మధ్యాహ్న భోజనానికి బ్రేక్ | government stops mid day meal programme | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనానికి బ్రేక్

Published Mon, Feb 23 2015 5:12 PM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM

government stops mid day meal programme

నిజామాబాద్(కమ్మారపల్లి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం నీరుగారుతోంది. విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకానికి నిధుల కొరత బాధిస్తోంది. తాజాగా సోమవారం నిజామాబాద్ జిల్లా కమ్మారపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీ మహిళలు బిల్లులు చెల్లించడం లేదనే నెపంతో బోజన తయారీని నిలిపివేశారు. దీంతో సుమారు 350 మంది విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లి భోజనాలు చేయాల్సి వచ్చింది. భోజనం ఎందుకు అందివ్వలేదని ప్రశ్నించగా.. గత మూడు నెలలుగా తమకు బిల్లులు రావడం లేదని సొంత డబ్బులు ఖర్చు పెట్టి సరుకులు తీసుకు వచ్చే స్థోమత తమకు లేదని ఏజెన్సీ అధ్యక్షురాలు లక్ష్మి వాపోతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement