ఎలిఫెంట్ విస్పరర్స్ - నెట్‌ఫ్లిక్స్ పినాషియో - నెట్‌ఫ్లిక్స్ కాగా.. ఉమెన్ టాకింగ్, నవానీ, ది వేల్ లాంటి చిత్రాలు ప్రస్తుతం భారత్‌లో స్ట్రీమింగ్కు అందుబాటులో లేవు. -
RRRలో మీరు చూసింది అదే: జూనియర్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కడంపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భారతదేశ సంస్కృతిపై మాట్లాడుతూ ఎమోషనలయ్యారు. భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న దేశమని కొనియాడారు. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..'భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న వైవిధ్యమైన దేశం. ఆర్ఆర్ఆర్లో మీరు చూసింది అదే. ప్రపంచానికి చెప్పాల్సిన కథలు ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా తీవ్రమైన, బలమైన, భావోద్వేగ, నాటకీయ యాక్షన్‌తో కూడిన సినిమాలు ఇండియా నుంచి వస్తాయి. ఇప్పుడు ఇండియన్స్‌కు పూర్తి నమ్మకం కలిగింది.' అని అన్నారు. -
ఆస్కార్ వేడుకల్లో మలాలా.. ఎందుకో తెలుసా?
అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది. అత్యంత భారీ ఖర్చుతో ఈ వేడుకను ఆస్కార్ అకాడమీ నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈవెంట్లో అందరినీ దృష్టిని ఆకర్షించించింది మాత్రం పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూజఫ్జాయ్. తన భర్త అస్సర్ మాలిక్‌తో కలిసి వేదికపై మెరిసింది. ఇంతకీ ఈ వేడుకకు ఆమె ఎందుకొచ్చింది? అనే ప్రశ్న సినీ ప్రేక్షకుల్లో తలెత్తింది. మలాలాకు ఇప్పటికే నోబెల్ బహుమతి వచ్చిన సంగతి తెలిసిందే. మహిళల విద్యకోసం కృషి చేస్తున్న మలాలా విశ్వవేదికపై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. మహిళా విద్యా కార్యకర్త అయిన ఆమె ఆస్కార్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి ఎంపికైన 'స్ట్రేంజర్ ఎట్ ది గేట్' అనే షార్ట్ ఫిల్మ్‌కు ఆమె ఎగ్జిక్యూటివ్ నిర్మాత కావడమే కారణం. అందుకే వారికి మద్దతుగా ఆస్కార్ వేడుకలకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది టాలీవుడ్ మూవీకి ఆస్కార్ రావడంతో సినీ ప్రేక్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కింది. -
ఆస్కార్ వేదికపై ఎలుగుబంటి.. అసలు విషయమిదే..!
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డ్ వేడుక ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు వీక్షించారు. ఈ వేడుకలో సినీరంగంలో అత్యుత్తమ ప్రతిభ చాటిన ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన సినిమాలకు అవార్డులు ప్రకటిస్తారు. ఈ వేడుక కోసం ఆస్కార్ అకాడమీ నిర్వాహకులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించింది ఏంటో తెలుసా? వేదికపై అందరినీ అలరిస్తూ సందడి చేసిన ఓ ఎలుగుబంటి. ఇంతకీ ఆ వేదికపై ఎలుగుబంటి ఎందుకొచ్చిందా అని సందేహం మీకు వచ్చి ఉండొచ్చు. పదండి ఆ ఎలుగుబంటి కథేంటో తెలుసుకుందాం. ఆస్కార్ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఎలుగుబంటి ఓ సినిమాలోని పాత్ర. ఎలిజబెత్ బ్యాంక్స్ కామెడీ థ్రిల్లర్ మూవీలో ఎలుగుబంటి అలరించింది. ఈ ఏడాది ఆస్కార్ వేడుకపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈవెంట్లో పాల్గొన్న సినీ దిగ్గజాలను పలకరిస్తూ సందడి చేసింది. దీంతో నెటిజన్స్ దీనిపై ఆరా తీస్తున్నారు. ఆస్కార్ వేదికపై మెరిసిన ఆ ఎలుగుబంటి గురించి ఆసక్తి కనబరుస్తున్నారు. -
రామ్ చరణ్ ట్వీట్.. మరో 'నాటు నాటు' పక్కా..!
ప్రపంచ వేదికపై ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగిపోతోంది. తెలుగువారి పేరును ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ రావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా భారత సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ సినిమాలో అవకాశమిచ్చిన రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ఓ లెటర్‌ను తన ట్వీట్లో పంచుకున్నారు. అయితే అందులో రామ్ చరణ్ రాసిన ఓ లైన్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఎందుకంటే అందులో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన కో- స్టార్, బ్రదర్ తారక్ నీకు ధన్యవాదాలు.. నీతో మరోసారి డ్యాన్స్ చేసి మళ్లీ రికార్డులు సృష్టించాలనుకుంటున్నా' అంటూ నోట్లో రాశారు. దీంతో ఆర్ఆర్ఆర్-2లో మరో నాటు నాటు పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. మరోసారి ఎన్టీఆర్- చెర్రీ స్క్రీన్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టడం కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్-2 ఉంటుందని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ అభిమానులు మరోసారి చరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్ రిపీట్ కాబోతోందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్- 2 పట్టాలెక్కుతుందేమో వేచి చూడాల్సిందే. We have won!! We have won as Indian Cinema!! We won as a country!! The Oscar Award is coming home!@ssrajamouli @mmkeeravaani @tarak9999 @boselyricist @DOPSenthilKumar @Rahulsipligunj @kaalabhairava7 #PremRakshith @ssk1122 pic.twitter.com/x8ZYtpOTDN — Ram Charan (@AlwaysRamCharan) March 13, 2023 -
ఆ సినిమాకు ఏకంగా ఏడు ఆస్కార్లు.. తొలి ఆసియా మహిళగా రికార్డు
95వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఓ హాలీవుడ్ చిత్రం సత్తా చాటింది. 'ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్'(Everything Everywhere All At Once)అనే హాలీవుడ్ చిత్రం ఏకంగా ఏడు ఆస్కార్లను కైవసం చేసుకుంది. 11 విభాగాల్లో నామినేట్ అయిన ఈ సినిమా ఏకంగా ఏడు అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు వరించాయి. కాగా, ఈ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్‌యో ఆస్కార్ అందుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా ఏడు ఆస్కార్లను సొంతం చేసుకొని సత్తా చాటింది. -
ఆస్కార్ గెలవగానే తారక్, రామ్‌చరణ్ ఏం చేశారంటే?
ఎంతగానో ఎదురుచూస్తున్న భారతీయుల కలను నిజం చేస్తూ ఆస్కార్ అవార్డు గెలిచింది ఆర్ఆర్ఆర్ సినిమా. ప్రపంచం మెచ్చిన హాలీవుడ్ పాటలను వెనక్కు నెడుతూ నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకుంది. నాటునాటకు ఆస్కార్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకులు ఎగిరి గంతేశారు. మరి ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డ ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ రియాక్షన్ ఇంకెలా ఉంటుందో ఆలోచించారా? నాటునాటుకు అవార్డు ప్రకటించగానే జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ సంతోషంతో ఒకరినొకరు హత్తుకున్నారు. ఈ విజయానికి పునాది వేసిన రాజమౌళి వైపు ఆనందంగా చూస్తూ కళ్లతోనే అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విజయాన్ని గురించి రామ్‌చరణ్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ.. 'మనం గెలిచాం. మన ఇండియన్ సినిమా గెలిచింది. యావత్ దేశమే గెలిచింది. ఆస్కార్‌ను ఇంటికి తెచ్చేస్తున్నాం' అని రాసుకొచ్చాడు. 'భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆర్ఆర్ఆర్ ఎంతో ప్రత్యేకమైనది. ఆస్కార్ సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నేనింకా కలలోనే ఉన్నట్లనిపిస్తోంది. రాజమౌళి, కీరవాణి గారు భారత చలనచిత్రపరిశ్రమలో ఉన్న అరుదైన రత్నాలు. ఈ అద్భుత కళాఖండంలో నన్ను భాగం చేసినందుకు ధన్యవాదాలు. నాటు నాటు అనేది ఒక భావోద్వేగం. ఆ ఎమోషన్‌కు ఒక రూపమిచ్చిన చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, ప్రేమ్ రక్షిత్‌లకు ధన్యవాదాలు. నా బ్రదర్ తారక్ థాంక్యూ.. కుదిరితే నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డులు సృష్టించాలనుంది. ప్రియమైన కోస్టార్ ఆలియా భట్‌కు కూడా కృతజ్ఞతలు. ఈ అవార్డు భారతీయ నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులకు సొంతం. మమ్మల్ని ఆదరించిన అభిమానులకు ప్రేమాభివందనాలు' అని ఓ లేఖలో రాసుకొచ్చాడు చరణ్. We have won!! We have won as Indian Cinema!! We won as a country!! The Oscar Award is coming home!@ssrajamouli @mmkeeravaani @tarak9999 @boselyricist @DOPSenthilKumar @Rahulsipligunj @kaalabhairava7 #PremRakshith @ssk1122 pic.twitter.com/x8ZYtpOTDN — Ram Charan (@AlwaysRamCharan) March 13, 2023 And we did it… #Oscars95 #NaatuNaatu #RRRMovie Congratulations @mmkeeravaani Sir ji, Jakkanna @ssrajamouli , @boselyricist garu, the entire team and the nation 🇮🇳 pic.twitter.com/LCGRUN4iSs — Jr NTR (@tarak9999) March 13, 2023 -
'నాటు నాటు' రచయిత చంద్రబోస్ గ్రామంలో సంబరాలు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ భారత చిత్రపరిశ్రమ స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. నాటు నాటు పాటకు ఆస్కార్ వరించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాటకు తన కలంతో ప్రాణం పోసిన గీతరచయిత చంద్రబోస్ స్వగ్రామం చల్లగరిగెలో సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రబోస్ రాసిన నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచిందనగానే గ్రామస్తులు బాణసంచాలు కాల్చి మిఠాయిలు పంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ రాసిన పాట ప్రపంచస్థాయి గుర్తింపు పొందడం తెలుగు జాతికే గర్వకారణమని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. -
బస్తీ కుర్రోడి నుంచి ఆస్కార్ వరకు.. రాహుల్ కెరీర్ సాగిందిలా
ధూల్ పేట్లో పుట్టిన కుర్రాడు.. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఉన్న ఇష్టంతో గిన్నెలపై గరిటెలతో వాయిస్తూ సాంగ్స్ పాడేవాడు. అతని టాలెంట్‌ను గుర్తించిన తండ్రి కుమారుడికి సంగీతం నేర్పించాలని ఓ గజల్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొన్నాళ్ల పాటు శిక్షణ తీసుకున్న ఆ కుర్రాడు చిన్న చిన్న సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్‌గా మారాడు. అలా ఓ వైపు సంగీతంలో ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు తండ్రికి సహాయంగా బార్బర్ షాప్‌లో పనిచేశాడు. తన సింగింగ్ టాలెంట్‌తో శ్రోతలను మైమరిపించేవాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా మొదలైన అతని ప్రయాణం ఈరోజు ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేదాకా ఎదిగాడు.. అతడే రాహుల్ సిప్లిగంజ్. ధూల్ పేట్ టూ లాస్ ఎంజిల్స్ వరకు సాగిన అతడి ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. గల్లీ బాయ్ పేరుకు తగ్గట్లుగానే వివాదాలు అతనితో ముడిపడి ఉన్నాయి. ఆనాటి నుంచి ఇప్పుటిదాకా సాగిన రాహుల్ విజయ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. రాహుల్ సిప్లిగంజ్ బార్బర్ షాప్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి నేడు ప్రపంచంలో అత్యున్నత వేదిక ఆస్కార్ వరకు చేరుకున్నాడు. 1989 ఆగష్టు 22న హైదరాబాద్ పాతబస్తీలో జన్మించిన రాహుల్‌కు చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేదట. స్కూల్ నుంచి తిరిగి రాగానే గిన్నెలపై కర్రలతో వాయిస్తూ ఫోక్సాంగ్స్ పాడేవాడట. ఇది గమనించిన రాహుల్ తండ్రి, ఆయనకి తెలిసిన గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే తండ్రికి బార్బర్ షాప్ లో సాయం చేసేవాడు. సుమారు 7 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకొని గజల్స్‌పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే కోరస్ పాడే అవకాశాలు తలుపుతట్టాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్‌లో ‘కాలేజీ బుల్లోడా’ అనే సాంగ్ పాడే అవకాశం వచ్చింది. ఆ పాటకి మంచి ప్రోత్సాహం రావడంతో.. అప్పటి వరకు తను పాడిన పాటలన్ని ఒక సీడీ చేసుకొని, దాని తీసుకోని వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించాడట.రాహుల్ ప్రతిభను చూసిన కీరవాణి అతనికి దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’ అనే టైటిల్ సాంగ్ ను పాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘ఈగ’లో ఈగ ఈగ ఈగ, రచ్చ’లో సింగరేణి ఉంది... బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్ శంకర్’లో బోనాలు ఇలా పలు సినిమాల్లో సింగర్‌గా రాహుల్ అవకాశాలు దక్కించుకున్నాడు. ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే మరోవైపు సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాడు. మంగమ్మ,పూర్ బాయ్, మాకి కిరికిర', 'గల్లీ కా గణేష్', 'దావత్'.. ఇలా హైదరాబాదీ సంస్కృతి, సంప్రదాయాలకు తన జోష్ మిక్స్ చేసి రాహుల్ పాటలు కంపోజ్ చేశాడు. ఇదిలా ఉంటే 2019లో తెలుగు బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొనడంతో రాహుల్ దశ తిరిగిందని చెప్పొచ్చు. పునర్నవితో లవ్‌ట్రాక్, తన పాటలు, ఎనర్జీ, శ్రీముఖితో గొడవలు ఇలా ఒకటేమిటి అన్ని షేడ్స్ చూపించి యూత్‌లో మాంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ సీజన్ విన్నర్‌గా బయటకు వచ్చి తన జర్నీని మరింత ముందుకు తీసుకుళ్లాడు. గల్లీబాయ్ పేరుకు తగ్గట్లేగానే రాహుల్ పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన కొన్ని వారాలకే ఓ పబ్‌లో జరిగిన గొడవలో రాహుల్‌పై బీరు సీసీలతో దాడి చేసిన సంఘటన అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఎమ్మెల్యే బంధువులపై రాహుల్, అతని స్నేహితులకు మధ్య జరిగిన గొడవలో బీరుసీసాలతో గొడవ, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకునే వరకు వెళ్లింది. కట్‌చేస్తే.. కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్‌లో బంజారాహిల్స్ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్ వాడారనే సమాచారంతో అర్థరాత్రి పోలీసులు జరిపిన రైడ్‌లో రాహుల్ సిప్లిగంజ్ పట్టుబడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు 150మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకోగా పలువురు సెలబ్రిటీలతో పాటు రాహుల్ కూడా విచారణను ఎదుర్కున్నాడు. ఇలా వివాదాలతో సావాసం చేసిన రాహుల్ తనను విమర్శించినవాళ్లతోనే చప్పట్లు కొట్టించుకునేలా చేశాడు. విశ్వవేదికపై తెలుగోడి సత్తా సగర్వంగా నిరూపించాడు. ఆర్ఆర్ఆర్లోని రాహుల్ పాడిన నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో ఆ బస్తీ పోరడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. -
నా భార్యకు ఆరో నెల.. పుట్టబోయే బిడ్డ: రామ్‌చరణ్
టాలీవుడ్ బెస్ట్ కపుల్లో రామ్‌చరణ్- ఉపాసన ఒకరు. 2012లో పెళ్లిపీటలెక్కిన వీరిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ మధుర క్షణాలను ఆస్వాదించకుండా తమ సమయాన్నంతా ఆర్ఆర్ఆర్కే అంకితం చేశారిద్దరూ.. ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అయినప్పటి నుంచి అమెరికాలో వరుస ప్రమోషన్లు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు చరణ్. తనకు సపోర్ట్‌గా ఉంటూ భర్తతో పాటే అమెరికాలో ఉంది ఉపాసన. ఇటీవలే వీరిద్దరూ ప్రీఆస్కార్ వేడుకలకు హాజరవగా తాజాగా 95వ ఆస్కార్ సంబరాల్లో పాల్గొన్నారు. రామ్‌చరణ్ బ్లాక్ సూట్లో రెడీ అవగా ఉపాసన సాంప్రదాయాలకు విలువనిస్తూ చీరలో కనిపించింది. ఆస్కార్ సెలబ్రేషన్స్ ప్రారంభమవడానికి ముందు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడింది ఉపాసన. 'రామ్‌కు నేనెప్పుడూ సపోర్ట్ చేస్తాను. ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీలో భాగంగా నేనిక్కడకు వచ్చాను. నాకు కొంత ఆందోళనగా ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఉండటం ఎంతో సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. ఇంతలో చరణ్ మాట్లాడుతూ... 'తనిప్పుడు ఆరు నెలల గర్భవతి. పుట్టబోయే బిడ్డకు ఎక్కడలేనంత ప్రేమ లభిస్తోంది. కడుపులో ఉండగానే తను మాకెంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది' అన్నాడు. -
Oscar Winners 2023: ఆస్కార్ విజేతలు వీరే!
చలన చిత్ర పరిశ్రమలో అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డుల ప్రదానోత్సవం ఈ సారి మరింత కోలాహలంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజిలస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. 95వ ఆస్కార్ వేడుకల్లో భారతీయ చిత్రాలు సత్తా చాటాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు(ఆర్ఆర్ఆర్)’ పాటకు అస్కార్ లభించింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ సినిమా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ను ఆస్కార్ వరించింది. ఉత్తమ నటుడిగా ది వేల్ చిత్రానికిగాను బ్రెండన్ ప్రాసెర్, ఉత్తమ నటిగా మిషేల్ యో(ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) నిలిచింది. అస్కార్ విజేతలు వీరే ఉత్తమ చిత్రం : ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఉత్తమ నటుడు: బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్) ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు( ఆర్ఆర్ఆర్) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: ది ఎలిఫెంట్ విష్పరర్స్ ఉత్తమ సహాయ నటి: జేమిలీ కర్టీస్(ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సహాయనటుడు: కే హ్యూ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్(వాకర్ బెర్టెల్మాన్) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్- నవానీ బెస్ట్ షార్ట్ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్‌బై బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ది వేల్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: ఉమెన్ టాకింగ్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్‌బై బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ బెస్ట్ సౌండ్: . టాప్ గన్ మావెరిక్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్ ది వే ఆఫ్ వాటర్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది బాయ్ ది మోల్ ది ఫాక్స్ ఆండ్ ది హార్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ -
నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ యవనికపై తెలుగు సినిమా సత్తాచాటిందని కొనియాడారు. 'ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణం. నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది. తెలుగులోని మట్టివాసనలను చంద్రబోస్ వెలుగులోకి తెచ్చారు. ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు.' అని కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 95వ ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు కొల్లగొట్టింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. దీంతో దేశంలోని ప్రముఖులు, సెలబ్రిటీలు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దేశం గర్వించదగ్గ సినిమా ఇది అని కొనియాడుతున్నారు. చదవండి: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఆనందంతో ఎగిరి గంతేసిన రాజమౌళి -
Oscars 2023: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సీఎం జగన్ అభినందనలు
తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ‘ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషం. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది. గ్లోబల్ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేసిన పాట ఇది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడే విధంగా చేసింది. ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న భారత సినిమాకు ఈ అవార్డు మరింత ప్రోత్సహకాన్ని ఇచ్చింది’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, భారత్ నుంచి మూడు విభాగాల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌కు నామినేషన్స్ దక్కాయి. వీటీలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాట, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగం నుంచి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకున్నాయి. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరీలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’కు నిరాశ ఎదురైంది. The #Telugu flag is flying higher! I’m filled with pride on a Telugu song, that so beautifully celebrates our folk heritage, being given its due recognition internationally today. @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and @mmkeeravaani have truly redefined excellence! 1/2 https://t.co/jp75mpiZHv — YS Jagan Mohan Reddy (@ysjagan) March 13, 2023 -
‘నాటు నాటు’కు ఆస్కార్… ఆనందంతో ఎగిరి గంతేసిన రాజమౌళి
తెలుగు సినిమా చరిత్ర సృష్టించిన రోజిది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు ప్రకటించగానే డాల్బీ థియేటర్ దద్దరిల్లిపోయింది. రాజమౌళి, ఆయన భార్య రమ సంతోషంతో భావేద్వేగానికి గురయ్యారు. కార్తికేయ దంపతులతో కలిసి గంతులేశారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు, లైవ్‌లో చూస్తున్న భారతీయులు సైతం ఆనందంతో పులకరించిపోయారు. తెలుగు సినిమా పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం, అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగువాళ్లతో పాటు భారత సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. -
ఆర్ఆర్ఆర్ను బాలీవుడ్ సినిమా అన్న ఆస్కార్ హోస్ట్, నెటిజన్లు ఫైర్!
ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణాలివి.. నాటు నాటు ప్రజల మనసులు దోచుకుంటూ ఆస్కార్‌ను అందిపుచ్చుకుంది. దీంతో భారత ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఆస్కార్ వేదికపై ఓ పొరపాటు జరిగింది. తెలుగువాడైన జక్కన్న చెక్కిన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ను బాలీవుడ్ చిత్రంగా అభివర్ణించాడు హోస్ట్ జిమ్మీ కిమ్మెల్. ఇది అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. ఇది అచ్చమైన స్వచ్చమైన తెలుగు చిత్రమని, బాలీవుడ్ మూవీ కాదంటూ రాజమౌళే ఎన్నోసార్లు నొక్కి చెప్పాడు. అలాంటిది ఇప్పుడు అంత పెద్ద అవార్డుల ఫంక్షన్లో ఆర్ఆర్ఆర్ను బాలీవుడ్ అనేశారేంటి! అని నెటిజన్లు మండిపడుతున్నారు. 'ఇండియా అనగానే బాలీవుడ్ ఒక్కటే కాదు ఎన్నో భాషల ఇండస్ట్రీలు ఉన్నాయి. బాలీవుడ్ అంటే హిందీ పరిశ్రమ. ఇండియాలో చాలామంది హిందీ మాట్లాడతారు.. అలా అని అన్ని సినిమాలను బాలీవుడ్ అనలేం కదా.. ఆర్ఆర్ఆర్ తెలుగు భాషా చిత్రం. ఇది దక్షిణాదిలోని ఓ ఇండస్ట్రీ..', 'ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌ను హోస్ట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా' అని కామెంట్లు చేస్తున్నారు. Dear #Oscars95 Team, #RRR is not a #Bollywood movie. Please note. 🙈 — Shiva’Marvel’Nandy (@shivanandysky) March 13, 2023 @jimmykimmel Correction - RRR is a Indian film / Telugu / Tollywood made film and not a Bollywood film. #Oscar2023 #RRRMoive #rrr — Ordinary Human (@we_are_humanns) March 13, 2023 Ooh... #Oscars just love controversies and conflicts. Referring to #RRR as a Bollywood film even after hearing that the creators are promoting it as an Indian film for months. — उज्जल | UJJAL (@beujjal) March 13, 2023 India has different film industries for different languages...bollywood means hindi language film industry...since hindi is the most spoken language in india bollywood is more popular..rrr is a telugu language film from south part of india — gulabi gutthu (@united_TFI_fan) March 13, 2023 RRR is South Indian cinema, a Telagu film, Tollywood. Not Bollywood, as some Oscars ppl might be saying! — Preeti Chhibber (@runwithskizzers) March 12, 2023 -
Oscars 2023 : ప్రపంచస్థాయికి తెలుగు సినిమా.. RRRటీమ్‌కు అరుదైన గౌరవం
-
Oscars 2023: కోరిక తీరింది.. పాటతో మనసులో మాట చెప్పిన ఎంఎం కీరవాణి!
లాస్ ఏంజెల్స్: ప్రపంచ వేదికపై ఓ తెలుగు సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను కైవసం చేసుకుని మన సత్తా చాటింది. భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో అవార్డ్‌ను సొంతం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రానికి గుర్తింపును తెచ్చిపెట్టింది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఆస్కార్ అవార్డ్‌ను ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. అనంతరం ఆయన పాట రూపంలో తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. అందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు. చివరిలో రచయిత చంద్రబోస్ నమస్తే అంటూ తెలుగులో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా కంటున్న కలలను నిజం చేస్తూ రెండు ఆస్కార్లను మన చిత్రాలు దక్కించుకున్నాయి. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకోగా.. మరో భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్‌ను దక్కించుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #NaatuNaatu wins the #Oscar for best Original Song 😭#SSRajamouli & team has done it🫡🇮🇳 Indian Cinema on the Rise 🔥 !! #RRRMovie | #AcademyAwards | pic.twitter.com/VG7zXFhnJe — Abhi (@abhi_is_online) March 13, 2023 -
కోట్ల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి.. చిరంజీవి ట్వీట్..
సాక్షి, హైదరాబాద్: విశ్వవేదికపై సత్తా చాటి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట ఆస్కార్ కైవసం చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆస్కార్ అందుకోవడం భారత్ కల అని, అది ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే సాకారమైందని దర్శకధీరుడు రాజమౌళిని చిరు కొనియాడారు. కోట్ల మంది భారతీయుల హృదయాలు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయన్నారు. ఆర్ఆర్ఆర్ బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. #NaatuNaatu ON TOP OF THE WORLD !!! 👏👏👏👏👏 And THE OSCAR for the Best Original Song Goes To : Take a Bow .. @mmkeeravaani garu & @boselyricist @kaalabhairava7 @Rahulsipligunj #PremRakshith @tarak9999 @AlwaysRamCharan And the One & Only @ssrajamouli 😍😍😍#Oscars95 — Chiranjeevi Konidela (@KChiruTweets) March 13, 2023 కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్‌రక్షిత్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళిల పేర్లను ప్రస్తావిస్తూ అందరికీ చిరు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకించి రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. -
Oscar 2023: నాటునాటుకు ఆస్కార్.. ప్రముఖుల స్పందనలివే..!
తెలుగు పాటను విశ్వవ్యాప్తం చేసిన రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణిని భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి అభినందనల వెల్లువతాకింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను పతాకశీర్షికలకు ఎక్కించిన ఘనులు అని ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖుల స్పందనలివే..! ప్రధాని నరేంద్ర మోదీ తెలుగువారికి అవార్డు రావడం గర్వకారణం, ప్రతిష్టాత్మక అవార్డు తీసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్‌కు, ది ఎలిఫెంట్ విస్పరర్స్ టీమ్‌కు అభినందనలు. ఇది దేశం గర్వించే రోజు. కేటీఆర్ నాటునాటు పాటకు ఆస్కార్ రావడం దేశానికి గర్వకారణం. రాజమౌళి దేశాన్ని గర్వపడేలా చేశారు. చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు. జోగి రమేశ్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ రావడం పట్ల ఏపీ మంత్రి జోగి రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గర్వకారణమన్నారు. ► ఆర్ఆర్ఆర్ టీమ్‌కు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ► ఆర్ఆర్ఆర్ టీమ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందనలు తెలిపారు. ► ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ► ఆర్ఆర్ఆర్ టీమ్‌కు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అభినందనలు తెలిపారు. ► ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్ టీమ్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించారు. ► ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడం.. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగ్గ విషయం అని బాలకృష్ణ ప్రశంసించారు. ► భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారంటూ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను పవన్ కల్యాణ్ అభినందించారు. మంచు విష్ణు ఆస్కార్ గెలుచుకున్న సంగీత దర్శకుడు కీరవాణికి సినీ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అభినందనలు తెలిపారు. భారతీయ సినిమాకు ఈ విభాగంలో అవార్డు రావడం చరిత్రాత్మకం అని ట్వీట్ చేశారు. Amazing! I extend my warmest congratulations to Sri. Keeravani Garu on his historic achievement as the first Indian Music Composer to win an Oscar award for an Indian movie. Congratulations! 💐@mmkeeravaani @ssrajamouli #Oscars #AcademyAwards #NaatuNaatu #Oscars95 pic.twitter.com/2gDZCk86Lf — Vishnu Manchu (@iVishnuManchu) March 13, 2023 చిరంజీవి తెలుగు సినిమా ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ విశ్వప్యాప్తం చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సినిమా అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో తన కుమారుడు రామ్‌చరణ్ భాగమైనందుకు గర్వంగా ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ దేశానికి గర్వకారణమన్నారు. #NaatuNaatu ON TOP OF THE WORLD !!! 👏👏👏👏👏 And THE OSCAR for the Best Original Song Goes To : Take a Bow .. @mmkeeravaani garu & @boselyricist @kaalabhairava7 @Rahulsipligunj #PremRakshith @tarak9999 @AlwaysRamCharan And the One & Only @ssrajamouli 😍😍😍#Oscars95 — Chiranjeevi Konidela (@KChiruTweets) March 13, 2023 రవితేజ ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది, ఈ సినిమా ఆడియన్స్ మదిలో చాలా ఏళ్ల పాటు నిలిచిపోతుందని రవితేజ్ ట్వీట్ చేశారు. ఆస్కార్‌తో ప్రపంచ శిఖరాగ్రాన నిలిచిందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఎలక్ట్రిఫయింగ్ డ్యాన్స్ మూవ్స్ లేకపోతే.. నాటు నాటు పాటకు ఆస్కార్ సాధ్యమయ్యేది కాదని రవితేజ అన్నారు. History is created!#NaatuNaatu has truly left a lasting impact on audiences and will be remembered for years to come & this prestigious OscaRRR is a cherry on top❤️ Congratulations @mmkeeravaani garu, @boselyricist garu, Prem , @kaalabhairava7 @Rahulsipligunj🤗#RRRatOSCARS — Ravi Teja (@RaviTeja_offl) March 13, 2023 #oscar for #NatuNatu Historic moment for Indian cinema!! you make us proud!! Congratulations to @MMKeeravaani @SSRajamouli @BoseLyricist @Tarak9999 @AlwaysRamCharan @KaalaBhairava7 @RahulSipligunj #PremRakshith @DVVMovies @RRRMovie and team!!💐💐💐👏🏼👏🏼👏🏼👏🏼👏🏼 — Nagarjuna Akkineni (@iamnagarjuna) March 13, 2023 Sir @mmkeeravaani YOU OSCARRED IT! 😘😘😘😍😍😍 CONGRATS to the KILLER TEAM of RRR 🙏🙏🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) March 13, 2023 Team #RRR u made the whole of india proud …. Congrats @mmkeeravaani sir and dear @boselyricist sir … this is hugeeeee 👏👏👏👏👏👏 @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/HPcl4O49BJ — G.V.Prakash Kumar (@gvprakash) March 13, 2023 As it is often said, cinema speaks a universal language. Congratulations to the teams of #RRR and #TheElephantWhisperers for their #Oscar wins. It’s a proud 🇮🇳 moment 🎈 — Ajay Devgn (@ajaydevgn) March 13, 2023 Congratulations to entire India🇮🇳a movie about suppression, torture, killing, colonisation of Indians based on racial grounds gets appreciated on a world platform, number of Indians died just during one Bengal famine were way more than Jews died during holocaust. Thank team RRR🙏 https://t.co/J0L2RFuicH — Kangana Ranaut (@KanganaTeam) March 13, 2023 🔥👏❤️#RRR is a True example of Team work lead by a Great Visionary. @ssrajamouli 🙏 Congratulations & keep inspiring.@mmkeeravaani @boselyricist @premrakchoreo @tarak9999 @AlwaysRamCharan @ssk1122 @RRRMovie Love..#RAPO https://t.co/HXycu5tWIt — RAm POthineni (@ramsayz) March 13, 2023 I join a Billion Indians in celebrating the Honour for #NaatuNaatu and #RRR 🎉 Kudos to @mmkeeravaani Garu and @boselyricist Garu on making History ❤️👏 The man of the moment, brilliant storyteller who has made India proud @ssrajamouli Garu 🎉 Both my brothers, the superstars… https://t.co/TxKRZ8Dq1q pic.twitter.com/2IRfgPltYo — KTR (@KTRBRS) March 13, 2023 And there you go... NAATU NAATU!! Crossing all boundaries!! Congratulations to @mmkeeravaani garu, @boselyricist and the entire team of #RRR on their phenomenal win at the Oscars!! A jubilant moment for Indian cinema 👏👏👏 — Mahesh Babu (@urstrulyMahesh) March 13, 2023 View this post on Instagram A post shared by Actor Brahmaji (@brahms25) -
ఆస్కార్ వేదికపై గర్జించిన తారక్, రామ్‌చరణ్
యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్ పండగ మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో 95వ ఆస్కార్ ప్రదానోత్సవాలు జరుగుతున్నాయి. అవార్డుల ప్రకటనకు ముందు నాటునాటు పాటతో స్టేజీ దద్దరిల్లిపోయింది. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్‌లో సాంగ్ పాడుతుంటే డ్యాన్సర్లు తమ స్టెప్పులతో జనాలకు ఊపు తెప్పించారు. మన తెలుగు పాటకు స్టాండింగ్ ఒవేషన్ దక్కడం మరో విశేషం. అనంతరం హాలీవుడ్ పాటలను వెనక్కు నెడుతూ ఆస్కార్ అవార్డును ముద్దాడింది ఆర్ఆర్ఆర్ టీమ్. ఇకపోతే ఆస్కార్ సెలబ్రేషన్స్ కోసం రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ సూటులో రెడీ అయ్యారు. తారక్ కోటుపై గర్జించే పులి బొమ్మ ఉంది. రాజమౌళి ట్రెడిషనల్ కుర్తాలో కనిపించారు. తారక్, చెర్రీ, ఉపాసన సహా ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా కలసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అకాడమీ హాల్లోకి వెళ్లేముందు చరణ్, తారక్ హగ్ చేసుకున్న ఫోటో చూసి అభిమానులు చూపు తిప్పుకోలేకపోతున్నారు. 'మీరిద్దరూ గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారన్నా', 'ఆస్కార్ సాధించి భారత్ సత్తా చాటారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
Oscars 2023: ప్చ్.. ఆస్కార్ మిస్ చేసుకున్న భారతీయ చిత్రం ఇదే!
లాస్ ఏంజెల్స్: ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన భారత డాక్యుమెంటరీ చిత్రానికి నిరాశ ఎదురైంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరిలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ (All That Breathes) అస్కార్‌ను దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో అమెరికాకి చెందిన ‘నావాల్నీ’ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింను అవార్డ్ వరించింది. ఆల్ దట్ బ్రీత్స్ని షానక్ సేన్ దర్శకత్వం వహించారు. ఈ కేటగిరిలో ఇతర నామినీల విషయానికొస్తే.. ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్‌షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్ చిత్రాలు ఉన్నాయి. ‘ఆల్ దట్ బ్రీత్’స్ ఈ విభాగంలో నామినేట్ చేసిన రెండవ భారతీయ చిత్రం. గత సంవత్సరం రింటు థామస్, సుష్మిత్ ఘోష్ రాసిన రైటింగ్ విత్ ఫైర్, ఆస్కార్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది. ఆల్ దట్ బ్రీత్స్.. ఢిల్లీలో బర్డ్ క్లినిక్ నడుపుతున్న సౌద్, నదీమ్ అనే ఇద్దరు సోదరుల కథ ఇది. ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ సర్క్యూట్లో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు అనేక అవార్డులను గెలుచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. -
నాటు నాటుకు ఆస్కార్, చరిత్ర సృష్టించిన RRR
ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రమే కాదు, యావత్ భారతదేశం ఎదురుచూసింది. అందరి ఎదురుచూపులకు తెరదించుతూ ఆస్కార్ అవార్డు పట్టేసింది నాటు నాటు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో హాలీవుడ్ సాంగ్స్‌ను వెనక్కు నెట్టి తెలుగు పాట విజేతగా అవతరించింది. భారతీయ పాటకు అందులోనా ఓ తెలుగు సాంగ్‌కు ఆస్కార్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ గుడ్‌న్యూస్ విని అభిమానులు, సెలబ్రిటీలు, సినీప్రేక్షకులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో లిఫ్ట్ మీ అప్(బ్లాక్ పాంథర్), అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హాండ్(టాప్ గన్ మార్వెరిక్), టీజ్ ఇస్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఇట్ వన్స్) పాటలు పోటీపడిన విషయం తెలిసిందే! నాటు నాటు పాట విషయానికి వస్తే టాలీవుడ్లో ఇద్దరు యంగ్ స్టార్లు. పైగా టాప్ డ్యాన్సర్ లిస్ట్‌లో ఉన్నవాళ్లు. ఆ ఇద్దరూ కలిసి గంతులేసే పాట ఎలా ఉండాలి?. ఆడియెన్స్ పూనకాలతో ఊగిపోవాలి.. థియేటర్లు దద్దరిల్లిపోవాలి. అందుకే ఆ మూడ్‌కు తగ్గట్లు కీరవాణి ట్యూన్ సెట్ చేశారు. అందుకు తగ్గట్లు పాటను రాయమని రాజమౌళి.. రచయిత చంద్రబోస్‌ను పురమాయించారు. సుమారు ఏడాదిన్నర పాటు శ్రమించి చంద్రబోస్ లిరిక్స్ రాయడం.. యువ సింగర్లు సిప్లీగంజ్-కాలభైరవలు తమ గాత్రంతో పాటను ఎక్కడికో తీసుకెళ్లడం.. భాషాహద్దులు చెరిపేస్తూ ఆ పాట సూపర్ హిట్ కావడం చకచకా జరిగిపోయాయి. ఇకపోతే నాటు నాటు పాట షూటింగ్ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అధికారిక భవనం మరియిన్స్కీ ప్యాలెస్ ముందు జరిగింది. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Oscar 2023: వావ్.. భారత్‌కు ‘ఆస్కార్’.. ఏ చిత్రమో తెలుసా?
లాస్ ఏంజెల్స్: లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో వేదికగా జరుగుతున్న 95వ ఆస్కార్ వేడుకలో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరిలో ’ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది. కార్తికి గోన్సాల్వెస్ ’ది ఎలిఫెండ్ విస్పరర్స్’కు దర్శకత్వం వహించింది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ ఈ ఆస్కార్‌ను దక్కించుకుంది. ఈ అవార్డ్‌ను కార్తికి గోన్సాల్వెస్ అందుకున్నారు. ఇక ఈ షార్ట్ ఫిలిం విషయానికొస్తే.. తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ రూందించిన డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’. -
Oscars 2023: మొదలైన ఆస్కార్ సందడి.. ఈ చిత్రానికే తొలి అవార్డ్!
లాస్ ఏంజెల్స్: ఆస్కార్ 2023 వేడుక అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. సంబరంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులతో పాటు ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డ్లకు ప్రధానోత్సవం జరుగుతోంది. ఇక భారత్ నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ‘నాటునాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా ఆస్కార్ (అకాడమీ అవార్డ్స్) భావిస్తారు. అందుకే తారలు తమ జీవితంలో ఒక్క సారైన ఈ అవార్డ్‌ను ముద్దాడాలని కోరుతుంటారు. 2023 గాను మొదటి ఆస్కార్ ఉత్తమ యానిమేటెడ్ సినిమా కేటగిరి దక్కించుకుంది. ఉత్తమ యానిమేటెడ్ సినిమాగా గిల్లెర్మో డెల్ టోరో నిర్మించిన 'పినోచియో' చిత్రం నిలిచింది. ఈ ఏడాది మొదటి ఆస్కార్‌ను కైవసం చేసుకున్న రికార్డు సొంతం చేసుకుంది. ఇందులో మరో విషయం ఏంటంటే.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్‌ను గెలుచుకుని గిల్లెర్మో డెల్ టోరో ఆస్కార్ చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు. చదవండి: Natu Natu Song: ‘నాటు నాటు’కు ఆస్కార్ వస్తుందా? రాదా? కోట్లలో బెట్టింగ్ -
Oscars 2023: అట్టహాసంగా ఆస్కార్ సెలబ్రేషన్స్
ఇంగ్లీష్ గడ్డపై ఇండియన్ సినిమా సత్తా చాటింది. చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్.. తెలుగు పాట ‘నాటు నాటు’ను వరించింది. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చింది. ఆదివారం (మార్చి 12) రాత్రి 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు) లాజ్ ఏంజిల్స్ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. ► ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఆస్కార్ గెలుచుకుంది. ఉత్తమ నటిగా ‘మిషెల్ యో’ (ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) నిలిచింది. ఈ అవార్డు వేడుకలలో ఈ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి ఏకంగా ఏడు ఆస్కార్స్ రావడం గమనార్హం. ►ఉత్తమ నటుడిగా బ్రెండన్ ప్రాసెర్(ది వేల్)ఆస్కార్ అందుకున్నాడు. ఉత్తమ నటుడి విభాగంలో బ్రెండన్‌తో ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్), కొలిన్ ఫార్రెల్ (ది బన్షీష్ ఆఫ్ ఇని షెరిన్), బిల్ నిగీ (లివింగ్),పాల్ మెస్కల్ (ఆఫ్టర్సన్) పోటీ పడ్డారు. అయితే , ‘ది వేల్’ చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్రెండెన్ ఫ్రాసెర్ను ఆస్కార్ వరించింది. ► 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడిగా డానియల్ క్వాన్.. డేనియల్ షినెర్ట్ అస్కార్ అందుకున్నారు. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి గాను ఈ దర్శక ద్వయం అవార్డు గెలుచుకున్నారు. ఈ కేటగిరిలో టాడ్ ఫీల్డ్ – టార్, మార్టిన్ మెక్‌డొనాగ్ – ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, రూబెన్ ఓస్ట్లండ్ – ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్, స్టీవెన్ స్పీల్బర్గ్ – ది ఫాబెల్మాన్స్ నామినేట్ అయ్యారు. ►బెస్ట్ సౌండ్ విభాగంలో హాలీవుడ్ మూవీ ‘టాప్ గన్ ’ ఆస్కార్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, ది బాట్మాన్, ఎల్విస్ పోటీపడ్డాయి. ► ఇంగ్లీష్ గడ్డపై తెలుగు పాట సత్తా చాటింది. 95వ ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా నాటు నాటు నిలిచింది. కీరవాణి స్వరపరచిన ఈపాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవపాడిన సంగతి తెలిసిందే. ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకుంటూ వేదికపై పాట పాడారు. 'Naatu Naatu' from 'RRR' wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn — The Academy (@TheAcademy) March 13, 2023 ► బెస్ట్ అడాప్టెడ్ స్ట్రీన్‌ప్లే విభాగంలో హాలీవుడ్ చిత్రం‘ ఉమెన్ టాకింగ్’కు అస్కార్ లభించింది. షేరా పాల్లే ఈ అవార్డును అందుకున్నారు. ►ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రాన్ని ఆస్కార్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఈ చిత్రానికి అవార్డు లభించింది. డేనియల్ క్వాన్, డేనియల్ షేనెర్ట్లు ఈ అవార్డులు అందుకున్నారు. ► జెమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ను ఆస్కార్ వరించింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది. ఈ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బ్యాట్‌మ్యాన్, బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్, టాప్ గన్ మావెరిక్ చిత్రాలు పోటీ పడ్డాయి. 'Avatar: The Way of Water' wins Best Visual Effects #Oscars #Oscars95 pic.twitter.com/U7xJ0D20tO — The Academy (@TheAcademy) March 13, 2023 ► బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ చిత్రం ఆస్కార్ అందుకుంది. ఈ విభాగంలో బాబిలోన్, ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మరియు ది ఫాబెల్మాన్స్ పోటీ పడగా..’ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ గెలిచింది. వాకర్ బెర్టెన్ మాన్ ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’కు సంగీతం అందించారు. ► బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ చిత్రం ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. క్రిస్టియన్ ఎం గొల్డెబెక్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించగా, ఎర్నిస్టైన్ హిప్పర్ సెట్ డిజైనర్‌గా ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ అవార్డ్ కోసం అవతార్ 2, Babylon, Elvis, The Fabelmans చిత్రాలు పోటీ పడ్డాయి. ► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్ కు ఆస్కార్ లభించింది. ఈ అవార్డ్ కోసం ది ఫ్లయింగ్ సెయిలర్, ఐస్ మర్చంట్స్, మై ఇయర్ ఆఫ్ డిక్స్, యాన్ ఓస్ట్రిచ్ టోల్డ్ మి ది వరల్డ్ ఈజ్ ఫేక్, ఐ థింక్ ఐ బిలీవ్ ఇట్ షార్ట్ ఫిల్మ్ నామినేట్ అయ్యాయి. The Oscar for Best Documentary Short Film goes to 'The Elephant Whisperers' #Oscars #Oscars95 pic.twitter.com/jLG0aqAg3j — The Academy (@TheAcademy) March 13, 2023 నయా చరిత్ర ►బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ సినిమా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ను ఆస్కార్ వరించింది. ఇండియా నుంచి గెలుపొందిన మొట్ట మొదటి బెస్ట్ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ చరిత్ర సృష్టించింది. తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ ఈ షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించారు. ► ఆస్కార్ వేదికపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు సాంగ్ పాడారు. బ్లాక్ ట్రెడిషనల్ వేర్లో.. లాల్చీ, పంచకట్టులో కనిపించారు సింగర్స్. ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ చిత్రం ఆస్కార్ దక్కించుకుంది. ఈ అవార్డ్ కోసం “బాబిలోన్”, “బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్”, “ఎల్విస్”, “ఎవరీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్”, “మిసెస్ హారిస్ గోస్ టు ప్యారిస్” చిత్రాలు పోటీపడ్డాయి. ► బెస్ట్ సినిమాటోగ్రఫీ - ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ ► బెస్ట్ షార్ట్ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్‌బై ► బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్- నావల్నీ ► బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - జేమీ లీ కర్టిస్(ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) ► బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- కి హుయ్ క్వాన్(ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) ► బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్- గిల్లెర్మో డెల్ టోరోస్ పినాకియో ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్నఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు హాజరయ్యారు. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఎన్టీఆర్ ఎడమ భుజంపై టైగర్ బొమ్మ ఉన్న డ్రెస్ ధరించగా, చరణ్ ఎడమ ఛాతీపై ప్రత్యేక డిజైన్ కలిగిన డ్రెస్ వేసుకున్నాడు.ఈ వేడుకలకు చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి వచ్చాడు. దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణీ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్‌తో పాటు మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.