శాంసంగ్ పెయిన్.. ఆపిల్ గెయిన్ Samsung's enduring pain is Apple's gain | Sakshi
Sakshi News home page

శాంసంగ్ పెయిన్.. ఆపిల్ గెయిన్

Published Wed, Oct 12 2016 1:24 PM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM

శాంసంగ్ పెయిన్.. ఆపిల్ గెయిన్ - Sakshi

స్మార్ట్  ఫోన్ దిగ్గజాలు  యాపిల్, శాంసంగ్ మధ్య జరుగుతున్న పోరులో  అమ్మకాల పరంగా శాంసంగ్ రారాజులా వెలిగిన మాట వాస్తవం. కానీ తాజా  స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 7  వైఫల్యం శాంసంగ్ ప్రతిష్టను దిగజార్చడంతోపాటూ ఆదాయానికి తీవ్ర గండి పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన 'నోట్ 7' ఫోన్లను దాదాపు 25 లక్షలకుపైగా రీకాల్ చేయనున్నట్టు  ప్రకటించడం సంస్థకు తీరని నష్టాన్నిమిగిల్చింది.  చివరకు రీప్లేస్ చేసిన ఫోన్లనుంచి పొగలు రావడంతో  మరింత సంక్షోభంలో కూరుకుపోయింది.  ఈ పరిణామాల నేపథ్యంలో శాంసంగ్ ఆదాయం 17 బిలియన్ డాలర్లు (1,13, 517,41,50,000 లక్షా పదమూడు వేల అయిదువందల కోట్లు)  దాదాపు రూ. 1.14 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఎనలిస్టులు అంచనావేశారు.  మరోవైపు బ్యాటరీ పేలుడు ప్రమాదాలతో శాంసంగ్  కేసులను కూడా ఎదుర్కొంటోంది.  ఇది చాలదన్నట్టు ఆపిల్ కు అనుకూలంగా  ఫెడరల్ కోర్టు  తీర్పుతో  శాంసంగ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇరు సంస్థల మధ్య  దీర్ఘకాలంగా  సాగుతున్న  పేటెంట్  హక్కుల వివాదం లో  ఆపిల్ వాదనలను కోర్టు సమర్ధించిన సంగతి తెలిసిందే.
గెలాక్సీ నోట్ 7 ఉత్పత్తిని శాశ్వంగా  నిలిపి వేస్తున్నట్టు  శాంసంగ్  ప్రకటించడంతో మార్కెట్లో ఈ షేర్ ధర భారీగా పడిపోయింది. శాంసంగ్ పరిస్థితి ఇలా ఉంటే  ఆపిల్ క్రమంగా పుంచుకుంటోంది.  శాంసంగ్ ఫస్ట్ రీకాల్ తర్వాత  శాంసంగ్ 8 శాతం క్షీణించగా, ఆపిల్ షేర్లు దాదాపు 10 శాతం  లాభపడ్డాయి.  అలాగే ఇటీవల లాంచ్ చేసిన ఐ ఫోన్ 7 స్మార్ట్ ఫోన్లు హాట్  కేకుల్లా అమ్ముడు పోయాయనీ ఆపిల్ స్వయంగా ప్రకటించింది. ఎన్ని ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేసిందీ వెల్లడించడానికి నిరాకరించిన ఆపిల్ అన్ని యూనిట్లను విక్రయించినట్టు  పేర్కొంది.  
గెలాక్సీ నోట్  7  వైఫల్యంతో  కేవలం  10  బిలియన్ డాలర్లు మేరకు   శాంసంగ్ నష్టపోయే అవకాశం ఉందనీ, గత నెల షేర్ పతనం అంత భారీదికాదని మరికొంతమంది ఎనలిస్టుల అంచనా.    సంస్థ తన  తరువాతి  స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 8  హిట్అయితే ఈ నష్టాలనుంచి కోలుకుంటుందనే ఆశాభావాన్ని   వ్యక్తం చేస్తున్నారు.  ఈ క్వార్టర్ లో  ఆపిల్ కు 45 మిలియన్ల ఐ ఫోన్లు అమ్మడు పోయాయనీ, గత ఏడాది 48 మిలియన్లతో పోలిస్తే ఇది క్షీణత అని ఎనలిస్టులంటున్నారు.
శాంసంగ్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 15.6 లక్షల కోట్లు. అయితే, ఈ మధ్య కాలంలో ఈ కంపెనీ విక్రయాలు కొంతమేర పడిపోయాయి. దీనికి తోడు గతం వారం  భారీ నష్టాలతో... కంపెనీ విలువ కూడా తగ్గపోయే అవకాశం ఉందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

 

Advertisement
 
Advertisement
 
Advertisement