పీజీ మెడికల్‌ ఫీజుల పెంపుపై హైకోర్టు ఉత్తర్వులు | Telangan High Court Issues Order On PG Mediacal Dental Fee Outreach | Sakshi
Sakshi News home page

‘కరోనా సంక్షోభంలో ఫీజుల పెంపు విద్యార్థులకు భారమే’

Published Wed, May 20 2020 3:12 PM | Last Updated on Thu, May 21 2020 3:03 PM

Telangan High Court Issues Order On PG Mediacal Dental Fee Outreach - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌, దంత వైద్య ఫీజుల పెంపు జీవోపై తాజాగా తెలంగాణ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పీజీ మెడికల్‌, దంతవైద్య ఫీజులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఏ కేటగిరీ విద్యార్థులకు ఫీజుల్లో యాభై శాతం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. (ఏడు ఆస్పత్రుల నుంచే పరిహారం)

అంతేగాక బి కేటగిరీ విద్యార్థులు ఫీజులో 60 శాతం చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. మిగతా ఫీజుకు విద్యార్థులు బాండు రాసివ్వాలని విద్యార్థులకు కోర్టు ఆదేశించింది. ఎన్‌ఆర్‌ఐ కోటా విద్యార్థులు పూర్తి ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఇక ఫీజు చెల్లింపులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. 4 వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని టీఏఎఫ్‌ఆర్‌సీ, వైద్య కళాశాలలకు హైకోర్టు ఆదేశించింది. కరోనా సంక్షోభంలో ఫీజుల పెంపు విద్యార్థులకు భారమేనని హైకోర్టు విచారణలో వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 4 వారాలకు కోర్టు వాయిదా వేసింది. (హైకోర్టులో డాక్టర్‌ సుధాకర్‌ కేసు విచారణ‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement