![ఆ కారణాలను శాంసంగ్ కనిపెట్టేసింది..](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/4/41482135230_625x300.jpg.webp?itok=k0uOQiWN)
ఆ కారణాలను శాంసంగ్ కనిపెట్టేసింది..
Published Mon, Dec 19 2016 1:19 PM
![ఆ కారణాలను శాంసంగ్ కనిపెట్టేసింది..](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/4/41482135230_625x300.jpg.webp?itok=k0uOQiWN)
సుదీర్ఘకాల విచారణ అనంతరం ఎట్టకేలకు దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ నోట్7 పేలుళ్ల కారణాలు కనిపెట్టేసింది. గెలాక్సీ నోట్7 పేలుడుకు గల మూల కారణాలను తాము కనుగొన్నామని శాంసంగ్ రిపోర్టు చేసింది. ఈ కారణాల రిపోర్టును కొరియా టెస్టింగ్ ల్యాబోరేటరీకి, ఇతర రెగ్యులేటరీ సంస్థలకు శాంసంగ్ సమర్పించింది. అయితే ఈ వివరాలను ఇంకా ప్రజలకు వెల్లడించలేదు. పేలుళ్ల కారణాలను కనుగొన్నాం, వాటిని రెగ్యులేటరీకి సమర్పించామని మాత్రమే ఈ దక్షిణ కొరియా దిగ్గజం పేర్కొంది. గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో శాంసంగ్ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. గెలాక్సీ నోట్7 ఫోన్లలన్నింటినీ రీకాల్ చేసి సమస్యను పునరుద్ధరించుకుని మళ్లీ కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
అయినప్పటికీ ఆ సంస్థను పేలుళ్ల సమస్య వెన్నాడుతూనే ఉంది. దీంతో తమ ఫోన్లను వెనక్కిచేయలంటూ కంపెనీ ప్రకటించింది. పేలుళ్లకు అసలు మూల కారణాలేమిటో తెలుసుకోవడం కోసం ఓ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను కంపెనీ నియమించింది. ప్రస్తుతం అంతర్గత విచారణ పూర్తయిందని, ఈ రిపోర్టులను బయట ల్యాబోరేటరీలకు పంపించామని శాంసంగ్ వెల్లడించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా గెలాక్సీ నోట్7 ఫోన్‌ను శాంసంగ్ ప్రవేశపెట్టింది. కానీ ఈ ఫోన్‌కు పేలుళ్ల సమస్య తలెత్తడంతో ఎంతోకాలంగా కంపెనీ సాధించుకున్న ప్రతిష్ట మట్టిపాలైంది. చాలామంది గెలాక్సీ కస్టమర్లు ఇతర ఫోన్లకు తరలివెల్లారు. కంపెనీ త్రైమాసిక ఫలితాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. పేలుళ్ల సమస్య కనుగొనే వరకు గెలాక్సీ 8ను కూడా విడుదల చేయమని కంపెనీ జాప్యం చేస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ఫిబ్రవరిలో ఉండే అవకాశముందని తెలుస్తోంది.
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్‌పాట్ : గుండె ఆగినంత పనైందట!
- స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలతో లోక్‌సభలో దుమారం
- హిజాబ్ బ్యాన్.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
- ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్‌కు కౌంటరిచ్చిన హీరోయిన్!
- కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
- మాల్యా పెళ్లి సందడి : మెనూలో అదే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
- ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!
- సఫారీలకు సెమీస్ గండం.. ఈ సారైనా గట్టెక్కుతారా?
- భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
Advertisement