దళిత మహిళను అత్యాచారం, గొంతుకోస్తే స్పందించరా? Manda Krishna Madiga Demands To Take Action In Dalit Woman Teku Lakshmi Murder Case | Sakshi
Sakshi News home page

దళిత మహిళ హత్యపై స్పందించరా?

Published Wed, Dec 4 2019 11:30 AM | Last Updated on Wed, Dec 4 2019 11:31 AM

Manda Krishna Madiga Demands To Take Action In Dalit Woman Teku Lakshmi Murder Case - Sakshi

సాక్షి, లింగాపూర్‌: ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలంలో నవంబర్‌ 25న దళిత బుడగజంగం సామాజిక వర్గానికి చెందిన మహిళపై ఎల్లాపటార్‌ గ్రామానికి చెందిన ముగ్గురు సాముహికంగా అత్యాచారం చేసి.. గొంతుకోసి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. దళిత మహిళ టేకు లక్ష్మి హత్య జరిగిన ప్రదేశాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. శంషాబాద్‌లో జరిగిన దిశ సంఘటనను పార్లమెంట్‌లో ప్రస్తావించారని, అదే లక్ష్మి ఘటనను ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు. ఉన్నత వర్గాలకు ఒక న్యాయం.. దళితులకు మరో న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. దిశ నిందితులను శిక్షించే ముందు లింగాపూర్‌ నిందితులనూ శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. దళితుల ఓట్లు కావాలిగానీ.. వారిపై హత్యాచారాలు జరిగితే మాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement